E-Paper
Advertisement

రూ.999కే బ్లూటూత్ కాలింగ్ వాచ్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కాకండి!

రూ.999కే బ్లూటూత్ కాలింగ్ వాచ్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కాకండి!
Advertisement

Fire-Boltt Rise Force smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో ..స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైం చూసుకునే గార్జెట్ మాత్రమే కాదు, అది మన ఆరోగ్యాన్ని, ఫిట్‌నెస్‌ను కాపాడే ఒక వ్యక్తిగత హెల్త్ అసిస్టెంట్. అయితే.. బ్రాండెడ్ స్మార్ట్‌వాచ్‌లు కొనాలంటే.. వేల రూపాయలు ఖర్చు పెట్టాలని చాలా మంది భావిస్తారు. ఈ అపోహను పూర్తిగా తొలగిస్తూ ఫైర్-బోల్ట్ సంస్థ కేవలం రూ. 999 బడ్జెట్‌లోనే ‘Fire-Boltt Rise Force’ స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ పాపులర్ గ్యాడ్జెట్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

1.ప్రీమియం డిజైన్,డిస్‌ప్లే:

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ చూడటానికి చాలా లగ్జరియస్‌గా, మోడ్రన్‌గా కనిపిస్తుంది. ఇందులో.. ఇచ్చిన 1.85 ఇంచుల పెద్ద హెచ్‌డీ డిస్‌ప్లే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎండలో బయటికి వెళ్లినా.. స్క్రీన్‌పై ఉన్న విషయాలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. దీనికి అమర్చిన ‘నైలాన్ ఫ్లోరోఎలాస్టోమర్’స్ట్రాప్ చాలా చాలా రోజులు పాడవకుండా ఉండటమే కాకుండా.. చేతికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. రోజంతా చేతికి పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైట్‌వెయిట్‌గా దీన్ని డిజైన్ చేశారు.

2.బ్లూటూత్ కాలింగ్ ఫీచర్:

రూ. 1000 లోపు బడ్జెట్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ రావడం నిజంగా నమ్మలేని విషయం. ఫోన్ జేబులో లేదా దూరంగా ఉన్నప్పటికీ.. ఈ వాచ్ ద్వారానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. దీనిలో బిల్ట్-ఇన్ మైక్ మరియు స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే రీసెంట్ కాల్ లాగ్స్, డైల్ ప్యాడ్ వంటి ఆప్షన్లు కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

Advertisement

3.హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ :

ఫిట్‌నెస్ లవర్స్ కోసం ఈ వాచ్‌లో అడ్వాన్స్డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. గుండె కొట్టుకునే వేగాన్ని పర్యవేక్షించడంతో పాటు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను ఇది నిరంతరం ట్రాక్ చేస్తుంది. అలాగే నిద్రపోయే విధానాన్ని విశ్లేషించి మీ ఆరోగ్య పరిస్థితిని మెరుగ్గా ఉంచుకోవడానికి సహాయ పడుతుంది. రన్నింగ్, వాకింగ్, యోగా వంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ కూడ ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read: మధ్యతరగతి కుటుంబాలకు పర్ఫెక్ట్..ఈ 5-స్టార్ ఎల్జీ వాషింగ్ మెషీన్స్!

4. బ్యాటరీ లైఫ్, స్మార్ట్ నోటిఫికేషన్లు:

బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లలో బ్యాటరీ బ్యాకప్ చాలా ముఖ్యం. ఈ మోడల్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రోజుల తరబడి ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేస్తుంది. అలాగే సోషల్ మీడియా నోటిఫికేషన్లు, వాట్సాప్ మెసేజ్‌లు, వెదర్ అప్‌డేట్స్ అన్నీ క్షణాల్లో మీకు తెలిసిపోతాయి. వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఉండటం వల్ల వర్షంలో తడిచినా.. లేదా వర్కౌట్లు చేసేటప్పుడు చెమట పట్టినా ఈ వాచ్‌కు ఎలాంటి హాని జరగదు.

మీరు అతి తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు, స్టైలిష్ లుక్ , బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ ఉన్న స్మార్ట్‌ వాచ్ కోసం చూస్తున్నట్లయితే.. కేవలం రూ.999 ధరలో లభించే ఈ మోడల్ మీకు నెంబర్ వన్ ఆప్షన్ అవుతుంది. ఇప్పుడే దీన్ని మీ సొంతం చేసుకొని మీ ఫిట్‌నెస్ జర్నీని మరింత స్టైలిష్‌గా మొదలుపెట్టండి!

Related News

ఎయిర్ ప్యూరిఫైయర్‌లో ‘హెపా ఫిల్టర్’ లేకపోతే.. ఎంత డబ్బు పెట్టి కొన్నా వేస్టే!

జియో దుమ్మురేపే ఆఫర్.. రూ.299కే 4G స్మార్ట్ ఫోన్.. 6 నెలల పాటు ఫ్రీ కాల్స్, డేటా!

మైనర్లకు సోషల్ మీడియా బ్యాన్ నిజమేనా? కేంద్రం క్లారిటీ, సుప్రీంకోర్టు కీలక సూచనలు!

USB 2.0 vs USB 3.0.. రెండింటి మధ్య తేడాలేంటి? మీ అవసరాలకు ఏది బెటర్?

ఇంటర్నెట్ లేకుండానే మొబైల్‌లో లైవ్ టీవీ ఛానల్స్.. ఇదెలా సాధ్యం అంటే?

కొత్త ఫోన్ కొనే ముందు..ఈ విషయాలు తెలియకపోతే డబ్బులు వేస్ట్!

జియో రూ.499 ప్లాన్.. ఒక్క రీఛార్జ్‌తో ఫ్యామిలీ మెుత్తానికి.. అపరిమిత 5G డేటా, ఫ్రీ కాల్స్, ఓటీటీలు!

46dB నాయిస్ క్యాన్సిలేషన్, గ్లాస్ & టైటానియం లుక్స్.. Nothing Headphone 1 Pro ఫీచర్లు ఇవే!

Big Stories

Advertisement
×