E-Paper
Advertisement

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఆఫర్ల ఆశ.. సైబర్ మోసాల మోత! ఆన్‌లైన్‌లో కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Advertisement

 Flipkart Scams: ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. వాట్సాప్‌లో లక్కీ విన్నర్‌ మెసేజ్‌లు.. ఐఫోన్‌ కేవలం 999 రూపాయలకే అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లు.. లింక్‌ ఓపెన్‌ చేసి డబ్బులు కట్టగానే అసలు కథ మొదలవుతుంది. డెలివరీ ఛార్జీలు.. జీఎస్టీ.. ఇతర ఫీజులంటూ విడతల వారీగా డబ్బులు గుంజుతారు. చివరికి ప్రొడక్ట్‌ రాదు.. కట్టిన డబ్బూ తిరిగి రాదు.

గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు

Advertisement

ఇంకొందరు గూగుల్‌లో నకిలీ కస్టమర్‌ కేర్‌ నంబర్లు పెడుతున్నారు. రీఫండ్‌ ఇప్పిస్తామంటూ AnyDesk, TeamViewer వంటి యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయమంటున్నారు. వాటి ద్వారా ఫోన్‌ను యాక్సెస్‌ చేసే అవకాశం దొరికితే మీ బ్యాంకింగ్‌ వివరాలకూ ముప్పు తప్పదు. అందుకే అపరిచితులు చెప్పిన యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేయొద్దు.. OTP, UPI PIN ఎవరితోనూ పంచుకోవద్దు.

డిస్కౌంట్‌ చూసి ఆశపడొద్దు.. లింక్‌ చూసి మోసపోవద్దు

Advertisement

గుర్తుంచుకోండి.. ఆఫర్లు అధికారిక యాప్‌లోనే చెక్‌ చేయండి. కస్టమర్‌ కేర్‌ వివరాల కోసం సంబంధిత సంస్థ అధికారిక యాప్‌ లేదా వెబ్‌సైట్‌నే ఉపయోగించండి. మోసానికి గురైతే వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి. ఆలస్యం చేస్తే డబ్బు వెనక్కి రావడం మరింత కష్టమవుతుంది. డిస్కౌంట్‌ చూసి ఆశపడొద్దు.. లింక్‌ చూసి మోసపోవద్దు. ఆన్‌లైన్‌లో అప్రమత్తతే మీ డబ్బుకు రక్షణ.

Also Read: మన డేటా అమెరికా చేతుల్లోకి వెళ్తుందా? స్టార్‌లింక్ ఎంట్రీపై నిపుణుల సంచలన హెచ్చరిక!

Tags

Related News

తక్కువ బడ్జెట్‌లో సూపర్ సౌండ్..40 గంటల బ్యాటరీ లైఫ్‌తో ఇయర్‌బడ్స్

హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్..తక్కువ ధరలో భారీ స్క్రీన్

వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?

ఔటింగ్స్, పార్టీల కోసం పర్‌ఫెక్ట్ స్పీకర్..రూ.1,999కే అదిరిపోయే సౌండ్!

ఆఫ్‌సీజన్‌లో ఇంత తక్కువకా? అమెజాన్ సేల్‌లో సగానికి సగం తగ్గిన 5-స్టార్ ఏసీల ధరలు!

సూపర్ ప్రాసెసర్, కొత్త డిజైన్‌తో iPad Mini 8.. కానీ ఆ విషయంలో యాపిల్ నిరాశపరిచింది!

సేల్‌లో..టీవీలపై భారీ డిస్కౌంట్! ఎగబడి కొంటున్న జనం

Big Stories

Advertisement
×