BigTV English

Wanindu Hasaranga: శ్రీలంక కెప్టెన్ కు ఐసీసీ షాక్.. హసరంగాపై 2 మ్యాచ్‌ల నిషేధం..

Wanindu Hasaranga: శ్రీలంక కెప్టెన్ కు ఐసీసీ షాక్.. హసరంగాపై 2 మ్యాచ్‌ల నిషేధం..
Ban on Wanindu Hasaranga
Wanindu Hasaranga

Two Match Ban on Wanindu Hasaranga(Sports news in telugu): శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగా డిసిల్వాపై ఐసీసీ కొరడా ఝలిపించింది. అంపైర్ పై కామెంట్స్ చేసినందుకు శిక్ష విధించింది. హసరంగాపై రెండు మ్యాచ్ ల నిషేధం విధించింది.


అప్ఘనిస్థాన్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో హసరంగా అంపైర్ తో దురుసుగా ప్రవర్తించాడు. అంపైర్ లిండన్ హన్నిబల్ కు వ్యతిరేకంగా కామెంట్ చేశాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం హసరంగాపై చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ లో ఫీజులోనూ 50 శాతం కోత విధించారు. అలాగే రెండు మ్యాచ్ ల నిషేధాన్ని విధించారు. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. శ్రీలంక టీ20 కెప్టెన్ హసరంగా వేటు పడటంతో అతడు మార్చి నెలలో బంగ్లాదేశ్ జరిగే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు.

అఫ్గానిస్థాన్, శ్రీలంక మధ్య మూడో టీ20 ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీలంక విజయానికి 3 బంతుల్లో 11 రన్స్ కావాలి. చివరి ఓవర్ ను అప్ఘాన్ బౌలర్ వఫాదర్ వేశాడు. అయితే ఆ ఓవర్ నాలుగో బంతి హై ఫుల్ టాస్ గా వచ్చింది. శ్రీలకం బ్యాటర్ కమిందు మెండిస్ ఆ బంతిని ఎదుర్కొన్నాడు. బ్యాటర్ నడుము కంటే ఎత్తుకెళ్లిందని శ్రీలంక వాదన. అయితే ఆ బంతికి లెగ్ అంపైర్ హన్నిబల్ నోబాల్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్ లో చివరికి శ్రీలంక 3 రన్స్ తేడాతో ఓడింది.


Read More: వివాదాస్పదంగా మారిన జో రూట్ ఎల్బీ.. డీఆర్ఎస్‌ను నిందించిన మైకేల్ వాన్..

మ్యాచ్ ముగిసిన తర్వాత శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగా డిసిల్వా అంపైర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్ నడుము కంటే ఎక్కు వ ఎత్తులో బంతి వెళితే గమనించని హన్నిబల్ అంపైరింగ్‌కు పనికిరాడని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. హన్నిబల్ మరో వర్క్ చూసుకోవాలని కామెంట్ చేశాడు.

మరోవైపు అఫ్గానిస్థాన్ బ్యాటర్ రెహ్మానులలా గుర్భాజ్ పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అంపైర్ సూచనలను లెక్కచేయకుండా ఫీల్డ్ లో పదే పదే బ్యాట్ గ్రిప్ మార్చుకోవడంపై యాక్షన్ తీసుకుంది. గుర్భాజ్ మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతం విధించింది.

Tags

Related News

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Man Fires Gun During Cricket Match: క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల కలకలం.. అసలేం జరిగిందంటే

Avneet Kaur Kohli : విరాట్ కోహ్లీ పై అవ్నీత్ వివాదాస్పద వ్యాఖ్యలు… యాక్సిడెంట్ గా అంటూ

Dream11 – My11Circle : మోడీ సర్కార్ సంచలన నిర్ణయం.. డ్రీమ్ 11, మై సర్కిల్ 11 కు ఎన్ని కోట్ల నష్టం అంటే

Big Stories

×