Rk Roja ఆర్కే రోజా గురించి తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రజలకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సర్పయాగం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న రోజా.. వరుస సినిమాలతో.. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. అప్పట్లో స్టార్ హీరోలకు ధీటుగా డ్యాన్స్ వేయగల హీరోయిన్స్ లో రోజా కూడా ఒకరు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న రోజా.. రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
మొదట టీడీపీలో ఉన్న ఆమె.. ఆ ఆతరువాత వైసీపీలో చేరింది. ఇక వైసీపీ లో ఎమ్మెల్యే నుంచి మంత్రిగా మారింది. ఇక జగన్ హయాంలో రోజా ఎలాంటి పనులు చేసింది. టీడీపీ పై ఎలా నిప్పులు చెరిగింది అనేది అందరికి తెల్సిందే. ప్రస్తుతం వైసీపీ అధికారం కోల్పోవడంతో రోజా.. మీడియా ముందు ఎక్కువ కనిపించడం లేదు. అప్పుడప్పుడు అధికారపార్టీని విమర్శిస్తూ పోస్టులు పెడుతూ వస్తుంది.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ కోసం రామ్ చరణ్ కు కళ్ళు తిరిగే రెమ్యూనరేషన్… కియారాకు ఎంతంటే?
ఇక ఆమె గురించి పక్కన పెడితే.. రోజా కూతురు అన్షు మాలిక ఒక అరుదైన గౌరవాన్ని అందుకుంది. నైజీరియాలోని లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో అన్షు గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డు ను అందుకుంది. అది కేవలం 20 ఏళ్ల వయస్సులోనే ఆమె అందుకోవడం గమనార్హం. ఈ విషయం తెలియడంతో అభిమానులు అన్షును అభినందిస్తున్నారు.
అన్షుకు ఇలాంటి అవార్డులు కొత్తేమి కాదు. గతంలో కూడా ఆమె ఇలాంటి అవార్డులను అందుకుంది. రోజా కూతురు అన్షు.. అచ్చు రోజాకు జిరాక్స్. కుర్ర వయస్సులో రోజా ఎలా ఉందో అలానే ఉంది. అమ్మ అందాన్ని పుణికిపుచ్చుకోవడంతో.. అందరు అన్షు టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని అందుకున్నారు. కానీ, అన్షు మాత్రం సినిమాల మీద ఆసక్తి కనపర్చడం లేదు.
అన్షు కాకుండా రోజా కొడుకు ఇండస్ట్రీ మీద ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ విషయాన్నీ రోజా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. “నా కొడుకు కౌశిక్. ఆరడుగుల హైట్ ఉంటాడు. వయస్సు 18 ఏళ్లు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు కంటే ఎక్కువగా వాడికి సినిమాలు అంటే ఆసక్తి. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నేను సినిమాల్లో నటిస్తాను అని చెప్తాడు. అంతేకాకుండా డైరెక్షన్ లో కూడా ఇంట్రెస్ట్ అంటారు. వాడికి ఆ రెండు రంగాల్లో ఎందులో స్థిరపడాలని ఉంటే అందులోనే ఎంకరేజ్ చేస్తాం. దేవుడి ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీలోకి వస్తాడు” అని చెప్పుకొచ్చింది. మరి రోజా వారసులు ఏ కెరీర్ ను ఎంచుకుంటారో చూడాలి.