Windows screenshot shortcuts: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. ఆఫీస్ వర్క్ అయినా, ఆన్‌లైన్ క్లాసులు అయినా, కాలేజ్ అసైన్‌మెంట్‌లు అయినా ల్యాప్‌టాప్ లేదా పీసీ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. సిస్టమ్‌లో పని చేస్తున్న సమయంలో ఏదైనా ముఖ్యమైన సమాచారం కనిపించినప్పుడు, ఆ స్క్రీన్‌ని అలాగే స్టోర్ చేయడానికి స్క్రీన్ షాట్ తీయడం ఎంతో అవసరం. అయితే.. చాలా మంది కీబోర్డ్‌పై ఉండే ప్రింట్ స్క్రీన్ బటన్ ఒక్కటే నొక్కి ఇబ్బంది పడుతుంటారు. కానీ.. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి కేవలం ఒక్క బటన్ మాత్రమే కాదు, ఏకంగా ఐదు అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన, ఈజీ పద్ధతి. మీ కీబోర్డ్‌పై ఉండే ‘PrtScn’ (Print Screen) కీని వాడటం ద్వారా మొత్తం స్క్రీన్ కాపీ అవుతుంది. దాన్ని పెయింట్ (MS Paint) లేదా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేసి ‘Ctrl + V’ నొక్కి పేస్ట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. నేరుగా ఇమేజ్ రూపంలో సేవ్ కావాలంటే ‘Windows + PrtScn’ కీలను ఒకేసారి క్లిక్ చేయండి. స్క్రీన్ ఒక్కసారి బ్లింక్ అవుతుంది. ఆపై ఆ ఫోటో మీ లాప్‌టాప్‌లోని ‘Pictures > Screenshots’ ఫోల్డర్‌లో ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది.
మొత్తం స్క్రీన్ కాకుండా కేవలం మీకు నచ్చిన నిర్దిష్ట భాగాన్ని మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలనుకుంటే ‘Snipping Tool’ బెస్ట్ ఆప్షన్. దీని కోసం కీబోర్డ్‌లో ‘Windows + Shift + S’ కీలను ఒకే సారి ప్రెస్ చేయండి. వెంటనే స్క్రీన్ డార్క్ అవుతుంది. మౌస్‌తో మీకు కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసి క్రాప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా అది క్లిప్‌బోర్డ్‌లో కాపీ అవుతుంది, లేదా నోటిఫికేషన్ క్లిక్ చేసి నేరుగా సేవ్ చేసుకోవచ్చు. విండోస్ యూజర్లకు ఇది ప్రస్తుతం బెస్ట్ పాపులర్ టెక్నిక్.
మీరు ల్యాప్ టాప్‌లో గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఇన్‌స్టంట్‌గా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ‘Windows + Alt + PrtScn’ కీలను ప్రెస్ చేయాలి. లేదా ‘Windows + G’ నొక్కి గేమ్ బార్ ఓపెన్ చేసి కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఈ ఇమేజెస్ అన్నీ ‘Videos > Captures’ ఫోల్డర్‌లో సేవ్ అవుతాయి.
Also Read: రూ.1799కే 54 గంటల బ్యాటరీనా? మ్యూజిక్ లవర్స్‌ని ఊపేస్తున్న మోడల్!
మీ ల్యాప్ టాప్ స్క్రీన్ మీద చాలా అప్లికేషన్స్ లేదా బ్రౌజర్ ట్యాబ్స్ ఓపెన్ అయి ఉన్నప్పుడు, కేవలం మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న విండోను మాత్రమే స్క్రీన్ షాట్ తీయాలంటే ఈ షార్ట్‌కట్ వాడాలి. కీబోర్డ్‌లోని ‘Alt + PrtScn’ కీలను ఒకే సారి క్లిక్ చేయండి. ఇది ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న విండో స్క్రీన్‌ను మాత్రమే కాపీ చేస్తుంది. ఆ తర్వాత దీన్ని ఎంఎస్ పెయింట్‌లో పేస్ట్ చేసి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు.
5. టచ్‌స్క్రీన్ డివైస్‌ల కోసం షార్ట్‌కట్:
మీరు టచ్‌స్క్రీన్ ల్యాప్ టాప్ లేదా ట్యాబ్లెట్ ఉపయోగిస్తుంటే.. కీబోర్డ్ అవసరం లేకుండా నేరుగా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ డివైస్‌లో ఉండే ‘Windows Logo’ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్‌ను ఒకేసారి ప్రెస్ చేయాలి. మొబైల్స్‌లో వాల్యూమ్, పవర్ బటన్ నొక్కినట్టుగానే.. ఈ టచ్‌స్క్రీన్ షార్ట్‌కట్ చాలా త్వరగా పని చేస్తుంది.
ఈ ఐదు పద్ధతుల ద్వారా మీ లాప్‌టాప్ లేదా పీసీలో క్షణాల్లో స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు. మీ అవసరానికి తగినట్టుగా ఏ షార్ట్‌కట్ ఈజీగా ఉంటుందో దాన్ని ఉపయోగించి మీ పనిని మరింత సింపుల్‌గా మార్చుకోండి.