Illegal Bakery: స్వేచ్ఛ బ్యూరో: జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజీద్‌పూర్‌లో అక్రమంగా ఏం సి ఆర్ బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై ఎస్‌వోటీ కుత్బుల్లాపూర్ బృందం దాడులు నిర్వహించింది. ట్రేడ్, ఫుడ్ లైసెన్సులు లేకుండానే గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, వివిధ రకాల ఫ్లేవర్లతో బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించింది.
Also read: Ayodhya Ram Mandir: అయోధ్య విరాళాల కేసు.. దిమ్మ తిరిగే వాస్తవాలు, బయటకు వస్తున్న తిమింగలాలు
తయారీ ప్రాంగణం అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దాడుల్లో మజీద్‌పూర్ క్రాస్ రోడ్‌కు చెందిన బోడ ఆనంద్ (38), బోడ సౌజన్య (32)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 కృత్రిమ రంగుల సీసాలు, ఒక లీటర్ గడువు ముగిసిన బటర్‌స్కాచ్ ఫ్లేవర్, 500 మిల్లీలీటర్ల చొప్పున మూడు గడువు ముగిసిన ఫ్లేవర్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చర్యల కోసం జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also read: తెలంగాణలో బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ఆ సీట్లు కూడా రావు.. కాంగ్రెస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!