TRAI New Rules: స్మార్ట్‌ఫోన్ ఉన్నా ఇంటర్నెట్ ఉపయోగించని వారికి ఇకపై అదనపు ఖర్చుల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లు వాడేవారు, వృద్ధులు, కేవలం ఫోన్ కాల్స్, SMSల కోసమే మొబైల్‌ను ఉపయోగించేవారికి ఊరటనిచ్చేలా టెలికాం రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డేటా అవసరం లేకపోయినా తప్పనిసరిగా డేటాతో కూడిన ప్లాన్లను తీసుకోవాల్సిన పరిస్థితికి పరిష్కారం చూపేలా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) పలు మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రతి రీఛార్జ్‌లో డేటా ఉండాల్సిన అవసరం లేకుండా.. కేవలం వాయిస్ కాల్స్, SMSలకు ఉపయోగపడే ప్రత్యేక టారిఫ్ ప్లాన్లను అందుబాటులో ఉంచాలని టెలికాం కంపెనీలకు TRAI సూచించింది. దీంతో ఇంటర్నెట్ ఉపయోగించని వినియోగదారులు తమకు అవసరం లేని డేటా కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు.
Also Read: హోటల్ బాత్రూమ్ అద్దంతో పాటలు వినొచ్చా? ఈ హైటెక్ ఫీచర్‌ను ఎప్పుడైనా గమనించారా?
28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్ల కారణంగా ఏడాదిలో అదనంగా రీఛార్జ్ చేయాల్సి వస్తుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లతో పాటు, ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే విధంగా ఆప్షన్లు ఉండేలా చూడాలని TRAI పేర్కొంది. ఫిబ్రవరిలో తేదీలకు అనుగుణంగా ప్రత్యేక వెసులుబాటు కూడా ఉంటుంది.
వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ కాలం వ్యాలిడిటీ కలిగిన వాయిస్, SMS ప్లాన్లను కూడా అందించే అవకాశం ఉంది. దీంతో తరచూ రీఛార్జ్ చేసుకోవాల్సిన ఇబ్బంది తగ్గుతుంది.
వినియోగదారులకు ఇబ్బంది కలిగించే స్పామ్, అనవసర మార్కెటింగ్ కాల్స్‌ను అడ్డుకునేందుకు కూడా TRAI చర్యలు చేపడుతోంది. AI ఆధారిత సాంకేతికతతో మోసపూరిత కాల్స్‌ను గుర్తించి నియంత్రించే చర్యలకు ప్రాధాన్యం ఇస్తోంది. మొత్తంగా, డేటా అవసరం లేని మొబైల్ వినియోగదారులకు మరింత సరళమైన రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రావడం ప్రధాన మార్పుగా నిలవనుంది.
Also Read: ఈసారి శాంసంగ్ కొనేవారికి పండగే పండగ.. Galaxy S25 సిరీస్‌పై భారీ ఆఫర్లు!