Flipkart GOAT Sale 2026: యాపిల్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జులై 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ 2026 ప్రారంభం కానుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లను ప్రకటించింది. అయితే అందరి కళ్లు ఐఫోన్లపైనే ఉన్నాయి. ఈ సేల్‌లో iPhone 17 సిరీస్‌తో పాటు పాత మోడళ్లపై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్లను ఇవ్వనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే హింట్ ఇచ్చింది.
ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్‌లో భాగంగా లేటెస్ట్ iPhone 17 మోడళ్లపై కంపెనీ భారీగా ధరలను తగ్గించింది. సాధారణంగా రూ.1,49,900 ఉన్న ప్రీమియం మోడల్ iPhone Pro Max ఈ సేల్‌లో ఏకంగా రూ.1,27,900కే లభించనుంది. అలాగే iPhone 17 Pro మోడల్‌పై రూ.22,000 తగ్గింపు లభించడంతో దీనిని రూ.1,12,900కి సొంతం చేసుకోవచ్చు. బేసిక్ మోడల్ అయిన iPhone 17 కూడా రూ.82,900 నుండి తగ్గి రూ.70,900లకే అందుబాటులోకి రానుంది.
యాపిల్ ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న సరికొత్త ఐఫోన్ ఎయిర్ మోడల్‌పై కూడా ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది. సాధారణంగా రూ.1,19,900కి దొరికే ఈ సన్నని, తేలికపాటి ఫోన్‌ను సేల్‌లో రూ.95,900కే కొనుగోలు చేయవచ్చు. వీటితో పాటు ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన iPhone 17e ధర కూడా రూ.64,900 నుండి రూ.60,900కి తగ్గింది.
కొత్త మోడళ్లే కాకుండా.. పాత తరం ఐఫోన్లను కొనాలనుకునే వారికి కూడా ఇది మంచి అవకాశం. ఈ సేల్‌లో iPhone 16 మోడల్ రూ.59,900కి, iPhone 16 Plus రూ.73,900కి దొరకనున్నాయి. అలాగే iPhone 16e మోడల్ రూ.55,900కి, iPhone 15 కేవలం రూ.49,900కే అందుబాటులోకి రానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బ్లాక్, ప్లస్ మెంబర్లకు ఈ సేల్ ఒక రోజు ముందే అంటే 24 గంటల ముందే లైవ్ అవుతుంది. నేరుగా తగ్గే ధరలతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించే వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పైన పేర్కొన్న సేల్ ధరలన్నీ బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో కలిపి లభించే ఎఫెక్టివ్ ధరలని గమనించాలి.
Also Read: ల్యాప్‌టాప్‌ను మించిన పెర్ఫార్మెన్స్.. 185Hz డిస్‌ప్లేతో వస్తున్న Red Magic 5 Pro Tablet!