E-Paper
Advertisement

మీ ఫోన్ డేటా సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? అయితే ఈ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

మీ ఫోన్ డేటా సేఫ్‌గా ఉందనుకుంటున్నారా? అయితే ఈ నిజం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Advertisement

Hidden dangers of phone storage: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే అనిపిస్తుంది. ఇందులోనే ప్రతి చిన్న జ్ఞాపకాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో దాచుకుంటాం, ఇవే కాకుండా ఫార్వర్డ్ వచ్చే వందలాది వీడియోలు,వాట్సాప్ మీమ్స్, ఎప్పటికీ ఉపయోగపడని యాప్‌లతో ఫోన్ మెమరీని నింపేస్తుంటాం. ఇలా మనం ఎంతో ప్రేమగా మోస్తున్న ఆ ఫోన్‌లో అనవసర డేటా రోజు రోజుకూ పెరగడమే కాదు, పర్సనల్ డిటైల్స్ కూడా అత్యంత ప్రమాదంలో పడతాయి. మరి ఈ సైలెంట్ డేంజర్ నుంచి మీ ఫోన్ ఎలా కాపాడుకోవాలి? ఎలాంటి సెట్టింగ్స్ మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మన చేతి నుంచి జారని వస్తువు ఏదైనా ఉందంటే అది మన స్మార్ట్‌ఫోనే. మన జీవితంలోని ప్రతి ముఖ్యమైన క్షణాన్ని, ఆఫీస్ డాక్యుమెంట్‌ను, చివరకు ఎప్పుడో ఒకసారి చూసే జోకులు, మీమ్స్‌ను కూడా దాచుకోవడానికి ఫోన్ మెమరీని వాడుతుంటాం. వీటినే మనం డిజిటల్ క్లటర్ అంటాం. అయితే..ఇది మన స్టోరేజ్‌ను నింపేయడమే కాకుండా.. మన ప్రైవసీని గాలికి వదిలేస్తోందనే నిజం చాలా మందికి తెలియదు.

Advertisement

మనం ఫోన్ ఓపెన్ చేయగానే కనిపించే వాట్సాప్ ఆటో-డౌన్‌లోడ్స్, బ్రౌజర్ క్యాచీ ఫైల్స్, ఎప్పుడో ఒకసారి వాడి వదిలేసిన యాప్‌లు, స్క్రీన్‌షాట్లు, డూప్లికేట్ ఫొటోలు మన ఫోన్‌లో పేరుకుపోతుంటాయి. వీటిని ఎవరూ పట్టించుకోరు. “తర్వాత క్లీన్ చేద్దాంలే” అనుకుంటూ వాయిదా వేస్తుంటాం. కానీ.. ఈ చిన్న అలవాటే మన ఫోన్‌ను నెమ్మదింపజేయడమే కాకుండా.. మన రహస్యాలను హ్యాకర్లకు ఈజీగా చేరేలా చేస్తోంది.

స్టోరేజ్ సమస్యలు:

ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయినప్పుడు ఫోన్ హ్యాంగ్ అవ్వడం, వేడెక్కడం మనం చూస్తుంటాం. ముఖ్యంగా రామ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఫోన్ స్పీడ్ దారుణంగా తగ్గిపోతుంది. అత్యవసర సమయంలో.. ఫోన్ కాల్ మాట్లాడాలన్నా, ఆన్‌లైన్ పేమెంట్ చేయాలన్నా మొరాయిస్తుంది. దీని వల్ల స్ట్రెస్ పెరగడమే కాకుండా.. మన విలువైన సమయం వృధా అవుతుంది. అయితే.. ఇదంతా కేవలం టెక్నికల్ సమస్య మాత్రమే కాదు, దీని వెనక పెద్ద ప్రమాదం కూడా ఉంది.

ప్రైవసీ:

Advertisement

మనం వాడి వదిలేసిన పాత యాప్‌లు, ఎప్పుడో పంపిన పర్సనల్ ఐడీ ప్రూఫ్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్‌ల స్క్రీన్‌షాట్లు ఫోన్ లో అలాగే ఉండిపోతాయి. ఒక వేళ మీ ఫోన్ పోయినా లేదా మాల్వేర్ దాడులకు గురైనా, ఈ డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతుంది. అనధికారిక థర్డ్-పార్టీ యాప్‌లు మన ఫోన్‌లోని బ్యాక్‌గ్రౌండ్ డేటాను, కాంటాక్ట్స్‌ను గుట్టుచప్పుడు కాకుండా లాగేస్తాయి. అనవసర డేటా పేరుకుపోయిన కొద్దీ, మన ఫోన్ సెక్యూరిటీ వాల్ బలహీనపడి హ్యాకర్లకు తలుపులు తెరిచినట్లవుతుంది.

Also Read: బాఫిల్ ఫిల్టర్ Vs ఫిల్టర్ లెస్ చిమ్నీ.. డీప్ ఫ్రైస్‌కి ఏది బెస్ట్?

అనవసర డేటా ఎలా తొలగించాలి?
ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు.

అవసరం లేని యాప్‌లు: గత కొన్ని నెలలుగా అసలు వాడని యాప్‌లను వెంటనే తొలగించండి.

వాట్సాప్ ఆటో-డౌన్‌లోడ్ : పనికిరాని ఫొటోలు, వీడియోలు ఫోన్ గ్యాలరీలోకి వచ్చి పడకుండా.. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఆటో-డౌన్‌లోడ్ ఆఫ్ చేయండి.

స్క్రీన్‌షాట్లు, డూప్లికేట్ ఫొటోలు: ఎప్పుడో ఒకసారి తీసిన స్క్రీన్‌షాట్లు, ఒకేలా ఉన్న పది ఫొటోల్లో మంచిది ఉంచుకుని మిగతావి డిలీట్ చేయండి.

క్లౌడ్ బ్యాకప్ వాడుకోండి: ముఖ్యమైన ఫొటోలు, డాక్యుమెంట్లను గూగుల్ డ్రైవ్ లేదా క్లౌడ్ లో స్టోర్ చేసుకుని ఫోన్ లో స్పేస్ ఫ్రీ చేయండి

Related News

చిన్న టీవీలతో విసిగిపోయారా? ఈ ప్రొజెక్టర్ ఉంటే..ఇల్లే థియేటర్ అయిపోద్ది!

క్వాలిటీకే కట్టుబడిన యాపిల్.. భారత్‌లో రూ.83,000 కోట్ల చారిత్రాత్మక మైలురాయి!

BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

ఓరి దేవుడా.. రూ.169 కే 90 రోజుల వ్యాలిడిటీనా.. ఇది పక్కా సామాన్యుల ప్లాన్!

సేల్ మొదలవ్వకముందే లీక్ అయిన OnePlus 15 ప్రైస్.. ఇంత తక్కువకి వస్తుందని తెలిస్తే!

యాడ్స్ లేవు.. 4 నెలలు ఫ్రీ సాంగ్స్, స్పాటిఫైతో జతకట్టిన బోట్.. ఆఫర్ ఎలా పొందాలంటే?

బాఫిల్ ఫిల్టర్ Vs ఫిల్టర్ లెస్ చిమ్నీ.. డీప్ ఫ్రైస్‌కి ఏది బెస్ట్?

Big Stories

Advertisement
×