Sreenu Vaitla George Krish:శ్రీను వైట్ల..ఒకప్పుడు కామెడీకి కేరాఫ్ ..ఆయన చేసిన వెంకీ ,డీ,రెడీ,నమో వేంకటేశ,కింగ్, దూకుడు.. ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లలో నవ్వులు పూయించి, బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించినవే. అయితే ఆగడు కొట్టిన దెబ్బకి ఇప్పటికీ సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. ఇక తాజాగా శర్వానంద్ తో ‘జార్జ్ క్రిష్’ అంటూ సరికొత్త సినిమాకి ముహుర్తం పెట్టేయడంతో ఈ వెటరన్ కామెడీ డైరెక్టర్ మరోసారి విజయాల బాట పడతాడా అంటూ క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్.
ఈ సినిమాని వచ్చే ఏడు సంక్రాంతికి అంటే జనవరి 14 రిలీజ్ చేస్తామని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు.శర్వానంద్ పరంగా చూస్తే సంక్రాంతి పండగ ఇతగాడికి బాగానే కలిసివచ్చింది.ఒకటి రెండు కాదు ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి, నారీ నారీ నడుమ మురారి అంటూ ముచ్చటగా మూడు సక్సెస్ ఫుల్ సినిమాలతో సంక్రాతి స్టార్ గా ప్రూవ్ చేసుకున్నాడు.అలా చూసుకుంటే జార్జ్ క్రిష్ కూడా హిట్ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తుందా అన్న ఆశలు కలుగుతున్నాయి.
అయితే ఈ సినిమా శర్వానంద్ కన్నా శ్రీను వైట్ల కే డూ ఆర్ డై అని చెప్పాలి.ఎందుకంటే ఆగడు తర్వాత వచ్చిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్భర్ అంటోని , విశ్వం ..ఇలా ఏ సినిమా కూడా శ్రీను వైట్లకి కం బ్యాక్ ఇవ్వలేకపోయింది.
దీంతో ఇక శ్రీను వైట్లకి ఎవరూ సినిమాలు ఇచ్చే పరిస్థితి లేదా అన్న ఈ సమయంలో నేనున్నా అంటూ అనిల్ సుంకర తన AK ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా ఒక పెద్ద మిరాకిల్ అనే చెప్పాలి. అది కూడా సక్సెస్ లో శర్వానంద్ హీరోగా. ఇక దీనికి ప్రస్తుతం టాలీవుడ్ లో తన పెన్ పవర్ చూపిస్తున్న నందు సవిరిగాన మాటలు రాస్తుండటంతో సినిమా పై మంచి అంచనాలే పెరిగిపోయాయి.ఇక ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం దీనికి శర్వానంద్, శ్రీను వైట్ల ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదని, సినిమా సక్సెస్ అయ్యాకే వచ్చిన లాభాల్లో షేర్ తీసుకోబోతున్నారని తెలుస్తుంది.
మొత్తానికి శ్రీను వైట్ల శర్వానంద్ తో జోడీ కట్టడంతో ‘ఈ సారైనా జార్జ్ క్రిష్ శ్రీనుని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడా లేదా’ ఫన్నీ కామెంట్స్ వదులుతున్నారు మూవీ లవర్స్.నిజంగా శ్రీను వైట్ల కం బ్యాక ఇస్తే మాత్రం మరి కొన్నేళ్ళు థియేటర్లు నవ్వుల వర్షంలో మునగడం పక్కా !
ALSO READ :నేను హనుమంతుడి కుమార్తెని …. అనసూయ కామెంట్స్ వైరల్ !
కావాల్సిందల్లా కథలోని కామెడీ సరిగ్గా వర్కౌట్ అవ్వడమే.చూడాలి ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న విజయం వచ్చి ఒళ్లో వాలుతుందా ..లేక మరో సినిమా కోసం ఎదురు చూడాల్సిందేనా !