Mad Square Day 1 Collections : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య చిన్న సినిమాల హవా నడుస్తుందని మరోసారి నిరూపితమైంది. మార్చి 28న థియేటర్లలో రిలీజ్ అయిన మ్యాక్స్ స్క్వేర్ సినిమా మరో రికార్డ్ ని బ్రేక్ చేసింది. మొదటి రోజే కలెక్షన్ల సునామి సృష్టించడం మామూలు విషయం కాదు. ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2023 అక్టోబర్ 6న ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు వచ్చిన కామెడీ, లవ్, యూత్ ఫల్ కంటెంట్ ‘మ్యాడ్’ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.. మూవీకి సీక్వెల్ గాని ఈ మూవీ తెరకెక్కింది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సక్సెస్ అందుకుంది. ఇక నిన్న రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మ్యాడ్ స్క్వేర్ మూవీ..
ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీకర స్టూడియో, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. స్యూరదేవర నాగవంశీ సమర్పించగా.. హారిక స్యూరదేవర, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.. గతంలో వచ్చిన మ్యాడ్ మూవీ 8 కోట్లతో తెరకెక్కింది. అయితే భారీ విజయాన్ని అందుకోవడంతో వసూళ్లు కురిపించింది. ఇప్పుడు వచ్చిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మరో రికార్డు క్రియేట్ చేసింది. మరి ఆలస్యం ఎందుకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో చూద్దాం..
Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. వాటిని అస్సలు మిస్ అవ్వకండి..
మ్యాడ్ స్క్వేర్ కలెక్షన్స్..
మ్యాడ్ స్క్వేర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 450 థియేటర్లలో విడుదలైంది. కాగా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.. ఈ మూవీకి రూ.2.9 కోట్ల రేంజ్లో గ్రాస్ బుక్కింగ్స్ జరిగాయని, ఇక ఓవర్సీస్ లో రూ.2.1 కోట్ల వరకు గ్రాస్ బుక్కింగ్స్ అయ్యాయని తెలుస్తోంది. ఇలా మొత్తంగా రూ.5 కోట్ల వరకు గ్రాస్ బుక్కింగ్స్ ను రిలీజ్ కు ముందే సేల్ జరిపింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు రూ.21 కోట్ల వరకు వసూల్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ తో కలిపి 44 కోట్లకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మరి మొదటి రోజు ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ డే అన్నీ ఏరియాల్లో కలిపి 16 కోట్ల వరకు రాబట్టినట్లు అంచనా వేశారు.. తాజాగా ఈ మూవీ కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించారు. ఊహించిన దానికంటే ఎక్కువే.. దాదాపు 20 కోట్లకు పైగా వసూల్ చేసింది.. ఒక్కరోజులో ఇంత రాబట్టడం మామూలు విషయం కాదు. ఇక L2 ఎంపురాన్ కు పోటీగా దిగిన ఈరోజు మూవీ భారీగా కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. ఇక ఈ వీకెండు ఈ మూవీ కలెక్షన్స్ డబల్ ఈ అవకాశం ఉందని ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.