BigTV English

Flash Droughts:- పెరుగుతున్న ‘ఫ్లాష్ కరువులు’.. ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక..

Flash Droughts:- పెరుగుతున్న ‘ఫ్లాష్ కరువులు’.. ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక..

Flash Droughts:- అతివృష్టి, అనావృష్టి.. ఈ రెండు ఎప్పుడు, ఎలా అటాక్ చేస్తాయో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ రెండు మానవాళి జీవనానికి ఎంతోకొంత నష్టాన్ని మిగిల్చే వెళ్తాయి. ఈమధ్య కాలంలో వాతావరణ మార్పులు గురించి ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఎప్పుడు ఎక్కువగా తుఫానులు వస్తాయో, ఎప్పుడు ఎండలు ఎక్కువయ్యి కరువు అనేది సంభవిస్తుందో చెప్పడం కష్టంగా మారింది. కానీ వీటన్నింటి మధ్య ఫ్లాష్ కరువుల శాతం పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు.


చాలావరకు ప్రపంచ దేశాల్లో కరువు అనుకోకుండా వచ్చి.. తీవ్ర నష్టాన్ని మిగిల్చి వెళ్తుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వీటికే ఫ్లాష్ కరువులు అని పేరుపెట్టారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల ఈ ఫ్లాష్ కరువులు ఏర్పడుతున్నాయని వారు తెలిపారు. ఇదివరకు కరువు వచ్చేముందు శాస్త్రవేత్తలు సంకేతాలు అందేవి. దానిని బట్టి వారు ప్రజలను అలర్ట్ చేసేవారు. కానీ ఫ్లాష్ కరువులు అలా కాదు.. అవి ఎప్పుడు, ఎలా వస్తాయో కనిపెట్టడం కష్టమని చెప్తున్నారు. అంతే కాకుండా అవి వచ్చిన తర్వాత కూడా మళ్లీ మామూలు స్థితికి రావడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు.

ఇప్పటివరకు కరువు అనేది పక్షాలవారీగా లేదా సంవత్సరానికి ఒకసారి.. అలా వస్తూ ఉండేవి. అవి వచ్చినప్పుడల్లా వాతావరణంలో తీవ్ర మార్పులు జరిగేవి. కానీ దాదాపుగా గత ఆరేళ్ల నుండి కరువును ముందస్తుగా గుర్తించడం కష్టమయిపోయింది. ఒకవేళ ముందుగా గుర్తించినా కూడా ప్రజలను అలర్ట్ చేసేలోపు అవి నష్టాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఎకోసిస్టమ్‌లో, వాతావరణంలో ఎలాంటి భయంకరమైన మార్పులు జరుగుతున్నాయో చెప్పేయవచ్చు అంటున్నారు నిపుణులు.


ఫ్లాష్ కరువులు వచ్చినప్పుడు కూడా కొన్ని చెట్లు బ్రతకగలవని, కానీ అవి పర్యావరణానికి హాని చేసేవి మాత్రమే అయ్యింటాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. 2012లో అమెరికాలో ఒక ఫ్లాష్ కరువు వచ్చింది. ఆ సమయంలో ఆ దేశం 30 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. అంతా బాగానే ఉంది అనుకునే ప్రాంతాలు కూడా కరువు వల్ల పూర్తిగా మారిపోతున్నాయని, అది కూడా కేవలం ఒక నెల వ్యవధిలో ఇలా జరుగుతున్నాయని వారు తెలిపారు.

ఇటీవల చేసిన పరిశోధనల్లో.. పలు ప్రపంచ దేశాల్లో ఫ్లాష్ కరువు అనేది వేగంగా వ్యాపిస్తుందని తెలిసింది. వీటి గురించి పూర్తిస్థాయిలో పరీక్షించడం కోసమే 1951 నుండి 2014 మధ్యలో ఎక్కువగా కరువుకు నష్టపోయిన ప్రాంతాల నుండి మట్టిని సేకరించారు శాస్త్రవేత్తలు. దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. త్వరలోనే ఫ్లాష్ కరువులకు ఒక పరిష్కారని కనుక్కుంటామని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. కలిసికట్టుగా అయితేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని వారు భావిస్తున్నారు.

Tags

Related News

Tecno Phantom V Fold 2 5G: సూపర్ ఆఫర్ గురూ.. 12GB ర్యామ్ గల ఫోల్డెబుల్ ఫోన్‌పై రూ.47000 డిస్కౌంట్..

Apple MacBook: కేవలం రూ.52000కే ఆపిల్ ల్యాప్ టాప్.. కొత్త మ్యాక్‌బుక్ త్వరలోనే లాంచ్

Moon Dust Bricks: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు ఇటుకలు సిద్ధం.. ‘మూన్ డస్ట్ బ్రిక్స్’ మెషిన్ సిద్ధం చేసిన చైనా సైంటిస్ట్

iQOO Z10 4G: 6,000mAh బ్యాటరీతో వచ్చిన కొత్త iQOO Z10 4G.. ఫీచర్లు ఏంటో చూడండి!

Realme P4 5G: గేమింగ్ ప్రేమికుల కలల ఫోన్ వచ్చేస్తోంది.. దీని ఫీచర్స్ ఒక్కొక్కటి అదుర్స్..!

Smartphone market: సూపర్ షాట్ కొట్టిన స్మార్ట్ ఫోన్ ఏది? ఈ జాబితాలో మీ ఫోన్ ర్యాంక్ ఎంత?

Big Stories

×