Road Accident: వనపర్తి జిల్లాలోని నాచహళ్ళి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం రాయికల్ రైస్ మిల్ దగ్గర జరిగింది. ముందుగా వెళుతున్న ఆటోను వెనుక నుంచి ఒక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను నాచహళ్ళి గ్రామానికి చెందిన రాజు, పల్లెమోని రవిగా గుర్తించారు. వారు మేకపోతుల కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మరొక వ్యక్తికి స్వల్ప గాయాలు అయ్యాయి, అయితే అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించడంతో. బాధితులను చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల శవాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు, కానీ అతి వేగం లేదా నిర్లక్ష్యం కారణంగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Also Read: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీజేపీ అభ్యర్తి ఫిక్స్.. ఎవరంటే!
ఈ ఘటనతో మృతుల కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. రాజు, పల్లెమోని రవి ఇద్దరూ గ్రామంలో సాధారణ కుటుంబాలకు చెందినవారు. వారి మృతితో కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయాయి. ప్రభుత్వం నుంచి సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.