E-Paper
Advertisement

శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!

శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!
Advertisement

Bigg Boss Krishnudu:అల్లూరి కృష్ణంరాజు అలియాస్ కృష్ణుడు(Krishnudu ) గంగోత్రి, అప్పుడప్పుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన కృష్ణుడు.. ఆర్య, పోకిరి, ఒక్కడున్నాడు, హ్యాపీడేస్, జల్సా ఇలా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, పప్పు వంటి చిత్రాలలో కీలకపాత్రలు పోషించి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న ఈయన.. 2019 తర్వాత మళ్లీ సినిమాలలో కనిపించలేదు. అయితే ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్ గా కనిపించి ఒక్కసారిగా అభిమానులను సర్ప్రైజ్ చేశారు.
బిగ్ బాస్ హౌస్లో తానేంటో నిరూపించుకుంటానని చెప్పి హౌస్ లోకి వెళ్లిన కృష్ణుడు.. రెండు వారాలలోనే బయటకు రావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. అభిమానుల ఆవేదన కాస్త పక్కన పెడితే సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం భారీగా పేలాయి.

శివాజీకి కృష్ణుడు ఛాలెంజ్..

దీనికి తోడు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్స్ శివాజీ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ బజ్ లో తాము బయటకు రావడానికి గల కారణాలను చెప్పాల్సి ఉంటుంది . ఈ క్రమంలోనే శివాజీ అడిగిన ప్రశ్నలకు కాస్త ఇన్సల్ట్ గా ఫీల్ అయిన కృష్ణుడు తాజాగా ఆయనకు ఛాలెంజ్ చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

మరీ అంత అవమానించాలా శివాజీ..

Advertisement

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కృష్ణుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంటర్వ్యూయర్ అడుగుతూ.. “శివాజీ గారి ఇంటర్వ్యూలో ఆయన మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు విన్నాక మిమ్మల్ని ఎందుకో తక్కువ చేసి మాట్లాడారని చాలామంది తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఎందుకంటే వినాయక చవితి నిమజ్జనం కూడా అవ్వలేదు అప్పుడే వచ్చేశారు.. ఏం మాట్లాడుతాను అన్న.. ఏం మాట్లాడడానికి లేదు.. నువ్వు చెప్పు నేను వింటాను.. ఇలా మాట్లాడిన మాటలు ఆడియన్స్ లో మిమ్మల్ని తక్కువ చేసారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి వాళ్లకు ఆ మాటలు వెటకారంగా అనిపించాయి. మరి మీకు బాధగా అనిపించలేదా?” అని ప్రశ్నించారు.

also read: ‘ది ప్యారడైజ్’ లో మోహన్ బాబు పాత్ర అంత భయంకరంగా ఉంటుందా?

సక్సెస్ – ఫెయిల్యూర్ ఎప్పటికీ శాశ్వతం కాదు..

Advertisement

దీనికి కృష్ణుడు మాట్లాడుతూ.. “నాకేమనిపించింది అంటే ఒకప్పుడు ఇదే శివాజీ గత 25 ఏళ్లుగా నాకు అవకాశాలు లేవని బాధపడిన ఘటనలు ప్రజలందరూ చూశారు. తన ఎమోషన్ అందరితో చెప్పుకుంటూనే ఉన్నారు. అందులో వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను శివాజీ తో మాట్లాడుతూ.. లైఫ్ లో సక్సెస్, ఫెయిల్యూర్ ఎవరికి పర్మనెంట్ కాదు. ఈరోజు సక్సెస్ వచ్చినవారు రేపు ఫెయిల్యూర్ చూడవచ్చు. నిన్న ఫెయిల్యూర్ చూసినవారు రేపు సక్సెస్ చూడవచ్చు. కేవలం నాకు ఒక మెమరీ మాత్రమే.. కానీ దాన్ని బేస్ చేసుకుని నువ్వు నన్ను ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు.. ప్రస్తుతం తను సక్సెస్ లో ఉన్నాడు.. నేను ఫెయిల్యూర్ లో ఉన్నాను. ఆయన చెప్పింది తీసుకొని.. రేపు అనే రోజు పరిస్థితులు మారిపోతాయి. కృష్ణుడు అనే వాడు అమాయకుడు కాదు వినాయకుడు.. కచ్చితంగా నేనేంటో నీకు చూపిస్తాను” అంటూ ఛాలెంజ్ చేశాడు కృష్ణుడు.

Related News

ఆ సీరియల్ సెకండ్ లైఫ్ ఇచ్చింది..గుండె నిండా గుడి గంటలు రోహిణి !

లవ్ బ్రేకప్ పై గుండె నిండా గుడి గంటలు రోహిణి కామెంట్స్.. టార్చరంటూ!

డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన విష్ణు ప్రియ..వీడియో వైరల్

అషు రెడ్డి గ్లామర్ షో.. . సోషల్ మీడియాలో కిర్రాక్ రెస్పాన్స్!

పల్లవి ప్రశాంత్ స్ట్రాటజీని ఝాన్సీ అప్లై చేస్తోందా.. చరణ్ మాటలకు అర్థం?

Nuvvu leka Nenu lenu Radha : రాధ ఆస్తుల విలువ.. త్వరలోనే పెళ్లి..?

Podarillu serial : మాధవ్ కు దిమ్మతిరిగే షాక్.. మనీష అవుట్..

Big Stories

Advertisement
×