E-Paper
Advertisement

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!

యాపిల్ iPhone Ultra రాకముందే.. ఫోల్డబుల్ మార్కెట్‌పై గూగుల్, శాంసంగ్ కన్ను!
Advertisement

Foldable Phones: ఫోల్డబుల్ ఫోన్ అంటే ఇప్పుడు కేవలం కొత్త టెక్నాలజీ కాదు.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇదొక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. ఈ రేసులో ఇప్పటివరకు శాంసంగ్, గూగుల్ ముందంజలో ఉన్నాయి. కానీ త్వరలో యాపిల్ కూడా తన తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Ultraతో ఎంట్రీ ఇవ్వబోతోందనే వార్తలు ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే యాపిల్ మార్కెట్లోకి అడుగుపెట్టేలోపే తమ ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు శాంసంగ్, గూగుల్ కొత్త ప్లాన్లతో సిద్ధమవుతున్నాయి. అసలు ఈ రెండు కంపెనీలు ఏం చేస్తున్నాయి?

యాపిల్ వచ్చేలోపే వీలైనంత ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని శాంసంగ్, గూగుల్ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాయి. గూగుల్ ఇటీవల Pixel 11 Pro Ultra Foldను లాంచ్ చేయగా.. శాంసంగ్ తమ ఫోల్డబుల్ లైనప్‌ను మరింత బలోపేతం చేస్తూ Galaxy Z Fold 8, Z fold 8 Ultra మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ప్రీమియం ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ రెండు దిగ్గజాలు పోటీపడుతున్నాయి.

Advertisement

Also Read: లక్షల డాలర్లు తగలేసి ఇదేం డిజైన్ రా బాబు? Instagram కొత్త లోగోపై ఏకిపారేస్తున్న నెటిజన్లు!

ఈ కొత్త ఫోన్లలో ఫీచర్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. Google Pixel 11 Pro Fold విషయానికొస్తే.. ఇది స్లిమ్ డిజైన్, అధునాతన AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లతో వస్తోంది. మరోవైపు Samsung Z Fold 8 Ultra మోడల్ 8 అంగుళాల పెద్ద స్క్రీన్, ఏకంగా 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. ఈ రెంటిలోనూ యూజర్లకు కొత్త అనుభూతిని ఇచ్చేలా అనేక మార్పులు చేశారు.

Advertisement

అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన Samsung Galaxy Z Fold 8కి వినియోగదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. కంపెనీ అంచనాలను మించి ఈ ఫోన్ సేల్స్ జరుగుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తిని పెంచేందుకు శాంసంగ్ ఏకంగా మరో పది లక్షల యూనిట్లను అదనంగా తయారు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మార్కెట్లో శాంసంగ్‌కు ఉన్న బలమైన పట్టును స్పష్టం చేస్తోంది.

ఈ ఏడాది చివర్లో యాపిల్ తమ iPhone Ultraను బుక్‌ స్టైల్ డిజైన్‌తో, భారీ డిస్‌ప్లేతో తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటికే గూగుల్, శాంం‌సంగ్ మార్కెట్లో మంచి విజయాన్ని సాధించి, బలమైన పునాదిని వేసుకున్నాయి. కాబట్టి.. ఈసారి యాపిల్‌కు పోటీ అంత సులువు కాకపోవచ్చు. ప్రీమియం కస్టమర్లను తమ వైపు తిప్పుకోవాలంటే యాపిల్ కేవలం బ్రాండ్ ఇమేజ్‌పైనే కాకుండా, సరికొత్త వినూత్న ఫీచర్లతో రావాల్సి ఉంటుంది. యాపిల్ వచ్చేసరికి ఈ ఫోల్డబుల్ ఫోన్ల యుద్ధం ఎంత ఆసక్తికరంగా మారుతుందో వేచి చూడాలి.

Also Read: రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×