E-Paper
Advertisement

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!
Advertisement

 Google Gemini 4 Argon: టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం మరో చారిత్రక మైలురాయిని దాటింది. గూగుల్ డీప్‌మైండ్ సంస్థ తన సరికొత్త , అత్యంత పవర్ ఫుల్ ఫ్రాంటియర్ ఏఐ మోడల్ అయిన ‘జెమిని 4 ఆర్గన్’ను అధికారికంగా గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఇది కేవలం సాధారణ చాట్‌ బాట్ లాంటి టూల్ కాదనీ, మనుషులకు గంటలు లేదా రోజులు పట్టే పనులను స్వయంగా పూర్తి చేయ గల అడ్వాన్స్‌డ్ ‘రీజనింగ్ మోడల్’ అని నిపుణులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్  ఇంజనీరింగ్, ఫైనాన్షియల్ లెడ్జర్స్, సైబర్‌ సెక్యూరిటీ రంగాలలో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. ప్రతీ రోజు టెక్నాలజీ మారుతున్న ఈ యుగంలో గూగుల్ తీసుకువచ్చిన ఈ అద్భుత మైన అప్‌ డేట్ టెక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టు కుంటోంది.

కోడింగ్,సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో అద్భుతాలు:

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ రంగంలో కోడింగ్ రాయడం,పెద్ద కోడ్‌ బేస్‌లను రీఫ్యాక్టర్ చేయడం డెవలపర్లకు ఎప్పుడూ తలకు మించిన భారంగా మారుతుంటుంది. అయితే జెమిని 4 ఆర్గన్ మోడల్ లక్షలాది లైన్ల కోడ్‌ను కూడా క్షణాల్లో విశ్లేషించి, బగ్‌లను గుర్తించి, దానికి తగిన పరిష్కారాలను చూపించ గలదు. గూగుల్ తన సొంత క్రోమ్ బ్రౌజర్ కోడ్‌ బేస్‌ను సవరించడంలో ఈ ఏఐని విజయవంతంగా ఉపయోగించింది. డెవలపర్లు ఎదుర్కొనే అత్యంత సంక్లిష్టమైన ఎర్రర్లను ఇది ఇట్టే పరిష్కరించగలదు. కోడింగ్ చేసే సమయంలో.. వచ్చే చిన్న చిన్న తప్పులను కూడా ఇది ఇన్‌స్టంట్‌గా సరి చేయగలగడం విశేషం.

ఫైనాన్స్,లీగల్, డేటా అనాలిసిస్‌లో కచ్చితత్వం:

Advertisement

ఫైనాన్స్, టాక్స్, లీగల్ రంగాలలో లెక్కలు, డాక్యుమెంట్ల వెరి ఫికేషన్ చాలా కచ్చితంగా ఉండాలి. జెమిని 4 ఆర్గన్ ఈ రంగాలలో బెస్ట్ ‘కాల్క్యులేషన్ ఇంటిగ్రిటీ’ని ప్రదర్శిస్తుంది. వాల్స్ ఇండెక్స్ లో ఇది మొదటి స్థానంలో నిలిచింది.మల్టీ-స్టెప్ లెడ్జర్ రీకన్సిలేషన్స్, స్ప్రెడ్‌షీట్ ఫార్ములాలు, వేరియన్స్ అనాలిసిస్‌లను ఇది చాలా ఈజీగా ఆటో మేట్ చేస్తుంది. అంతేకాకుండా.. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ప్రాజెక్ట్స్, చార్ట్‌లను, టేబుళ్లను క్షుణ్ణంగా చదివి స్పష్ట మైన సారాంశాన్ని అందిస్తుంది. బ్యాంకింగ్ , ఫైనాన్షియల్ రంగాల్లో పని చేసే ఉద్యోగులకు ఇది చాలా బాగా ఉపయోగ పడుతుందని అని చెప్పొచ్చు.

Also Read: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

సైబర్‌సెక్యూరిటీ, అడ్వాన్స్‌డ్ ఏఐ ఏజెంట్లు:

Advertisement

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడులను తిప్పికొట్టడం చాలా ముఖ్యం. హ్యాకర్ల బారిన పడకుండా.. సిస్టమ్స్‌ను కాపాడుకోవడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. జెమిని 4 ఆర్గన్ సిస్టమ్‌లోని సమస్యలను ముందుగానే.. పసిగట్టి, వాటికి ప్యాచ్‌లను తయారు చేయడంలో సైబర్‌ సెక్యూరిటీ నిపుణులకు అద్భుతంగా సహాయ పడుతుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ స్టూడియో ద్వారా డెవలపర్లు, ఎంటర్‌ ప్రైజ్ సంస్థల కోసం ఇది గ్లోబల్‌గా అందుబాటులోకి వచ్చింది. టెక్ చరిత్రలో ఇది సరి కొత్త శకానికి నాంది పలికిందని చెప్పొచ్చు. భవిష్యత్తు లో ఈ ఏఐ మోడల్ మరిన్ని అద్భుతమైన ఫీచర్లతో యూజర్ల ముందుకు రానుంది.

Related News

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..మార్షల్ స్పీకర్లపై అదిరిపోయే ఆఫర్లు

దేశంలో భారీగా పెరిగిన ఈ-వేస్ట్.. పర్యావరణానికి పెరుగుతున్న పెను ముప్పు!

ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!

ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!

Big Stories

Advertisement
×