BigTV English

Flipkart Amazon Scam: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ పేరుతో సైబర్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Flipkart Amazon Scam: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్ పేరుతో సైబర్ స్కామ్.. ఈ జాగ్రత్తలు పాటించండి

Flipkart Amazon Sale Scam| సెలవుల సీజన్ వచ్చేసింది, దానితో పాటు ఆన్‌లైన్ షాపింగ్‌లో డిస్కౌంట్ సేల్ ఫెస్టివల్ ప్రకటనలు కూడా వెలువడ్డాయి. దీంతో షాపర్లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ, ఇదే సమయంలో సైబర్ మోసగాళ్లు ఆన్ లైన్ షాపింగ్ పేరుతో నకిలీ ఆర్డర్లు, వెబ్ సైట్లతో ప్రజలను దోచుకుంటున్నారు. అందుకే ప్రజలు దీని గురించి జాగ్రత్తగా ఉండాలి.


ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ సెప్టెంబర్ 23 నుంచి

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా అదే రోజు నుంచి మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు, అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ముందుగానే యాక్సెస్ ఉంటుంది. ఈ సేల్స్‌లో ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్స్, గృహోపకరణాలపై భారీ తగ్గింపులు ఉంటాయి.


సెలవుల హడావిడిలో మోసగాళ్ల ఉచ్చు
ఈ ఆఫర్‌ల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, మోసగాళ్లు కూడా ఈ సమయంలో చురుకుగా ఉంటారు. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా నకిలీ ఆఫర్‌లను పంపిస్తారు. ఉదాహరణకు, “ఐఫోన్ కేవలం ₹20,000కే” లేదా “స్మార్ట్ టీవీ 80% తగ్గింపు” వంటి ఆకర్షణీయమైన స్క్రీన్‌షాట్‌లు లేదా లింక్‌లు పంపుతారు. ఇవి చూస్తే నమ్మశక్యంగా అనిపిస్తాయి, కానీ అవి నిజం కాదు.

మోసం ఎలా జరుగుతుంది?
ఈ నకిలీ లింక్‌లపై క్లిక్ చేస్తే, మిమ్మల్ని అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది. ఈ సైట్‌లు అసలు సైట్‌ల లోగోలు, డిజైన్, ఉత్పత్తుల జాబితాను కచ్చితంగా కాపీ చేస్తాయి. పైకి అన్నీ నిజమైనట్టు కనిపిస్తాయి. కానీ, చెల్లింపు చేసిన తర్వాత, అది మోసమని తెలుస్తుంది, మీ డబ్బు అకౌంట్ నుంచి ఒక్కసారి పోయిన తరువాత తిరిగి రాదు.

సురక్షితంగా ఉండటానికి ఏం చేయాలి?
అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కొనుగోలు చేయాలి. ఆఫర్‌ల కోసం ఎల్లప్పుడూ అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌కు నేరుగా వెళ్లండి. వాట్సాప్ లేదా సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌లు లేదా స్క్రీన్‌షాట్‌లపై క్లిక్ చేయొద్దు.

  • URLని జాగ్రత్తగా చెక్ చేయండి: చెల్లింపు చేసే ముందు వెబ్‌సైట్ URLని పరిశీలించండి. అధికారిక సైట్‌లు “https://”తో మొదలవుతాయి, “http://”తో కాదు.
  • స్పెల్లింగ్‌ను గమనించండి: URL లేదా వెబ్‌సైట్ కంటెంట్‌లో స్పెల్లింగ్ లోపాలు ఉంటాయి. అది గమనించాలి. తప్పుడు స్పెల్లింగ్ ఉంటే అది నకిలీ వెబ్ సైట్.
  • వెబ్‌సైట్ వివరాలను చూడండి: అధికారిక సైట్‌లలో సంప్రదింపు వివరాలు, విధానాలు స్పష్టంగా ఉంటాయి. నకిలీ సైట్‌లలో ఇవి లేకపోవచ్చు లేదా వ్యాకరణ లోపాలు. డిజైన్ కూడా తేడాగా ఉంటుంది.

వైరల్ పోస్ట్‌లకు లొంగొద్దు
సేల్స్ సమయంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లలో నకిలీ స్క్రీన్‌షాట్‌లు షేర్ అవుతాయి. ఇవి లేదా టెక్నాలజీ గురించి తక్కువ తెలిసిన వారిని ఉచ్చులోకి లాగడానికి ఉపయోగిస్తారు. ఏదైనా అసాధారణంగా అనిపిస్తే, అది మోసమే అని గుర్తుంచుకోండి.

సందేహాస్పద లింక్‌పై క్లిక్ చేస్తే ఏం చేయాలి?
సందేహాస్పద లింక్‌పై క్లిక్ చేసినట్లయితే, ఎట్టి పరిస్థితిలోనూ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలు ఇవ్వొద్దు! వెంటనే ఆ వెబ్‌సైట్ నుంచి బయటకు వచ్చి, మీ కంప్యూటర్‌లో వైరస్ స్కాన్ చేయండి. అలాగే, ఆ లింక్ లేదా నంబర్‌ను సైబర్ క్రైమ్ పోలీసులకు రిపోర్ట్ చేయండి.

ఈ సాధారణ జాగ్రత్తలతో, మీరు సురక్షితంగా షాపింగ్ చేయవచ్చు. మోసాగాళ్ల ట్రాప్ లో పడి మీ డబ్బులు పొగొట్టుకోవద్దు.

Related News

Meta Ray Ban Glasses: మెటా రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్.. చేతి వేళ్లతోనే కెమెరా కంట్రోల్

Airbags For Planes: విమానాలకు కూడా ఎయిర్ బ్యాగ్స్.. ఇక ప్లేన్ క్రాష్ లు ఉండవా?

ThumbPay: ఫోన్ పే, గూగుల్ పే కంటే వేగంగా చెల్లింపులు.. కేవలం వేలిముద్ర వేస్తే చాలు

Redmi 15R: కేవలం రూ.15000 ధరలో 6.9 ఇంచ్ డిస్‌ప్లే.. రెడ్‌మి కొత్త ఫోన్ అదరహో

iOS 26 Battery drain: ఐఫోన్ లో కొత్తగా బ్యాటరీ సమస్యలు.. కారణం ఇదే

iPhone 17 sales: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఐఫోన్ 17 స్మార్ట్ ఫోన్లు.. అయినా వెనక్కు తగ్గని ఐఫోన్ 16

Flipkart Big Billion Days: ఫ్లిప్ కార్ట్‌ బిగ్ బిలియన్ డేస్ 2025.. ఈ ఫోన్లు అసలు కొనకూడదు

Big Stories

×