E-Paper
Advertisement

అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా?

అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నారా?
Advertisement

Frequent waking up at night: ఈనాటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ప్రశాంతమైన రాత్రి నిద్ర పొందే వారి సంఖ్య చాలా తగ్గిపోతోంది. చాలా మంది రాత్రి పడుకున్నాక మధ్యమధ్యలో పదే పదే మేల్కొంటూ తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారిలో ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, రోజంతా మూడ్ సరిగ్గా లేకపోవడం లాంటివి సాధారణంగా అనుకుంటారు. కానీ.. తరచుగా రాత్రివేళ మెలకువ రావడం కేవలం శారీరక అలసట లేదా ఒత్తిడి మాత్రమే కాకపోవచ్చు! ఇది శరీరంలో అంతర్గతంగా రూపుదిద్దుకుంటున్న 5 తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట తరచుగా మేల్కొనడానికి గల 5 ప్రధాన కారణాలు:

1. స్లీప్ అప్నియా :
రాత్రి నిద్రలో ఉక్కిరిబిక్కిరి అవ్వడం, గుర్రక పెట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం స్లీప్ అప్నియా ప్రధాన లక్షణం. ఈ సమస్య ఉన్నప్పుడు నిద్రపోతున్న సమయంలో గాలి సరిగ్గా అందక మెదడు శరీరాన్ని హెచ్చరిస్తుంది. దీని వల్ల తెలియకుండానే హఠాత్తుగా మెలకువ వచ్చేస్తుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

Advertisement

2. షుగర్ లెవెల్స్ తేడాలు:
రాత్రివేళ పదే పదే యూరిన్‌కి వెళ్లాల్సి రావడం వల్ల చాలామందికి నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం అదనపు షుగర్‌ను యూరిన్ ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. అంతేకాకుండా, నిద్రలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడం వల్ల కూడా గుండె వేగంగా కొట్టుకుని కంగారుగా మెలకువ వస్తుంది.

3. థైరాయిడ్ సమస్యలు :
మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను నియంత్రించడంలో థైరాయిడ్ గ్రంథి ముఖ్య పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసినప్పుడు (ఓవర్ యాక్టివ్ థైరాయిడ్), గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఆందోళన కలగడం వంటివి జరుగుతాయి. దీనివల్ల ప్రశాంతమైన గడపాల్సిన రాత్రి నిద్రలో తరచుగా మెలకువ వచ్చి అసౌకర్యానికి గురవుతారు.

Advertisement

4. డిప్రెషన్:
మానసిక ఆరోగ్యం నిద్ర నాణ్యతపై నేరుగా ప్రభావం చూపుతుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి, అఫిషియల్ డెడ్‌లైన్స్ లేదా డిప్రెషన్‌తో బాధపడేవారి శరీరంలో ‘కోర్టిసోల్’ అనే స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది రాత్రివేళ ప్రశాంతంగా నిద్ర పోనివ్వకుండా అర్ధరాత్రి వేళల్లో పదే పదే మెలకువ వచ్చేలా చేస్తుంది.

5. యాసిడ్ రిఫ్లక్స్ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు:
రాత్రిపూట ఆలస్యంగా లేదా హెవీగా భోజనం చేసి వెంటనే.. పడుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. కడుపులోని యాసిడ్ గొంతులోకి రావడం వల్ల గుండెల్లో మంట, గొంతులో అసౌకర్యం కలిగి రాత్రివేళ హఠాత్తుగా మేల్కొనాల్సి వస్తుంది. ఇది కాల క్రమేణా జీర్ణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

మీరు కూడా రాత్రివేళ తరచుగా మేల్కొంటున్నట్లయితే.. టీ, కాఫీలు తగ్గించడం, రాత్రి తేలిక పాటి ఆహారం తీసు కోవడం, రోజూ ఒకే సమయానికి పడుకోవడం వంటి అలవాట్లు చేసుకోండి. ఇవి చేసినా సమస్య తగ్గక పోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.

Related News

ప్రోటీన్ పౌడర్ నిజంగా మంచిదేనా? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు?

అసలైన ‘హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ’ రుచి చూడాలంటే.. పాతబస్తీలో ఈ 5 చోట్లకు వెళ్లాల్సిందే!

1000 కోట్ల వజ్రాన్ని పేపర్ వెయిట్‌గా వాడిన నిజాం.. ప్రపంచంలోనే నెం.1 ధనవంతుడు ఎలా అయ్యాడు?

నరనరాల్లో టెస్టోస్టెరాన్.. ఈ తేదీల్లో పుట్టినవారు చిన్న విషయాలకే కోపపడతారు

రాత్రి డిన్నర్ తర్వాత వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుతుందా? ఎంత సేపు నడవాలి?

ఫ్రెండ్‌షిప్ డే వెనక ఉన్న.. అసలు కథ ఇదీ!

మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? రోజూ ఈ డ్రింక్ తాగితే మచ్చలు, మొటిమలు మాయం

Big Stories

Advertisement
×