Junior Secretariat Assistant Jobs: టెన్త్ క్లాస్, ఇంటర్మీడియర్ , డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ విభాగానికి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(CSIR-IICT)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా లభిస్తుంది. దరఖాస్తుకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. వెంటనే దరఖాస్తు చేసుకోండి.
హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ విభాగానికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (CSIR-IICT)లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 3వ తేదిన దరఖాస్తు గడువు ముగియనుంది.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 15
ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పలు విభాగాల్లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఎస్ అడ్ పీ తదితర విభాగాల్లో వెకెన్సీ ఉన్నాయి.
విభాగాల వారీగా
జనరల్
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
ఎస్ అడ్ పీ
విద్యార్హత: టెన్త్ క్లాస్, ఇంటర్మీడియర్ పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వయస్సు: ఉద్యోగాన్ని దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 28 ఏళ్ల వయస్సు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.38,500 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.)
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ధ్రువ పత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరితేది: 2025 మార్చి 3
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ నోటిఫికేషన్‌ను సంప్రదించండి.
అఫీషియల్ నోటిఫికేషన్: https://www.iict.res.in/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియర్, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, బీఈ/బీటెక్ పాసైన అభ్యర్థులకు ఇది అయితే సువర్ణవకాశం. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. మంచి వేతనం కూడా లభిస్తుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.38,500 జీతం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవద్దు. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.