Jabardasth Rohini:2026 సెలెబ్రెటీలకు వ్యక్తిగతంగా బాగా కలిసి వచ్చింది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలోనే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పునర్నవి, ప్రిన్స్ సెసిల్ లాంటి కొంతమంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక మరొకవైపు మరికొంతమంది సెలబ్రిటీలు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటిస్తుంటే.. ఇంకొంతమంది ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ గా పేరు సొంతం చేసుకున్న బాబు తన ప్రేయసిని పరిచయం చేయగా.. ఇప్పుడు తాను కూడా వివాహానికి సిద్ధమవుతున్నాను అంటూ జబర్దస్త్ రోహిణి (Jabardasth Rohini) చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ త్రెడ్స్ ద్వారా పంచుకున్న ఒక పోస్టు అభిమానులలో సంతోషాన్ని నింపింది. సినిమాలు, షోలు అంటూ నిత్యం బిజీగా గడిపేస్తున్న జబర్దస్త్ రోహిణి తాజాగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ..” ఎట్టకేలకు ఇది నిజమయింది.. నా సోల్మెట్ దొరికారు” అంటూ కామెంట్ చేసింది. పైగా డిసెంబర్ నెల ను ట్యాగ్ చేయడంతో డిసెంబర్లో పెళ్లి జరగబోతోందా? లేక డిసెంబర్లో తన కాబోయే భర్తను పరిచయం చేయబోతోందా? అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్ . ఏది ఏమైనా రోహిణి కూడా వైవాహిక బంధం లోకి అడుగుపెట్టబోతోందని చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇకపోతే రోహిణి వివాహం చేసుకోబోతున్న వ్యక్తి ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి? అనే విషయాల పై కూడా ఆరా తీస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు రోహిణి చేసిన పోస్ట్ పై సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఈమె గతంలో కూడా పెళ్లి విషయంపై సరదాగా పోస్ట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి . ఒకసారి ఏఐ ద్వారా రూపొందించిన యువకుడి ఫోటోని షేర్ చేస్తూ.. ఇతడే తన భర్త అన్నట్లుగా చూపించింది. దీంతో నిజంగానే ఈ పోస్ట్ పెట్టిందనుకొని.. పెళ్లి చేసుకోబోతోందా అనే కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వ్యక్తం అయ్యాయి. ఆ తరువాత అసలు విషయం వెల్లడించింది రోహిణి. ఆ ఫోటోని కొద్దిసేపటికే తొలగించి , అది ఒక షోలో భాగంగా చేసిన ఫ్రాంక్ అని స్పష్టం చేసింది. ఇక దీంతో ఇప్పుడు కూడా ఇలా అభిమానులను వెర్రోలను చేయబోతోందా అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రోహిణి చేసిన ఈ పోస్ట్ వెనుక అసలు ఆంతర్యం ఏమిటో ఆమె స్పందిస్తే తప్ప తెలియదనే చెప్పాలి.
also read:రణబాలికి రూ. 120 కోట్లు.. అప్పుడే వచ్చిందెంతంటే?
రోహిణి విషయానికి వస్తే.. బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె తొలిసారి సీరియల్స్ ద్వారానే తన కెరీర్ను మొదలుపెట్టింది. అక్కడ సత్తా చాటిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం విత్ స్టార్ మా పరివారం వంటి షోలలో సందడి చేస్తోంది. మరొకవైపు సినిమాలలో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారిన ఈమె అప్పుడప్పుడు ఇలా పెళ్లిపై చేసే కామెంట్లు మాత్రం మారుతున్నాయి.