Driver less Jeep: తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను ప్రాక్టికల్‌గా అమల్లో పెట్టినప్పుడు ఆ చదువుకు సార్ధకత ఏర్పడుతుంది. ఈ విషయంపై ఆ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సహకరించడంతో విద్యార్ధులు అద్భుతం చేశారు. డ్రైవర్ రహిత జీప్‌ను తయారు చేసి పరుగులు పెట్టిస్తున్నారు. ఆ కళాశాల రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ డీన్ ప్రొఫిసర్ శీలం సంతోష్ కుమార్ డైరక్షన్‌లో ఈ ప్రొజెక్ట్ సాగుతోంది. మారుమూల ప్రాంతంలో చదువుతున్న విద్యార్ధులు సాధించిన విజయం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆటోమేటిక్ వాహనాన్ని ఎలా పరుగులు పెట్టిస్తున్నారో ఈ స్టోరీలో మీరు చూడండి.
వరంగల్ జిల్లా నర్శంపేట శివారులోని బిట్స్ కళాశాలలో ఒక వినూత్నమైన ఇన్నోవిటివ్ కార్‌ని తయారు చేశారు విద్యార్ధులు. బిట్స్ కళాశాలలోని ప్రొఫెసర్ శీలం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్ధులు అహర్నిశలు కష్టపడి ఒక వినూత్నమైన ఏఐ టెక్నాలజీతో నడిచే జీప్‌ను తయారు చేశారు. ఈ జీప్‌ని ఆర్మీ జవాన్‌ల కోసం, మానవ రహిత సేవల కోసం ఉపయోగించవచ్చని అంటున్నారు. కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని మారుమూల ప్రాంతాల్లోను, అలాగే ఆర్మీ జవాన్‌ల కోసం ఉపయోగపడే విధంగా రూపొందించామంటున్నారు విద్యార్ధులు. ఇది ముందున్న వెహికల్స్ సెన్సార్‌ను ఉపయోగించుకుంటూ అదే దిశలో ప్రయాణించే విధంగా రూపొందించారు.
ముందుగా బైక్ తీసుకుని ఆ బైక్‌లో ఉన్న నెంబర్ ప్లేట్ సహాయంతో సెన్సార్ క్రియేట్ చేసి, సెన్సార్‌ను జీప్‌కి కనెక్ట్ చేశారు. ఇక అంతే ఆ సెన్సార్ కనెక్టైనా బైక్.. ఎటు వెళ్తే ఈ జీప్ అటే వెళుతుంది. అదే విధంగా ఎంత దూరం అయిన.. ఒక పార్ట్ క్రియేట్ చేసి ఆ దారిలో ప్రయాణించే విధంగా రూపొందించడం జరిగింది. ముఖ్యంగా దీన్ని సైనిక అవసరాల కోసం ఉపయోగించే విధంగా రూపొందించామని, అతి త్వరలో సైనిక అవసరాల కోసం ఉపయోగపడే విధంగా డెవలప్ చేస్తామని విద్యార్ధులు అంటున్నారు. ఇంకా కొత్త కొత్త ఇన్నోవేటివ్స్‌ను డెవలప్ చేసే విధంగా ముందుకు వెళుతామంటున్నారు ప్రొఫిసర్ శీలం సంతోష్.
Also Read: లాంఛ్ కు ముందే లీకైన రియల్ మీ P3 5G ఫీచర్స్
నర్శంపేట బిట్స్ కళాశాల విద్యార్ధులు ఈ ప్రోజెక్టుపై గత రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. కొత్తగా వచ్చిన ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సెన్సార్‌లతో జీప్‌ను నియంత్నిస్తున్నారు. ఈ ప్రొజెక్టులో ప్రొఫిసర్ సంతోష్ కుమార్ సహకారం చాలా ఉందంటున్నారు విద్యార్ధులు. కాలేజీ యాజమాన్యం కూడా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ వంతు సహకారం అందించింది. విద్యార్ధులు ఈ వాహనాన్ని తయారు చేయడం కోసం అయిన ఖర్చు పదిహేను నుంచి ఇరవై లక్షల(15-20) రూపాయలు కాలేజీ యాజమాన్యమే భరించింది. దీనిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేవరకు.. ఇంకా ఎంత ఖర్చు అయిన యాజమాన్యం భరించడానికి సిద్ధంగా ఉందటున్నారు విద్యార్ధులు.