E-Paper
Advertisement

సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!

సిమ్ కార్డుల దుర్వినియోగంపై DoT తీవ్ర హెచ్చరిక.. 3 ఏళ్ల జైలు, 50 లక్షల జరిమానా!
Advertisement

DoT Penalty Rules: మనకు తెలియకుండానే మన పేరుతో మరొకరు సిమ్ కార్డులు తీసుకుని ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఆ సిమ్‌తో సైబర్ నేరం జరిగితే సమస్యలు మనకూ వచ్చే అవకాశం ఉంటుంది. దేశంలో పెరుగుతున్న డిజిటల్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం శాఖ నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. ముఖ్యంగా నకిలీ వివరాలతో సిమ్‌లు తీసుకోవడం, ఇతరుల గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయడం వంటి వాటిపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఇతరుల పేరుతో సిమ్‌లు..

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఓ సిమ్ విక్రయ ఏజెంట్ ప్రజల ఆధార్, ఇతర గుర్తింపు వివరాలను దుర్వినియోగం చేసి, వారి అనుమతి లేకుండానే 25 సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల దర్యాప్తులో ఈ విషయం బయటపడటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. సంబంధిత ఏజెంట్‌ను శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్ చేశారు.

Advertisement

Also Read: ఐఫోన్ యూజర్లకు కీలక అప్‌డేట్.. భారత్‌లోకి Apple Pay ఎంట్రీ, మరి UPI సంగతేంటి?

అనుమానాస్పద నంబర్లపై నిఘా..

ఇలాంటి మోసాలను గుర్తించేందుకు టెలికాం శాఖ డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తోంది. అనుమానాస్పదంగా కనిపించే మొబైల్ కనెక్షన్లను గుర్తించి, వాటికి సంబంధించిన వినియోగదారుల వివరాలను మళ్లీ పరిశీలిస్తారు. రీ-వెరిఫికేషన్‌లో సరైన సమాచారం ఇవ్వలేకపోతే ఆ కనెక్షన్‌ను డియాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

Advertisement

టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం.. ఇతరుల వివరాలతో మోసపూరితంగా సిమ్‌లు పొందడం, ఫోన్ ఐఎంఈఐ నంబర్లను మార్చడం వంటి చర్యలు నేరాలుగా పరిగణించబడతాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారికి కేసు స్వభావాన్ని బట్టి జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధించే నిబంధనలు ఉన్నాయి.

సిమ్ కార్డ్స్‌ను ఇలా గుర్తించండి..

మీ గుర్తింపు వివరాలతో ఎన్ని మొబైల్ నంబర్లు యాక్టివ్‌గా ఉన్నాయో ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. మీకు తెలియని నంబర్ ఏదైనా కనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. అలాగే ఆధార్, ఓటర్ ఐడీ వంటి వ్యక్తిగత వివరాలను అవసరం లేకుండా ఇతరులతో పంచుకోకుండా జాగ్రత్తపడటం మంచిది.

Also Read: ఇంటర్నెట్ వాడని వారికి భారీ ఊరట.. TRAI కొత్త రూల్స్‌తో రీఛార్జ్ ఖర్చు తగ్గే ఛాన్స్!

Tags

Related News

భూమికి మరో చంద్రుడు.. రహస్యంగా చక్కర్లు కొడుతూ, ఎట్టకేలకు దొరికేశాడు!

రూ.581కే..పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్!డోంట్ మిస్

రూ.401కే 5W పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్..బేస్ అదిరిపోతుంది

ఓట్స్‌తో హెల్దీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్..5 నిమిషాల్లో రెడీ అవుతుంది

యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ బ్లూటూత్ హెడ్‌సెట్..గోబోల్ట్ టెనెట్ లాంచ్!

ఏసీ, టీవీ కొనేటప్పుడు సేల్స్‌మెన్ చెప్పే ఈ మాటలు అస్సలు నమ్మకండి.. లేదంటే భారీగా నష్టపోతారు!

ఏఐ వల్ల తప్పు జరిగితే టెలికాం కంపెనీలదే బాధ్యత.. యూజర్ల భద్రతా దృష్ట్యా TRAI కొత్త ప్రతిపాదనలు!

Big Stories

Advertisement
×