Lava Yuva 2 5G : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ లావా ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం బడ్జెట్లోనే అదిరిపోయే మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టులో లావా యువ స్టార్ మొబైల్ (Lava Yuva Star) ను లాంచ్ చేసిన ఈ కంపెనీ.. తాజాగా మరో కొత్త మొబైల్ ను తీసుకొచ్చేసింది. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి.
దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా (Lava) అది తక్కువ ధరకే మరో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి లాంఛ్ చేసింది. లావా యువ 2 (Lava Yuva 2 5G) పేరుతో ఈ మెుబైల్ అందుబాటులోకి తెచ్చింది. మార్బుల్ ఫినిష్‌తో యూత్ ను మరింత ఆకట్టుకొనేలా ఈ మెుబైల్ డిజైన్ ఉంది. కేవలం ఒక్క వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. 4GB + 128GB వేరియంట్ ధర రూ.9,499 గా లావా నిర్ణయించింది. రెండు కలర్స్ లో అందుబాటులోకి వచ్చేసిన ఈ మొబైల్ మార్బుల్ బ్లాక్, మార్బుల్ వైట్ రంగుల్లో లభిస్తుంది. లావా రిటైల్ స్టోర్ల ద్వారా వీటిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది.
Lava Yuva 2 5G Features –
లావా కొత్త మెుబైల్.. 6.67 అంగుళాల HD + డిస్‌ప్లేతో వచ్చేసింది. 700నిట్స్ బ్రైట్‌నెస్, 90Hz రీఫ్రెష్ రేటుతో లాంఛ్ అయింది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఈ మెుబైల్ లో UNISOC T760 ప్రాసెసర్ అమర్చారు. కెమెరా ఫీచర్స్ విషయానికొస్తే.. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 2MP సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం ముందు వైపు 8MP కెమెరా కూడా ఉంది.
ఇంకా ఈ మొబైల్లో ఉన్న స్పెషల్ ఫీచర్స్ విషయానికి వస్తే కాల్స్ లేదా నోటిఫికేషన్స్ వస్తే కెమెరా చుట్టూ ఉన్న లైట్ బ్లింక్ అవుతుంది. 5000mAh బ్యాటరీ, 18W వైర్డ్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. డ్యూయల్ సిమ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కనెక్టివిటీ సైతం బెస్ట్ గా ఉంది. ఇందులో 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ C పోర్ట్ ఉన్నాయి.
ఇక ఈ మొబైల్ తో ఈ ఫీచర్స్ తో పాటూ మరో అదిరిపోయే బంపర్ ఆఫర్ ను లావా అందిస్తుంది. మొబైల్ కొనుగోలు చేసిన ఏడాదిలోపు ఫోన్లో ఏదైనా సమస్య వస్తే సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. నేరుగా ఇంటికే వచ్చి సర్వీస్ ను అందిస్తారు.
ఇక ఏడాది చివర్లో లాంఛ్ అయినప్పటికీ బెస్ట్ ఫీచర్స్ తో అతి తక్కువ ధరకే ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చిందని చెప్పాలి. రూ. 10వేలలోపే అదిరే మొబైల్ ను కొనాలనుకునే యూజర్స్ కు ఇది బెస్ట్ ఆప్షన్. ఇక ఇంకెందుకు ఆలస్యం మీరూ కొనాలనుకుంటే లావా రిటైల్ స్టోర్స్ లో ట్రై చేసేయండి. ఇక ఈ కొత్త మొబైల్ పై బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఈఎంఐ సదుపాయం సైతం అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ALSO READ : రూ.9499కే కళ్లు చెదిరే డిజైన్ తో లావా కొత్త ఫోన్! ఇంటి వద్దే ఫ్రీ సర్వీస్ తో