E-Paper
Advertisement

‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!

‘రణబాలి’లో అంత మ్యాటర్ ఉందా.. విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే!
Advertisement

Ranabali Movie:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’గురించి ఆసక్తికరమైన  విషయాలు చెప్పుకొచ్చాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.

ఈ సినిమా కేవలం యాక్షన్ సన్నివేశాలు, భారీ విజువల్స్‌తో  ఆకట్టుకోవడమే కాకుండా, మన చరిత్ర, సంస్కృతి గురించి ఆలోచింపజేస్తుందని చెప్పుకొచ్చాడు. థియేటర్‌లో సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను వెంటాడతాయని కాన్ఫిడెంట్ గా తెలిపాడు విజయ్ దేవరకొండ.

Advertisement

రణబాలిగా ప్రేక్షకుల అలరించేందుకు రెడీ

రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, టీ-సిరీస్ సమర్పిస్తున్న సంగతి తెల్సిందే . రష్మిక మందన్న జయమ్మ పాత్రలో కనిపించనుండగా, విజయ్ దేవరకొండ రణబాలిగా ప్రేక్షకుల అలరించేందుకు రెడీ అయిపోయాడు.చారిత్రక నేపథ్యం, రాయలసీమ వాతావరణం, మాస్ యాక్షన్, భావోద్వేగాలను కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలిపారు మేకర్స్.

Advertisement

‘పెళ్లి చూపులు’ తర్వాత కంఫర్టబుల్‌గా ప్రమోషన్స్ 

ఇక ఈ సినిమా గురించి మాట్లాడిన విజయ్.. ‘పెళ్లి చూపులు’ తర్వాత తాను ఎంతో కంఫర్టబుల్‌గా ప్రమోషన్స్ చేస్తున్న సినిమా ఇదేనని చెప్పడం విశేషం. కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ముందు చాలా సార్లు చెక్ చేసుకున్నామని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టామని చెప్పారు. సినిమా బ్యాక్‌డ్రాప్‌కు తగ్గట్టుగా భారీ స్థాయిలో సీజీ వర్క్ అవసరమైందని, అందుకు సంబంధించిన పనులను ముందుగానే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నామని వివరించారు.

నేటి తరానికి పరిచయం చేయాలనే

అయితే ‘రణబాలి’ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చరిత్రలో సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, బ్రిటిష్ పాలనలో జరిగిన అన్యాయాలు, తమ ఆత్మగౌరవం కోసం పోరాడిన వీరుల కథలను నేటి తరానికి పరిచయం చేయాలనే ఆలోచనతో ఈ సినిమాను రూపొందించినట్లు వివరించారు. చరిత్ర పుస్తకాల్లో తేదీలు, యుద్ధాల పేర్లు తెలుసుకోవడమే కాకుండా, అప్పట్లో ప్రజలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని బయట పెట్టాడు రౌడీ హీరో.

బ్రిటిష్ పాలన సమయంలో కరువులు, పన్నుల భారం కారణంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఆ కాలం గురించి మరింత లోతుగా తెలుసుకుంటే ఎన్నో చేదు నిజాలు బయటపడతాయని విజయ్ అన్నారు. ముఖ్యంగా రైల్వేలని నిర్మించడం వెనుక బ్రిటీష్ వారికున్న వ్యాపార అవసరాలని కూడా  అర్థం చేసుకోవాలని చెప్పాడు.

అలాంటి వీరుల స్ఫూర్తితోనే ‘రణబాలి’

చరిత్రలో గుర్తింపు పొందని ఎంతోమంది వీరుల కథలు జానపదాల రూపంలో ప్రజల్లో నిలిచిపోయాయని ,గ్రామాల్లో పాడుకునే పాటలు, తరతరాలుగా చెప్పుకునే కథల ద్వారా గతంలోని పోరాటాల గురించి తెలుసుకునే అవకాశం లభించిందని చెప్పారు. అలాంటి వీరుల స్ఫూర్తితోనే ‘రణబాలి’ కథను తీర్చిదిద్దినట్లు వివరించారు. మన సంస్కృతి, గ్రామీణ జీవన విధానం, ప్రజల నమ్మకాలు కూడా ఈ సినిమాలో కీలకంగా కనిపిస్తాయని తెలిపాడు.

