Telugu Fantasy Movie: మధ్యతరగతి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడిని నమ్ముకుంటూ బతికే ఓ వ్యక్తి… చివరికి దేవుడిపైనే కోపం పెంచుకుంటే ? సరిగ్గా అదే సమయంలో దేవుడే అతని ముందుకు వచ్చి ఓ అద్భుతమైన పుస్తకం ఇస్తే ? ఆ పుస్తకంలో ఏది రాస్తే అది నిజమవుతుందని తెలిస్తే… మొదట్లో తన కష్టాలన్నింటినీ తీర్చుకున్న అతనికి, అదే పుస్తకం తర్వాత చుక్కలు చూపిస్తే ? దేవుడిచ్చిన వరం వెనుక ఉన్న అసలు కండిషన్ ఏంటి ? చివరికి ఆ పుస్తకం అతని జీవితాన్ని మార్చిందా ? లేక మరింత ఇబ్బందుల్లోకి నెట్టిందా? అనే ఆసక్తికరమైన ఫాంటసీ కథతో తెరకెక్కిన తెలుగు సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’ (Mister Middle Class). శ్రీకాంత్, లయ చాలాకాలం తర్వాత కలిసి నటించడం, రాజేంద్ర ప్రసాద్ దేవుడి పాత్రలో కనిపించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరి ఈ మ్యాజికల్ బుక్ కథేంటో చూద్దాం పదండి.
వెంకటరమణ (శ్రీకాంత్) మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ బాధ్యతలు, డబ్బు సమస్యలు, రోజువారీ కష్టాలతో అతని జీవితం ఎప్పుడూ ఒత్తిడితోనే సాగుతుంది. ఎంత కష్టపడినా పరిస్థితులు మాత్రం మారవు. అయినా దేవుడిపై నమ్మకంతో రోజులు గడుపుతుంటాడు. కానీ ఓ దశలో ఓపిక నశించి… తన కష్టాలకు దేవుడే కారణమన్నట్టుగా కోపం పెంచుకుంటాడు. అలాంటి సమయంలో రమణకు ఊహించని అనుభవం ఎదురవుతుంది.
సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి (రాజేంద్ర ప్రసాద్) అతని ముందుకు వచ్చి ఓ అద్భుతమైన పుస్తకాన్ని ఇస్తాడు. అందులో ఏది రాస్తే అది నిజమవుతుంది. కానీ దాన్ని వాడాలంటే కండిషన్స్ అప్లై అంటాడు దేవుడు. దీంతో ఇన్నాళ్ల కష్టాలకు ఒక్కసారిగా పరిష్కారం దొరికినట్టుగా భావించిన రమణ… మొదట ఈ వరాన్ని తనకు నచ్చినట్టుగా ఆ మ్యాజికల్ బుక్ ను ఉపయోగించుకుంటాడు. డబ్బు, అవసరాలు, తనకు కావాల్సిన విషయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతుండటంతో అతని ఆనందానికి అవధులు ఉండవు.
కానీ కోరికలు తీరుతున్న కొద్దీ రమణలో ఆశ కూడా పెరుగుతుంది. తాను రాసిన ప్రతి మాట నిజమవుతుందని నమ్మి తీసుకునే నిర్ణయాలు క్రమంగా కొత్త సమస్యలకు దారితీస్తాయి. ఇంతకీ ఆ పుస్తకానికి ఉన్న అసలు రూల్ ఏంటి ? దేవుడు రమణకు ఆ వరాన్ని ఎందుకు ఇచ్చాడు? తన కోరికలను నిజం చేసుకునే క్రమంలో రమణ ఏ తప్పులు చేశాడు? చివరికి ఆ మ్యాజికల్ బుక్ అతని కుటుంబానికి ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? అనే ప్రశ్నలతో కథ ముందుకు సాగుతుంది.
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ ఇదే ఏడాది జూలై 17న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ఆహా (Aha), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime video)లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్‌తో వచ్చిన ఈ ఫాంటసీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను కుటుంబంతో కలిసి సరదాగా చూడొచ్చు. పైగా తెలుగు మూవీ కాబట్టి ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: కొండ ఎక్కమంటే ఏడ్చేశారు… చివరికి ఈ సెలబ్రిటీలు చేసిన పని చూస్తే నవ్వాగదు