Aadarsha kutumbam AK 47:మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram ) దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదర్శ కుటుంబం -AK47. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు పెద్ద ఎత్తున విడుదల కావాల్సిన ఈ సినిమా అనూహ్యంగా వాయిదా వేసుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి గతంలోనే ఈ సినిమా దసరా హాలిడేస్ లో విడుదల కాబోతోంది అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వైరల్ అయినా.. చిత్ర బృందం మాత్రం అక్టోబర్ 2వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో అభిమానులు ఈ సినిమా కోసం పూర్తి ఆసక్తి కనబరిచిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యంగా వాయిదా వేస్తున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మొదట ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ఆలస్యంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 9 , 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రేక్షకులకు సంపూర్ణ వినోద అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే చిత్ర విడుదలను వారం రోజులపాటు వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మధ్య తరగతి కుటుంబ నేపథ్యంలో వెంకటేష్ పాత్రను పరిచయం చేస్తూ.. హాస్యం , భావోద్వేగాలు , యాక్షన్ అంశాలతో టీజర్ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది. మరి వినోదం , కుటుంబ భావోద్వేగాల సమ్మేళనంగా ఆదర్శ కుటుంబం ఏకే 47 అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
also read:శివాజీకి బిగ్ బాస్ కృష్ణుడు ఛాలెంజ్!
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. నారా రోహిత్, నివేదా పేతురాజు, రావు రమేష్ ,సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మజీ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఎస్ . తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్ విషయానికి వస్తే.. ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలను చేస్తూ మంచి బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. అందులో భాగంగానే చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈయన.. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో కీలకపాత్ర పోషించి మెప్పించారు. ఇప్పుడు మళ్లీ అదే అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12న విడుదల అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే . కృతి శెట్టి , కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.