సుమారు 2 గంటల 50 నిమిషాలు

ఇక సినిమా యాక్షన్ విషయంలోనూ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని , అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ ని  రూపొందించామని, కేవలం మాస్ కోసం యాక్షన్ పెట్టకుండా కథలో భాగంగానే వాటిని డిజైన్ చేశామని చెప్పుకొచ్చాడు విజయ్.ఈ సినిమా  సుమారు 2 గంటల 50 నిమిషాలు ఉంటుందని  ప్రేక్షకులు థియేటర్‌లో కూర్చున్న కొద్దిసేపటికే ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

రెండు నుంచి మూడు నెలల పాటు శిక్షణ

రణబాలి పాత్ర కోసం విజయ్ దేవరకొండ రాయలసీమ యాసపై ప్రత్యేకంగా సాధన చేశానని,పుట్టపర్తిలో చదువుకున్న సమయంలో ఆ ప్రాంత యాస కొంత పరిచయమైనప్పటికీ, పాత్రకు తగ్గట్టుగా మాట్లాడేందుకు రెండు నుంచి మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నట్లు చెప్పారు. గుర్రపు స్వారీ కోసం కూడా కష్టపడ్డానని వివరించారు. సాధారణంగా తక్కువగా మాట్లాడే హీరో పాత్రలకు భిన్నంగా, రణబాలి తన అభిప్రాయాలను బలంగా వ్యక్తపరిచే వ్యక్తిగా ఉంటాడని తెలిపాడు.

రష్మిక మందన్నతో కలిసి నటించడం చాలా ప్రత్యేకంగా ఉందని ,జయమ్మ పాత్రకు రష్మిక సరిపోతుందని దర్శకుడు సూచించారని, గతంలో కలిసి నటించిన అనుభవం కంటే ఈ సినిమా ఇద్దరికీ ప్రత్యేకమైనదని, తమ నిజ జీవిత పరిచయం కూడా పాత్రల మధ్య కెమిస్ట్రీకి ఉపయోగపడుతుందని తెలిపాడు.

రాజమౌళితో చేసే సినిమా మినహా

చారిత్రక నేపథ్యంతో భారీ స్థాయిలో రూపొందుతున్న ‘రణబాలి’పై చిత్ర బృందం మంచి నమ్మకంతో ఉంది. కేవలం ప్రచారంతో హైప్ పెంచడం కాకుండా, సినిమాలోని అసలు విషయాన్ని ప్రేక్షకులకు చేరవేయాలన్నదే తమ లక్ష్యమని విజయ్ స్పష్టం చేశాడు. అలాగే తన సినిమాలకు టికెట్ ధరలు పెంచడం ఇష్టం లేదని, రాజమౌళితో చేసే సినిమా మినహా భవిష్యత్తులో తన చిత్రాలకు టికెట్ హైక్స్ ఉండకూడదనేది తన అభిప్రాయమని బయటపెట్టాడు.

మొత్తానికి ‘రణబాలి’తో విజయ్ దేవరకొండ మరోసారి తన నటనలో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.మరి చరిత్ర, సంస్కృతి, భావోద్వేగాలు, యాక్షన్ కలిసిన ఈ సినిమా  ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.

ALSO READ :నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!

Tags

Related News

సంధ్య 70MM హిస్టరీ.. ఈ థియేటర్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

వాళ్లంతా క్రిమినల్స్.. డైరెక్టర్లపై రెచ్చిపోయిన కోన వెంకట్!

రణబాలి కోసం విజయ్ రష్మిక రెమ్యూనరేషన్ ఎంతంటే?

‘బ్లడీ రోమియో’గా నాని..లుక్ టెస్ట్ పూర్తి.. అదిరిపోయిన లుక్

సత్య సాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది..కానీ: విజయ్ దేవరకొండ

నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!

మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

Big Stories

Advertisement
×