Financial changes in 2025 : 2024 వీడ్కోలు పలికి 2025 కు స్వాగతం చెప్పడానికి ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక కొత్త ఏడాది క్యాలెండర్ మారుతున్నట్టే ఎన్నో విషయాల్లో మార్పులు సైతం జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో సైతం ఎన్నో మార్పులు రాగా.. కొత్త ఏడాదిలో కార్ల ధరలతో పాటు వీసా నిబంధనలో పెను మార్పులు చోటుచేసుకొని ఉన్నాయి.
2025 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ఎన్నో విషయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇందులో కార్ల ధరలతో పాటు వీసా నిబంధనలు కూడా ఉన్నాయి. ఇంకా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, వాట్సాప్ సేవల్లో మార్పులు, కార్ల రేట్లలో మార్పులు ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక అసలు 2025 నుంచి రాబోతున్న మార్పులు ఏంటో ఒకసారి చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ – ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ తన సేవల్లో మార్పులు తీసుకురానుంది. డివైస్ తో సంబంధం లేకుండా ఏవైనా ఐదు డివైజులను ఒకేసారి వాడుకోవచ్చు. అయితే జవనరి 1 నుంచి ఈ సదుపాయం ఉండదు. ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీల్లో మాత్రమే ప్రైమ్ వీడియో వాడేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఇంతకు మించి వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిందే. అయితే డివైజుల సంఖ్యలో మాత్రం మార్పూ చేయలేదు.
వాట్సప్ సర్వీస్ బంద్ – ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సైతం కొత్త ఏడాది నుంచి తన రూల్స్ మార్చేసింది. పాత స్మార్ట్ ఫోన్ లకు వాట్సాప్ సేవలను నిలిపివేయనుంది. జనవరి 1 నుంచి ఆండ్రాయిడ్ కి చెందిన సాంసంగ్ గెలాక్సీ s3, మోటో జీ, HTC వన్‌ఎక్స్, MOTO రేజర్ HD, ఎల్‌జీ ఆప్టిమస్ జీ, సోనీ ఎక్స్‌పీరియా
Z వంటి కొన్ని ఫోన్స్ లో వాట్సాప్ సర్వీసులను ఆపేస్తుంది
కార్ల ధరల్లో పెరుగుదల – జనవరి 1 నుంచి అన్ని వాహన సంస్థలు తమ ధరల్ని పెంచేస్తున్నాయి ఇందులో కార్స్ ముందు వరుసలో ఉన్నాయి. వీటిలో హోండా ఇండియా, హ్యుందాయ్, మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎంజీఈ మోటార్, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్, ఆడీ సైతం ఉన్నాయి.
టీజీబీవీ సేవలు విసృతం – కేంద్రం “ఒక రాష్ట్రం – ఒక గ్రామీణ బ్యాంకు” పేరుతో గ్రామీణ బ్యాంకులను మరింత పటిష్టం పరిచే దిశగా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటివరకు ఏపీజీవీబీకి సంబంధించిన 771 శాఖల్లో తెలంగాణలో 493 శాఖలు ఉన్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుతం తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. దీంతో దేశంలోనే అతి పెద్ద గ్రామీణ బ్యాంకుగా టీజీబీవీ అవతరించనుంది.
యూపీఐ పరిమితి పెంపు – ఇక స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన UPI123PAY పరిమితి సైతం జనవరి 1నుంచి పెరగనుంది. ఇప్పటివరకూ రూ.5 వేలు ఉన్న పరిమితి ఇప్పుడు రూ.10 వేలకు మారనుంది.
ఈ వీసాతో థాయ్‌లాండ్ – వచ్చే ఏడాది జనవరి 1 నుంచి థాయిలాండ్ వీసా సేవల్లో సైతం మార్పులు రానున్నాయి. ఏ దేశానికి చెందిన వారైనా థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా సులువుగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉండగా తాజాగా ప్రతీ దేశానికి ఈ సదుపాయాన్ని కల్పిస్తుంది.
వీసా రీ షెడ్యూల్ ఫ్రీ – అమెరికా వెళ్లాలనుకునేవారు నాన్ ఇమిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే నచ్చిన లోకేషన్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇంటర్వ్యూ రీ షెడ్యూల్ చేయాలనుకుంటే ఎలాంటి అదనపు రుసుము లేకుండా రీ షెడ్యూల్ చేసుకునే ఛాన్స్ సైతం జనవరి 1 నుంచి రాబోతుంది.
ALSO READ : రూ.9499కే కళ్లు చెదిరే డిజైన్ తో లావా కొత్త ఫోన్! ఇంటి వద్దే ఫ్రీ సర్వీస్ తో