Pixel 10 Whatsapp| గూగుల్ కంపెనీ తాజాగా పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లు భారతదేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఈ ఫోన్ల విక్రయాలు ఆగస్టు 28 నుంచి ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌లో మెరుగైన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో పాటు, ఒక అద్భుతమైన సదుపాయం ఉంది. అదే, నెట్‌వర్క్, వై-ఫై లేకుండా వాట్సాప్ కాల్స్ చేయగలిగే సామర్థ్యం. ఇది స్మార్ట్‌ఫోన్ చరిత్రలో మొదటిసారి సాధ్యమవుతోంది.
గూగుల్ అధికారిక X (పాత ట్విట్టర్) పోస్ట్‌లో ప్రకటించినట్లు.. పిక్సెల్ 10 సిరీస్ ఫోన్ల ఉపయోగించే యూజర్లకు శాటిలైట్ కనెక్టివిటీ ద్వారా వాట్సాప్ వాయిస్, వీడియో కాల్స్ చేసే అవకాశం ఇస్తుంది.
అంటే, మీరు దూరప్రాంతాల్లో ప్రయాణిస్తుంటే లేదా నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లో ఉంటే.. లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉంటే కూడా, ఈ ఫీచర్ సర్వీస్ మిమ్మల్ని ఇతరులతో కనెక్ట్ చేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇది యూజర్లకు ఒక లైఫ్ లైన్ లాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా, నెట్‌వర్క్ లేకుండా కమ్యూనికేషన్ చేయడం కష్టం. కానీ, ఈ ఫీచర్‌తో అది సులభమవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నా, ఎలాంటి సిగ్నల్ సమస్యలు లేకుండా మాట్లాడవచ్చు.
గూగుల్ స్పష్టం చేసినట్లు.. ఈ ఫీచర్ టెలికాం ఆపరేటర్లు శాటిలైట్ కనెక్టివిటీ సపోర్ట్ చేసే ప్రాంతాల్లో మాత్రమే పనిచేస్తుంది. భారతదేశంలో ఇంకా ఈ సదుపాయం అందుబాటులో లేదు. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ శాటిలైట్ ఆధారిత సేవలను త్వరలో ప్రారంభిస్తామని హింట్ ఇచ్చింది. అంటే, భారతీయ యూజర్లు కూడా త్వరలో ఈ అద్భుత ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం, ఈ సర్వీస్ ఉన్న దేశాల్లో మాత్రమే పిక్సెల్ 10 యూజర్లు దీన్ని ఉపయోగించగలరు. భవిష్యత్తులో మరిన్ని దేశాలకు విస్తరించవచ్చు.
గూగుల్ ప్రకటనలో పేర్కొన్నట్లు .. పిక్సెల్ 10 సిరీస్ ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌ఫోన్ లైనప్, ఇది వాట్సాప్ ఆడియో, వీడియో కాలింగ్‌ను శాటిలైట్ ద్వారా అందిస్తుంది. ఇంతవరకు, శాటిలైట్ సపోర్ట్ ఉన్న ఫోన్లు మాత్రమే ఎస్‌ఓఎస్ మెసేజింగ్, పరిమిత కాలింగ్ లాంటి ఫీచర్లు మాత్రమే ఇచ్చాయి. కానీ, పిక్సెల్ 10తో వాట్సాప్ మొదటి మెయిన్‌స్ట్రీమ్ యాప్‌గా ఈ కనెక్టివిటీని అందిస్తోంది.
ఇది విదేశాలకు ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు, పర్వతాలపై లేదా అడవులు లేదా సముద్రాల మధ్యలో ఉన్నప్పుడు కూడా వాట్సాప్ ద్వారా ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ, కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు. ఇది టెక్నాలజీలో ఒక పెద్ద మార్పు.
పిక్సెల్ 10 సిరీస్ లాంచ్‌తో, గూగుల్ స్మార్ట్‌ఫోన్ ఇన్నోవేషన్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. ప్రపంచవ్యాప్త యూజర్లు ఆగస్టు 28 నుంచి ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. కానీ, భారతీయ కస్టమర్లు శాటిలైట్ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యే వరకు వేచి ఉండాలి.
ఈ ఫీచర్ మాత్రమే కాకుండా, పిక్సెల్ 10లో మరిన్ని అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఉదాహరణకు, మెరుగైన కెమెరా, బ్యాటరీ లైఫ్, ఆండ్రాయిడ్ అప్‌డేట్లు. ఇది స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీని పెంచుతుంది. ఇతర కంపెనీలు కూడా ఇలాంటి ఫీచర్లు త్వరలోనే తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. మొత్తంగా, ఈ ఫోన్ భవిష్యత్ కమ్యూనికేషన్ విధానాన్నే మార్చేస్తుంది. భారతదేశంలో త్వరలో శాటిలైట్ సేవలు ప్రారంభవుతాయని ఆశిద్దాం.
Also Read: Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?