Marshall speakers: మ్యూజిక్ అంటే ప్రాణమిచ్చే వారికి మార్షల్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాక్ మ్యూజిక్ వైబ్ ఇచ్చే క్లాసిక్ డిజైన్, చెవులకు ఇంపుగా ఉండే ప్యూర్ సౌండ్ క్వాలిటీ ఈ స్పీకర్ల ప్రత్యేకత. అయితే వీటి ధరలు సాధారణంగా ఎక్కువగా ఉండటంతో.. చాలా మంది కొనడానికి వెనకాడతారు. అలాంటి వారి కోసమే ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సరి కొత్త అవకాశాన్ని తెచ్చింది. ఈ మెగా సేల్‌లో అత్యంత పాపులర్ అయిన టాప్ 5 మార్షల్ స్పీకర్లపై భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ధరలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూసేద్దామా..
ఇది హోమ్ ఆడియో స్పీకర్ లవర్స్‌కు బెస్ట్ ఛాయిస్. 60W పవర్ అవుట్ పుట్ కలిగిన ఈ స్పీకర్ రూమ్ అంతా అదిరి పోయే సౌండ్‌ను ఇస్తుంది. సాధారణంగా రూ. 31,999 ఉండే దీని ధర, ఫ్లిప్ కార్ట్ సేల్‌లో దాదాపు 34% తగ్గింపుతో కేవలం రూ. 20,999 ప్రత్యేక ధరకు లభిస్తోంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా వర్తిస్తాయి. తక్కువ ధరలో బోస్ట్ మోడల్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లే పోర్టబుల్ స్పీకర్ కావాలనుకునే.. వారికి ఇది పర్ఫెక్ట్. 360-డిగ్రీ సౌండ్, వాటర్ ప్రూఫ్ ఫీచర్లతో వస్తుంది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో దీని ప్రత్యేక ధర రూ. 14,999 నుంచి ప్రారంభం అవుతోంది. ప్రయాణాలు చేసే వారికి , పార్టీలు ఇష్టపడే వారికి ఈ బడ్జెట్ ధరలో ఇది అద్భుతమైన ఆప్షన్.
ప్రీమియం లుక్ మరియు లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారి ఫేవరెట్ ఇది. బ్లూటూత్ కనెక్టివిటీతో.. వచ్చే ఈ పవర్ ఫుల్ స్పీకర్ అసలు ధరపై భారీ తగ్గింపును ప్రకటించారు. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో కలిపి ఇది కేవలం రూ. 19,249 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: మార్కెట్‌ను షేక్ చేస్తున్న100 ఇంచుల టీవీ..ఇంతవరకూ ఏ టీవీలో లేని ఫీచర్లు
4. మార్షల్ విల్లెన్ II (Marshall Willen II):
చాలా కాంపాక్ట్ సైజ్‌లో ఉండే ఈ మినీ పోర్టబుల్ స్పీకర్ చిన్న సైజులో.. ఉన్నా పెద్ద సౌండ్‌ను అందిస్తుంది. డస్ట్, వాటర్ ప్రూఫ్ రేటింగ్‌తో వస్తున్న ఈ స్పీకర్ సేల్‌లో అత్యంత తక్కువ ధర అయిన రూ.8,999 కే అందుబాటులో ఉంచారు.
5. మార్షల్ వోబర్న్ III (Marshall Woburn III):
ఇంటినే ఒక మినీ థియేటర్ లేదా పార్టీ హాల్ లాగా మార్చుకోవాలంటే మార్షల్ వోబర్న్ III మించింది లేదు. 150W పవర్ అవుట్ పుట్ కలిగిన ఈ హెవీ డ్యూటీ హోమ్ స్పీకర్, బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రత్యేక తగ్గింపు ద్వారా రూ. 45,249 బడ్జెట్ ధరకు లభిస్తోంది.
బ్రాండెడ్ మోడల్స్ కావాలనుకునే వారికి ఈ సేల్ టైం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం నచ్చిన స్పీకర్ వెంటనే ఆర్డర్ చేసేయండి.