E-Paper
Advertisement

Samsung Fake Phones: లక్ష రూపాయల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.35000.. మార్కెట్లో నకిలీ ఫోన్ల కలకలం

Samsung Fake Phones: లక్ష రూపాయల శాంసంగ్ ఫోన్ కేవలం రూ.35000.. మార్కెట్లో నకిలీ ఫోన్ల కలకలం
Advertisement

Samsung Fake Phones| కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేసమయంలో చాలా మంది తొందరపాటులో తప్పులు చేస్తుంటారు. తెలియకుండానే నకిలీ ఫోన్స్ కొంటారు. తక్కువ ధరకే కొనుగోలు చేశామనే సంతోషంలో ఆ ఫోన్ ఒరిజినల్ అని నమ్మి మోసపోతారు. ఇలాంటి కేసులు దేశంలో ఇటీవలి కాలంలో వెలుగు చూశాయి. దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు ఇటీవల ఒక భారీ ఫేక్ స్మార్ట్‌ఫోన్ రాకెట్‌ను బయటపెట్టారు. ఈ గ్యాంగ్ నకిలీ శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్స్‌ను ఒరిజినల్‌గా నమ్మించి కస్టమర్లకు విక్రయించింది. ముందుగా ఈ ఫోన్స్ చూస్తే.. చాలా ఖరీదైనవి, ప్రీమియం లుక్ తో కనిపిస్తాయి. అయితే ఫేక్, చైనా రీసైకిల్ పార్ట్స్‌తో ఈ ఫోన్స్ అసెంబుల్ చేయబడ్డాయి.

ఫేక్ స్మార్ట్‌ఫోన్ అసెంబ్లీ గ్యాంగ్ అరెస్ట్

ఢిల్లీ పోలీసులు స్థానిక కరోల్ బాగ్‌ ప్రాంతంలో పెద్ద రెయిడ్ చేశారు. అక్కడ చట్టవ్యతిరేకంగా నకిలీ ఫోన్ పార్ట్స్ అసెంబ్లీ, సేల్స్ జరుగుతున్నట్లుగా తేలింది. ఆ గ్యాంగ్.. ఫేక్ శామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌ను భారీ స్థాయిలో అసెంబుల్ చేసింది. పోలీసులు గ్యాంగ్ లో నలుగురిని అరెస్ట్ చేశారు. 512కు పైగా ఫేక్ శామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్స్ సీజ్ చేశారు. అసెంబ్లీకి ఉపయోగించిన టూల్స్, ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ రికవర్ చేశారు.

ఫేక్ ఫోన్స్ ఎలా తయారు చేశారు?

Advertisement

ముందుగా ఆ గ్యాంగ్.. రీసైకిల్ చేసిన తక్కువ క్వాలిటీ ఫోన్ భాగాలను ఫారిన్ సప్లయర్ల నుంచి దిగుమతి చేసుకున్నారు. వీటిలో చాలా ఫోన్ విడిభాగాలు చైనా నుంచి వచ్చాయి. మదర్‌బోర్డ్స్, కెమెరాలు, బ్యాటరీలు, ఫోన్ ఫ్రేమ్స్ ఇంపోర్ట్ చేశారు. ఇంపోర్టెడ్ పార్ట్స్‌ను లోకల్ యూజ్డ్ కంపోనెంట్స్‌తో మిక్స్ చేశారు. ప్రీమియం శామ్‌సంగ్ మోడల్స్ లాగా అసెంబుల్ చేశారు. ఈ నకిలీ ఫోన్లు.. గెలాక్సీ S అల్ట్రా, ఫోల్డ్, ఫ్లిప్ సిరీస్ ఫోన్స్ లాగే ఒరిజినల్ గా కనిపించేవి.

ఫేక్ ఫోన్స్ ఒరిజినల్ లాగా కనిపించేలా డిజైన్

నకిలీ ఫోన్ల డిజైన్ పైనే ఈ గ్యాంగ్ ముఖ్యంగా ద‌ృష్టి పెట్టింది. అందుకోసం ప్రీమియం లుక్ ఫ్రేమ్స్, ప్యాకేజింగ్ ఉపయోగించారు. ఫేక్ బ్రాండింగ్ జెన్యూన్ లాగా కనిపించేలా తయారు చేశారు. చాలా డివైసెస్ శామ్‌సంగ్ లాంటి సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్ చూపించాయి. సాధారణ బయర్లకు గుర్తించడం కష్టమైంది. అందుకే కస్టమర్స్.. చాలా మంది ఒరిజినల్ శామ్‌సంగ్ ఫోన్స్ అని నమ్మేశారు.

