Vivo X300 Ultra Price Cut: తక్కువ బడ్జెట్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది బిగ్ సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రీమియం ఫోన్లపై అదిరిపోయే డీల్స్ సందడి చేస్తున్నాయి. వీటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది వివోకు చెందిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Vivo X300 Ultra. అత్యాధునిక ఫీచర్లు కోరుకునే టెక్ లవర్స్‌ను ఆకట్టుకునే ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులోకి రావడంతో.. ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా మారింది. మరి ఈ ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తోంది? ఆఫర్ ధర ఎంత? ఈ డీల్ మిస్ కాకుండా ఉండాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..
సాధారణంగా వివో X300 అల్ట్రా అధికారిక మార్కెట్ ధర రూ.1,59,999గా ఉంది. అయితే ఈ అమెజాన్ సేల్‌లో బ్యాంక్ కార్డులను ఉపయోగించి ఈ ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ఐసిఐసిఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ఏకంగా రూ.16,300 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ఉంటే రూ.16,050 వరకు ఆదా చేసుకోవచ్చు. వీటితో పాటు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తక్కువ ధరకే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను చేజిక్కించుకోవచ్చు.
Also Read: ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయండి.. లేదంటే మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!
ఈ స్మార్ట్‌ఫోన్‌లో డిస్‌ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో 6.82 అంగుళాల AMOLED 2K డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి గేమింగ్, స్క్రోలింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. అలాగే డాల్బీ విజన్, HDR10+, నెట్‌ఫ్లిక్స్ HDR వంటి ఫీచర్లు ఉండటం వల్ల సినిమాలు, వీడియోలు చూసేటప్పుడు విజువల్స్ చాలా రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి.
పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అడ్రినో 840 GPUతో తోడవ్వడంతో హెవీ గేమింగ్, మల్టీ టాస్కింగ్ చాలా వేగంగా జరుగుతాయి. బ్యాటరీ విభాగంలో కూడా ఈ ఫోన్ ఎక్కడా తగ్గలేదు. ఇందులో ఏకంగా 6,600mAh భారీ బ్యాటరీ ఉంది. దీనికి తోడు 100 డబ్ల్యూ వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్, 40 డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
వివో ఎప్పుడూ కెమెరాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. ఈ X300 అల్ట్రా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, మరొక 200 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 50 మెగాపిక్సెల్ షూటర్‌ను ఇచ్చారు. ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక డ్రీమ్ ఫోన్ అని చెప్పొచ్చు.
Also Read: వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!