Flipkart Big Billion Days Deals: తక్కువ ధరలో మంచి ఫీచర్లున్న 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్లపై ఓ లుక్కేయాల్సిందే! ఐఫోన్ 17, ఐఫోన్ 15 నుంచి శాంసంగ్ గెలాక్సీ, ఒప్పో, పోకో ఫోన్ల వరకు పలు మోడళ్లపై ధరల తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ ఆఫర్లు, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు కలిస్తే కొన్ని ఫోన్లను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం ఉంది. మీ బడ్జెట్‌కు ఏ ఫోన్ సరిపోతుంది? ఏ మోడల్‌పై ఎంత తగ్గింపు లభిస్తోంది? ఏ ఫోన్‌లో ఎలాంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి? ఫోన్ కొనేముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
యాపిల్ లవర్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 ఇప్పుడు రూ.79,999 లభ్యం అవుతోంది. సాధారణంగా రూ.99,900 ఉన్న ఈ మోడల్ పై బ్యాంకు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో భారీగా ధర తగ్గింది. అలాగే ఐఫోన్ 15 ప్రియులకు రూ.63,999కే అందుబాటులో ఉంది. పాత ఫోన్ మార్చుకుని కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా సూపర్ ఛాన్స్.
Also Read: షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!
శాంసంగ్ బ్రాండ్ ఇష్టపడే వారి కోసం గెలాక్సీ A36 5G మంచి ఎంపిక. దీని అసలు ధర రూ.39,499 కాగా, సేల్‌లో రూ.25,999కే లభిస్తోంది. ఇందులో 8GB ర్యామ్, 5000mAh బ్యాటరీతో పాటు 50 మెగాపిక్సెల్ కెమెరా రావడం విశేషం. మిడ్ రేంజ్ బడ్జెట్‌లో శామ్‌సంగ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది సరైన డీల్.
చాలా సమయం ఫోన్ వాడే వారికి ఒప్పో K14 ప్లస్ 5G బాగా సెట్ అవుతుంది. రూ.29,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ.25,999కి లభిస్తోంది. అతిపెద్ద 8,000mAh బ్యాటరీ, 144Hz స్క్రీన్ రీఫ్రెష్ రేట్ ఉండటంతో గేమింగ్, కంటెంట్ వాచింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.
తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే పోకో X8 5G ఇప్పుడు రూ.24,999కే అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీ దీని సొంతం. కాబట్టి బ్యాటరీ ఛార్జింగ్ టెన్షన్ లేకుండా రోజంతా వాడుకోవచ్చు. మొత్తానికి.. మీరు ఏ ఫోన్ కొనేముందైనా ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో ప్రైస్, మీ బ్యాంక్ కార్డుకు వచ్చే ఆఫర్‌ను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.
Also Read: రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!