ఫేక్ IMEI స్టికర్స్ కస్టమర్లకు టోపీ

Advertisement

పోలీసులు వందలాది ఫేక్ IMEI స్టికర్స్ ఆ గ్యాంగ్ స్థావరం నుంచి సీజ్ చేశారు. స్టికర్స్‌పై “మేడ్ ఇన్ వియత్నాం” అని ప్రింట్ చేసి ఉంది. ఈ లేబుల్స్ నెట్‌వర్క్ వెరిఫికేషన్ చెక్స్ అవాయిడ్ చేయడానికి సహాయపడ్డాయి. ఆ స్టికర్స్ చూసి కొనుగోలు సమయంలో కస్టమర్ కాన్ఫిడెన్స్ పెంచాయి. ఫేక్ IMEI నంబర్లు కస్టమర్లను నమ్మి కస్టమర్లు పూర్తిగా మోసపోయారు.

అతి తక్కువ ధరతో కస్టమర్లకు ట్రాప్

ఒరిజినల్ ప్రీమియం శామ్‌సంగ్ ఫోన్స్ ధర రూ.1 లక్షకు పైగా ఉంటుంది. కానీ ఈ గ్యాంగ్ నకిలీ ఫోన్స్‌ను రూ.35,000 నుంచి రూ.40,000కు సేల్ చేసింది. తక్కువ ధర చూసి బడ్జెట్ బయర్లు ఫోన్ కొనడానికి ఎగబడ్డారు. డిస్కౌంటెడ్ ఒరిజినల్ ఫోన్స్ అని భావించారు. ఈ ప్రైసింగ్ స్ట్రాటజీ వల్ల ఈ స్కామ్‌ త్వరగా విస్తరించింది. చాలా మంది బాధితులు కొనుగోలు తర్వాతే జరిగిన మోసాన్ని గుర్తించారు.

ఫేక్ స్మార్ట్‌ఫోన్స్ కొనడం వల్ల ప్రమాదం

అవి ఫేక్ ఫోన్స్ అయినా అందులో యాప్స్ పనిచేస్తాయి. కానీ పర్‌ఫామెన్స్ చాలా తక్కువ క్వాలిటీ ఉంటుంది. సీరియస్ సెక్యూరిటీ రిస్క్‌లు తెస్తాయి. అందులో మాల్‌వేర్ లేదా స్పైవేర్ ఉండవచ్చు. పర్సనల్ డేటా దొంగిలించవచ్చు. మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ కాంప్రమైజ్ అవవచ్చు. ఫేక్ ఫోన్స్ సేఫ్టీ సర్టిఫికేషన్స్ లేకుండా ఉంటాయి. వీటిని సైబర్ దొంగలు త్వరగా ఈజీగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. పైగా ఫోన్ ఓవర్‌హీట్ కావడం లేదా సడన్‌గా పనిచేయడం ఆగిపోతుంది.

Also Read: ఉద్యోగులకు కోట్ల విలువైన ఇళ్లు కానుకగా ఇచ్చిన టెక్ కంపెనీ.. ఎందుకంటే

విచారణ సాగిస్తున్న పోలీసులు

ఢిల్లీ పోలీసులు విచారణ ఇంకా కొనసాగిస్తున్నారు. ఈ నకిలీ ఫోన్ల పూర్తి సప్లై చైన్ ట్రేస్ చేస్తున్నారు. సప్లయర్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి ఆరా తీస్తున్నారు. ఈ గ్యాంగ్ ఢిల్లీని దాటి ఆపరేట్ చేస్తోందని పోలీసులు అనుమానిస్తున్నారు.

నకిలీ ఫోన్లు ఇలా గుర్తించండి

కొత్త ఫోన్ కొనే సమయంలో ఆథరైజ్డ్ రిటైలర్ల నుంచి మాత్రమే ఫోన్స్ కొనండి. అసాధారణంగా చీప్ డీల్స్ గురించి తెలిసినా అవాయిడ్ చేయండి. అధికారిక వెబ్‌సైట్లలో ఫోన్ IMEI నంబర్లు వెరిఫై చేయండి. ఫోన్ ఇన్‌వాయిస్, వారంటీ కార్డ్స్ చెక్ చేయండి. ప్యాకేజింగ్, సాఫ్ట్‌వేర్ జాగ్రత్తగా చెక్ చేసినా అది ఒరిజినల్ లేదా నకిలీ ఫోన్ అని తెలుసుకోవచ్చు.

ఫేక్ స్మార్ట్‌ఫోన్ స్కామ్స్ వేగంగా పెరుగుతున్నాయి. బయర్లు సరైన సమాచారంతో అలర్ట్‌గా ఉండాలి.

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×