UPI : గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారా? మరి అప్రమత్తంగా ఉండాల్సిందే. ఫిబ్రవరి 1 నుంచి యూపీఐ (UPI) లో కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. దీంతో ఆ రూల్స్ ఫాలో కాకపోతే అకౌంటు బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆ కొత్త రూల్స్ ఏంటి? అకౌంట్ బ్లాక్ కాకుండా ఏం చేయాలో తెలుసుకోండిలా!
ఈ రోజుల్లో యూపీఐ వినియోగం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ కు కూడా యూపీఐ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజానికి ఈ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి యూజర్స్ మరింత తేలికగా పేమెంట్స్ జరపగలుగుతున్నారు. అయితే నిత్యం కోట్లల్లో ట్రాన్సాక్షన్ జరిగే యూపీఐ యాప్ తన యూజర్స్ కోసం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ను తీసుకొస్తుంది. మరి ఆ రూల్స్ ఏంటో చూసెద్దాం.
ఫిబ్రవరి 1 (February 1st Rules) నుంచి యూపీఐ చెల్లింపుల్లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని లావాదేవీలను తిరస్కరించాలని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. యూపీఐ ఐడీలో ప్రత్యేక అక్షరాలు ఉన్న ఆర్థిక లావాదేవీలను నిలిపివేయనుంది. ఈ రూల్ ఫిబ్రవరి 1 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తుంది.
ఐడీలో రూల్స్ ఏంటంటే –
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపిన సమాచారం ప్రకారం.. యూపీఐ ఐడీలో ఆల్ఫా న్యూమరిక్స్ ఉన్న కస్టమర్స్ మాత్రమే లావాదేవీలు జరపగలరు. ఈ రూల్ ప్రకారం వినియోగదారులు తమ యుపీఐ ఐడీలో A To Z తో పాటు 0 – 9 వరకు అంకెలు కలిగి ఉండవచ్చు. అలా కాకుండా @#%^* ఇలా ప్రత్యేక అక్షరాలతో ఐడీలు ఉండే చెల్లింపులు ఆగిపోతాయి.
ఎందుకు ఈ రూల్ అంటే –
యూపీఐ లావాదేవీలను మరింత పెంచడానికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ రూల్ తో ప్రతీ ఒక్కరూ తమ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అప్డేట్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేపడతారని, యూజర్స్ భద్రతను మరింత పెంచే దిశగా యూపీఐ ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక తాజాగా యూపీఐ కొత్త రూల్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. UPI పేమెంట్స్ భారత్ తో పాటు పలు పొరుగు దేశాల్లో సైతం పనిచేసే ఛాన్స్ కల్పించింది. యూరోపియన్ కంట్రీస్ లోనూ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ ను ఉపయోగించవచ్చు. దీంతో సింగపూర్, దుబాయ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఫ్రాన్స్, మారిషస్ లో కూడా పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యాప్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు.
ఇక డిజిటల్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఎప్పటికప్పుడు కొత్త రికార్డ్స్ సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్స్ వాడుతున్న ఈ యాప్స్ లో లక్షల కోట్ల ట్రాన్సిక్షన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్స్ భద్రతను మరింత పెంచే దిశగా యూపీఐ తన చర్యలు చేపడుతుంది.
ALSO READ : దిమ్మతిరిగే డీల్.. ప్రీమియం మెుబైల్ పై రూ.27వేల తగ్గింపు