E-Paper
Advertisement

రష్యా యువతి.. బీహార్ యువకుడు.. సోషల్ మీడియాలో లవ్ స్టోరీ వైరల్!

రష్యా యువతి.. బీహార్ యువకుడు.. సోషల్ మీడియాలో లవ్ స్టోరీ వైరల్!
Advertisement

Cross-Border Love Story: ప్రేమకు దేశాలు, భాషలు, ఆస్తిపాస్తులతో సంబంధం లేదని చెప్పే ఘటనలు అప్పుడప్పుడు  కనిపస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఓ ప్రేమకథ బీహార్‌ లో హాట్ టాపిక్ గా మారింది. ఉపాధి కోసం రష్యా వెళ్లిన ఓ యువకుడితో అక్కడ ఓ యువతి పరిచయం అయ్యింది. నెమ్మదిగా ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అతడిపై ప్రేమను పెంచుకుంది. యువకుడు తిరిగి భారత్‌కు రావడంతో, అతడిని విడిచి ఉండలేక ఆమె కూడా ఇండియాకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రేమకథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రష్యాలో మొదలైన పరిచయం.. ప్రేమగా మారిన బంధం!

బీహార్‌కు చెందిన రాహుల్ యాదవ్ ఉపాధి కోసం రష్యా వెళ్లిన సమయంలో ఓ యువతితో పరిచయం ఏర్పడింది. మొదట పరిచయంగా మొదలైన వారి బంధం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొంతకాలం తర్వాత రాహుల్ యాదవ్ భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే, అతడికి దూరంగా ఉండటం ఇష్టం లేని ఆ యువతి.. తన కుటుంబంతో కలిసి భారత్‌కు వచ్చింది. విదేశీ యువతి తన ప్రేమ కోసం ఇంత దూరం రావడం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.

గుడిసెలో ఉన్నా సరే.. ప్రియుడితోనే జీవిస్తా!

Advertisement

ఈ ప్రేమ కథలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో విషయం రాహుల్ కుటుంబ పరిస్థితులు. అతడు గుడిసెలో ఉంటున్నప్పటికీ, తనకు అతడితోనే జీవితం కావాలని సదరు యువతి కోరుకుంటుంది. డబ్బు, ఆస్తులు, విలాసవంతమైన జీవితం కంటే తమ మధ్య ఉన్న ప్రేమే ముఖ్యమని చెప్తోంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్‌లో వీరి వివాహం జరగవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే, పెళ్లి తేదీ, ఇతర ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇంటి దగ్గర యూట్యూబ్ ఛానెళ్ల సందడి!

Advertisement

ఈ ప్రేమకథ బయటకు రావడంతో రాహుల్ ఇంటి దగ్గరకు స్థానిక ప్రజలతో పాటు యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు క్యూ కడుతున్నారు. యువతిని చూపించాలని, వారి ప్రేమకథ గురించి వివరాలు చెప్పాలని అడుగుతున్నారు. దీంతో ఈ జంట గురించి స్థానికంగా మరింత చర్చ జరుగుతోంది. మరోవైపు సాధారణ జీవితం గడుపుతున్న ఓ యువకుడి ప్రేమకథ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరికొందరు మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను అతిగా ప్రచారం చేయకుండా, ఆ జంటకు తగినంత ప్రైవసీ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి దేశాల మధ్య దూరం ఉన్నా, భాషలు వేరైనా ఇద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఆకర్షణగా నిలుస్తోంది.

Read Also: 1975లో పెళ్లి ఖర్చులు.. అమ్మమ్మ లెక్కల చిట్టా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Tags

Related News

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

దసరాకు 5 వేల స్పెషల్ బస్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ!

గ్రీన్ ట్రాన్స్ పోర్టుపై ఆర్టీసీ ఫోకస్.. కొత్త ఎలక్ట్రిక్, CNG బస్సులు వచ్చేస్తున్నాయ్!

విమానాల్లో సిగరేట్‌పై నిషేధం.. కానీ బాత్రూమ్‌లో యాష్ ట్రేలు ఎందుకు? కారణం తెలిస్తే ఆశ్చర్యమే!

IRCTC టికెట్ బుకింగ్.. సీనియర్ సిటిజన్లకు ఉపయోగపడే సూపర్ టిప్స్!

Big Stories

Advertisement
×