E-Paper
Advertisement

డ్రెస్సింగ్ రూంలో ఆ దుర్మార్గుడు నా కాల‌ర్ ప‌ట్టుకుని అవ‌మానించాడు

డ్రెస్సింగ్ రూంలో ఆ దుర్మార్గుడు నా కాల‌ర్ ప‌ట్టుకుని అవ‌మానించాడు
Advertisement

Irfan Pathan:  టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) మరో వివాదాస్పద స్టేట్మెంట్ చేశారు. టీమిండియా మాజీ సీనియర్ క్రికెటర్ ఒకరు, తన జెర్సీ కాలర్ పట్టుకుని బెదిరించాడని బాంబు పేల్చాడు. బ్యాటింగ్ చేసేందుకు తాను వెళుతుండగా.. డ్రెస్సింగ్ రూమ్ లోనే అడ్డుకున్నాడని… కాలర్ పట్టుకుని నువ్వెందుకు బ్యాటింగ్ కు వెళ్తున్నామని రెచ్చిపోయినట్లు గుర్తు చేశారు ఇర్ఫాన్ పఠాన్. ఇదంతా టీమిండియా అప్పటి కెప్టెన్ ఆధ్వర్యంలోనే జరిగిందని వివరించారు. ఇంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరు.. ఆ సీనియర్ క్రికెటర్ ను మందలించలేదని ఫైర్ అయ్యారు. అయితే అప్పటి కెప్టెన్ తో పాటు, కాలర్ పట్టుకున్న సదరు క్రికెటర్ పేరు మాత్రం ఇర్ఫాన్ పఠాన్ బహిర్గతం చేయలేదు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

డ్రెస్సింగ్ రూంలో ఆ దుర్మార్గుడు నా కాల‌ర్ ప‌ట్టుకున్నాడు

టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ మధ్యకాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోనీ గురించి తప్పుగా మాట్లాడి… వివాదాలకు తెర లేపుతున్నారు. అతని వల్లే, తన కెరీర్ నాశనమైంది అన్న రేంజ్ లో స్టేట్మెంట్స్ ఇచ్చారు ఇర్ఫాన్ పఠాన్. అయితే లేటెస్ట్ గా మరో సంఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ పఠాన్.. గ్రెగ్ చాపెల్ టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న సమయంలో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. అంటే ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఇర్ఫాన్ పఠాన్ కూడా ఆల్రౌండర్ గా ఎదుగుతున్నాడు.

Advertisement

Rana Naved On Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ను రెండు బంతుల్లోనే ఔట్ చేస్తా..పాక్ బౌల‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

అంతేకాదు వన్డేల్లో నెంబర్ 3 స్థానంలో కూడా ఇర్ఫాన్ పఠాన్ బ్యాటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పట్ లో ఓ వన్డే మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ ఆదేశాల మేరకు నెంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు తాను బయలుదేరారని ఇర్ఫాన్ పఠాన్ గుర్తు చేశారు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్ లోనే తన కాలర్ పట్టుకుని బెదిరించాడని ఓ సీనియర్ క్రికెటర్ గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు. అప్పుడు సచిన్ టెండూల్కర్, సౌరవ్, గంగూలీ, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ జట్టులో ఉన్నారు. వీళ్ళలో ఒకరు తన కాలర్ పట్టుకున్నారని పరోక్షంగా హింట్ ఇచ్చారు ఇర్ఫాన్ పఠాన్. తన కాలర్ పట్టుకున్నప్పటికీ, ఎవ‌రూ ఈ సంఘ‌ట‌న‌ను ఏ మాత్రం పట్టించుకోలేదని విమర్శలు చేశారు.

బెదిరించిన ఆ సీనియ‌ర్ ప్లేయ‌ర్ నేను చెప్ప‌ను

Advertisement

ప్లేయర్లంద‌రి ముందు తన కాలర్ పట్టుకొని అవమానించిన కూడా.. కోచ్ గ్రెగ్ చాపెల్ లేదా కెప్టెన్ గానీ ఆ సీనియర్ క్రికెటర్ ను మంద‌లించ‌లేద‌ని ఫైర్ అయ్యారు. ఇదే మ్యాచ్ లో ఆ సీనియర్ ప్లేయర్ త్వరగా వికెట్ సమర్పించుకున్నాడని… ఆ కోపంతో తనను బెదిరించాడని ఆరోపణలు చేశారు. అయితే ఆ సీనియర్ ప్లేయర్ పేరు మాత్రం తను బయట పెట్టనని వెల్లడించారు. టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ లేదా టీమిండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన సిరీస్ సందర్భంగా నే ఈ సంఘటన జరిగినట్లు మాత్రమే వివరించారు. ఏ మ్యాచ్ లో ఈ ఘటన జరిగిందనే విషయాన్ని మాత్రం ఇర్ఫాన్ పఠాన్ రివీల్ చేయలేదు. అయితే ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ ను వీరేంద్ర సెహ్వాగ్ బెదిరించి ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

Tanveer Ahmed On Babar Azam: టెస్టులను టీ20ల్లా బాబ‌ర్ ఆజం ఆడుతున్నాడు..ప్ర‌పంచ క్రికెట్ ను శాసిస్తాడు!

Related News

విరాట్ కోహ్లీ-అనుష్క శ‌ర్మ ప‌రువు తీసిన సోనాక్షి సిన్హా..ఆన్ ఫాలో చేసి మ‌రీ !

డ్రెస్సింగ్ రూంలో ధోని న‌ర‌కం చూపించేవాడు…ముఖంపైనే డోర్లు వేసేవాడు

వెస్టిండీస్ ను చిత్తు చేశాం…ఇక‌ WTC టైటిల్ కూడా గెలుస్తాం

వెస్టిండీస్ ఘోర ఓట‌మి..3 ఏళ్ల పాకిస్తాన్ ఆక‌లి తీర్చిన బాబ‌ర్ ఆజం

మ్యాచ్‌లు గెలవడానికి మేము బాల్ టాంపరింగ్ చేసేవాళ్ళం

పాకిస్తాన్ క్రికెట్ వెంటిలేట‌ర్ పైన ఉంది..అల్లా దిగివ‌చ్చినా కాపాడ‌లేడు

అంబానీ కోసం కాళ్లు విరిగినా ఆడ‌తావ్…టీమిండియాకు ఆడ‌మంటే గాయాలు గుర్తుకు వ‌స్తాయా ?

Big Stories

Advertisement
×