E-Paper
Advertisement

Chrome Bookmarks: ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆప్షన్.. ఆ డెస్క్‌టాప్ ఫీచర్ మీ మొబైల్ ఫోన్లో కూడా..

Chrome Bookmarks: ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే ఆప్షన్.. ఆ డెస్క్‌టాప్ ఫీచర్ మీ మొబైల్ ఫోన్లో కూడా..
Advertisement

Chrome Bookmarks: గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్‌ను ఆండ్రాయిడ్ వినియోగదారులకు, ముఖ్యంగా టాబ్లెట్‌లు, ఫోల్డబుల్ ఫోన్‌లు వాడే వారికి మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతోంది. డెస్క్‌టాప్‌లో మనం ఎంతో కాలంగా వాడుతున్న ‘బుక్‌మార్క్స్ బార్’ (Bookmarks Bar) ఫీచర్‌ను ఇప్పుడు ఆండ్రాయిడ్ వెర్షన్‌లో కూడా గూగుల్ అధికారికంగా ప్రవేశపెట్టింది.

Read also-Redmi Smart TV A50: తక్కువ కరెంట్ వినియోగించే టెక్నాలజీతో రెడ్‌మి కొత్త టీవీ లాంచ్.. బడ్జెట్ ధరలో 50 ఇంచ్ స్క్రీన్

ఎందుకు ఈ మార్పు?

Advertisement

సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో బుక్‌మార్క్‌లను చూడాలంటే మెనూలోకి వెళ్లి, అక్కడి నుండి ఫోల్డర్‌లను వెతకాల్సి వచ్చేది. కానీ పెద్ద స్క్రీన్ ఉన్న టాబ్లెట్‌లు, ఫోల్డబుల్ డివైజ్‌ల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు పదే పదే వాడే వెబ్‌సైట్‌లను సులభంగా యాక్సెస్ చేయడానికి ఈ డెస్క్‌టాప్ తరహా బుక్‌మార్క్స్ బార్‌ను గూగుల్ పరిచయం చేసింది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఆండ్రాయిడ్ క్రోమ్ బ్రౌజర్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఈ ఫీచర్ అడ్రస్ బార్ (Omnibox) కింద ఇది కనిపిస్తుంది. ఇది స్క్రీన్ వెడల్పు మొత్తాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి బుక్‌మార్క్ దాని ఐకాన్ (Favicon) మరియు పేరుతో స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం వెబ్‌సైట్ లింకులు మాత్రమే కాకుండా, మీరు క్రియేట్ చేసిన బుక్‌మార్క్ ఫోల్డర్లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఫోల్డర్‌పై క్లిక్ చేయగానే అందులోని లింకులన్నీ డ్రాప్‌డౌన్ లాగా కిందకు వస్తాయి. బార్‌లో పట్టనన్ని బుక్‌మార్క్‌లు ఉన్నప్పుడు, కుడి వైపున ఉండే ‘Chevron’ గుర్తుపై క్లిక్ చేసి మిగిలిన వాటిని చూడవచ్చు. ఏదైనా బుక్‌మార్క్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే, ఆ లింక్‌ను కాపీ చేయడానికి లేదా దాని పూర్తి అడ్రస్‌ను చూడటానికి వీలవుతుంది.

Read also-Amazon Mega Electronics Days: ల్యాప్‌టాప్స్, హెడ్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు డిస్కౌంట్.. సూపర్ డీల్స్ ఇవే

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

Advertisement

ఈ ఫీచర్ క్రోమ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 146 నుంచి అందుబాటులోకి వస్తోంది. మీ డివైజ్‌లో ఇది కనిపించాలంటే ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి. ముందుగా ప్లే స్టోర్ నుండి క్రోమ్ యాప్‌ను అప్‌డేట్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసి కుడి వైపున ఉండే మూడు చుక్కల మెనూపై క్లిక్ చేసి Settings లోకి వెళ్లండి. అక్కడ Appearance విభాగంలోకి వెళ్లాలి. అందులో “Show bookmarks bar” అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేయండి. ఒకవేళ మీరు పైన చెప్పిన వెర్షన్‌లో ఉన్నా ఆప్షన్ కనిపించకపోతే, యాప్ సెట్టింగ్స్ నుండి ఫోర్స్ స్టాప్ (Force Stop) చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ ఫీచర్ యాక్టివేట్ అవుతుంది. ఈ అప్‌డేట్ ద్వారా గూగుల్ ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లను పూర్తి స్థాయి ఉత్పాదకత (Productivity) సాధనాలుగా మార్చాలని భావిస్తోంది. ప్రత్యేకించి మల్టీ-టాస్కింగ్ చేసే వారికి, ఒక వెబ్‌సైట్ నుండి మరో వెబ్‌సైట్‌కు త్వరగా మారాలనుకునే వారికి ఈ బుక్‌మార్క్స్ బార్ ఎంతో సమయాన్ని ఆదా చేస్తుంది. అయితే, స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండే సాధారణ స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.

Related News

వాట్సప్ కస్టమర్ కేర్ పేరుతో మోసాలు.. మెసేజ్ చేసేముందు ఈ నియమాలు పాటించడం బెటర్!

ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే అప్‌డేట్.. ఫ్రెండ్స్ ట్యాగ్ చేసిన పోస్టులను మీ గ్రిడ్‌లో యాడ్ చేసుకోండిలా!

అమెజాన్‌లో బంపర్ ఆఫర్.. అమాంతం పడిపోయిన Samsung Galaxy S25 ధర!

బెస్ట్ వాషింగ్ మెషీన్ బ్రాండ్..మీడియం ఫ్యామిలీకి ఎల్జీ, హైయర్ ఏది బెస్ట్?

నెక్స్ట్ లెవెల్ కూలింగ్..ట్రిపుల్ డోర్ ఫ్రిజ్‌లతో లాభాలు ఇవే!

ఏఐ కోచ్,1.96 ఇంచుల డిస్‌ప్లేతో బోట్ వాచ్..రివ్యూ ఇదిగో!

ఐరన్ మ్యాన్ గ్లాసెస్ నిజం కాబోతున్నాయా? శాంసంగ్ సీక్రెట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ లీక్!

3D కర్వ్డ్ డిస్‌ప్లే, 250+ వాచ్ ఫేస్‌లతో బోల్ట్ స్మార్ట్‌వాచ్

Big Stories

Advertisement
×