Google Pixel 9a – టెక్ దిగ్గజం గూగుల్ తన యూజర్స్ కోసం బెస్ట్ ఫీచర్ మొబైల్స్ ను లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన ఫ్లాగ్ షిప్ లో పిక్సెల్ 9ను ఆగస్టులో లాంఛ్ చేసింది. ఇప్పుడు పిక్సెల్ 9a సిరీస్ ను త్వరలో లాంఛ్ చేస్తూ అదిరిపోయే ఫీచర్ మొబైల్ ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మొబైల్ లాంఛ్ డేట్ తో పాటు ఫీచర్స్ లీక్ అయ్యి టెక్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్నాయి.
గూగుల్ తన లైనప్ లో మరో కొత్త మొబైల్ ను తీసుకురావడానికి సిద్ధమవుతుంది. పిక్సెల్ 9a మొబైల్ ను బెస్ట్ ఫీచర్స్ తో తీసుకొచ్చేస్తుంది. ఈ మొబైల్ మార్చిలో లాంఛ్ కాబోతుందని.. ప్రీ ఆర్డర్స్ మార్చ్ 19న ప్రారంభమవుతాయని తెలుస్తోంది. ఇక ఆన్లైన్ తో పాటు స్టోర్ లో మార్చి 26 నుంచి అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది.
Google Pixel 9a Features –
గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో లాంఛ్ కాబోతున్న బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ గా ఉండనుంది. ఈ ఫోన్ ప్రత్యేకంగా గూగుల్ ప్యూర్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందించే ఛాన్స్ ఉంది. ఇందులో 6.1 అంగుళాల AMOLED డిస్‌ప్లే, FHD+ రిజల్యూషన్‌తో 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే.. పిక్సెల్ 9a 12MP ప్రధాన కెమెరాతో పాటు 16MP అల్ట్రా వైడ్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో “నైట్ సైట్” వంటి బెస్ట్ ఫీచర్స్ సైతం ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 8MP సెన్సార్‌తో రాబోతుంది.
ఈ ఫోన్ గూగుల్ తన సొంత టెన్సార్ చిప్‌సెట్‌ను ఉపయోగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇది పెర్ఫార్మెన్స్, ఎనర్జీ ఇఫిషియెన్సీను పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. 6GB లేదా 8GB RAMతో పాటు 128GB లేదా 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో రాబోతుంది. పిక్సెల్ 9a మల్టీటాస్కింగ్, స్టోరేజ్ కు అనుగుణంగా రాబోతుంది. 4600mAh బ్యాటరీ 18W ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఈ గూగుల్ Pixel 9a స్మార్ట్‌ఫోన్ సాఫ్ట్‌వేర్ లో లేటెస్ట్ అప్డేట్స్, సెక్యూరిటీ ఫీచర్లతో రాబోతున్నట్లు సమాచారం.
కెమెరాల ఫీచర్స్ విషయానికి వస్తే.. Pixel 9a డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉండనుంది. ఫోన్ 5,100mAh బ్యాటరీతో 23W వైర్డు ఛార్జింగ్, 7.5W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది. మెుబైల్ ధర విషయానికి వస్తే… 128GB స్టోరేజ్ వేరియంట్ దాదాపు రూ. 42,000గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే.. ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, USB Type-C కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక మార్చిలో రాబోతున్న ఈ మెుబైల్ ఫీచర్స్ పై త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : ఫిబ్రవరి 1 నుంచి UPI ఐడీలు పనిచేయవా? వెంటనే ఇలా చేయండి, లేకపోతే…