E-Paper
Advertisement

7 అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రైళ్లు వస్తున్నాయంటే?

7 అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్..  తెలుగు రాష్ట్రాలకు ఎన్ని రైళ్లు వస్తున్నాయంటే?
Advertisement

7 New Amrit Bharat Express Trains: దేశంలో రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను కలుపుతూ 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ రైళ్లను నడపనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాలు, ప్రధాన స్టాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1.చర్లపల్లి – గోరఖ్‌పూర్

తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ వరకు ఈ రైలు నడవనుంది. కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, గోండా మీదుగా గోరఖ్‌పూర్ చేరుతుంది. ఈ రైలు ద్వారా దక్షిణ, మధ్య, ఉత్తర భారత ప్రాంతాల మధ్య ప్రయాణ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.

2.ధన్‌బాద్ – కోయంబత్తూరు

Advertisement

ధన్‌బాద్ నుంచి కోయంబత్తూరు వరకు మరో అమృత్ భారత్ రైలు ప్రతిపాదించారు. గయా, ససారం, ప్రయాగ్‌రాజ్, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, మంచేరియల్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.

3.ప్రయాగ్‌రాజ్ – ముంబై

ప్రయాగ్‌రాజ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు వారానికి ఒకసారి రైలు నడపనున్నారు. సత్నా, జబల్‌పూర్, ఇటార్సీ, భుసావల్, కళ్యాణ్ ప్రధాన స్టాప్‌లుగా ఉంటాయి.

4.ప్రయాగ్‌రాజ్ – ఉద్నా

Advertisement

మరో వారపు రైలు ప్రయాగ్‌రాజ్ నుంచి గుజరాత్‌లోని ఉద్నా వరకు నడుస్తుంది. ఫతేపూర్, కాన్పూర్ ప్రాంతం, ఇటావా, ఆగ్రా, కోట, సవాయ్ మాధోపూర్, రత్లాం, వడోదర, ఉద్నా వంటి ప్రాంతాల్లో ఆగుతుంది.

5.సుబేదార్‌గంజ్ – ముంబై

సుబేదార్‌గంజ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు మరో అమృత్ భారత్ రైలు ప్రతిపాదించారు. ఫతేపూర్, బందా, చిత్రకూట్, సత్నా, కట్ని, జబల్‌పూర్, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థానే ప్రధాన స్టాప్‌లుగా ఉంటాయి.

6.గోరఖ్‌పూర్ – ఢిల్లీ

గోరఖ్‌పూర్ నుంచి ఢిల్లీకి మరో వారపు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఖలీలాబాద్, బస్తీ, గోండా, సీతాపూర్, బరేలీ, మొరాదాబాద్, ఘజియాబాద్ మీదుగా ఢిల్లీ చేరుతుంది.

7.గోరఖ్‌పూర్ – బాంద్రా

గోరఖ్‌పూర్ నుంచి ముంబై బాంద్రా టెర్మినస్ వరకు మరో రైలు ప్రతిపాదించారు. లక్నో ప్రాంతం, కాన్పూర్, ఆగ్రా, కోట, రత్లాం, వడోదర, సూరత్, వల్సాద్, వాపి, బోరివలి మీదుగా బాంద్రా చేరుతుంది.

ప్రయాణికులకు ఎంతో ఉపయోగం

ఈ ఏడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఉత్తర, మధ్య, దక్షిణ, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేయాలనుకునే వారికి అమృత్ భారత్ సేవలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పూర్తి టైమింగ్స్, ప్రారంభ తేదీలు, ఛార్జీల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Read Also: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ vs ఫ్లైట్.. ఏది బెటర్?

Tags

Related News

పర్వతాల నుంచి ఎడారుల వరకు.. దేశంలో కచ్చితంగా చూడాల్సిన 8 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

వందే భారత్ కార్గో రైలు వచ్చేస్తోంది, స్పీడ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రతి భారతీయుడూ.. తప్పక చూడాల్సిన 10 సరిహద్దు ప్రాంతాలు!

1964లో మూసేసిన రైల్వే లైన్.. ఇప్పుడు ఏటా 60 వేల మంది సందర్శించే టూరిస్ట్ స్పాట్.. అలా ఎలా?

మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!

టికెట్ బుకింగ్ To లైవ్ ట్రాకింగ్.. ప్రయాణికులను ఆకట్టుకుంటున్న రైల్‌ వన్ యాప్‌!

ఇక మరింత సౌకర్యవంతంగా లోకల్ రైళ్లు.. వందే మెట్రో రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×