E-Paper
Advertisement

రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!

రూ.899కే మల్టీ డివైజ్ సపోర్ట్, రీఛార్జబుల్ బ్యాటరీ.. పోర్ట్రోనిక్స్ ఫోల్డబుల్ మౌస్ లుక్ అదిరింది!
Advertisement

Portronics Toad Fold: ఆఫీస్‌ పనుల కోసం నిత్యం ప్రయాణాలు చేసేవారికి గానీ, ల్యాప్‌టాప్‌తో బయట వర్క్ చేసేవారికి గానీ వైర్‌లెస్ మౌస్‌ను వెంట తీసుకెళ్లడం కాస్త చిరాగ్గా అనిపిస్తుంది. బ్యాగ్‌లో ఎక్కువ స్పేస్ తీసుకోవడమే కాకుండా.. ఎక్కడ విరిగిపోతుందోననే భయం కూడా ఉంటుంది. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ప్రముఖ టెక్ బ్రాండ్ ‘పోర్ట్రోనిక్స్’ ఒక కొత్త వైర్‌లెస్ మౌస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అదే.. Toad Fold.

దీని డిజైనే దీనికి పెద్ద ప్లస్ పాయింట్. అవసరం లేనప్పుడు దీన్ని ఈజీగా మడతబెట్టి పాకెట్‌లో లేదా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లో వేసేసుకోవచ్చు. మళ్లీ వాడాలనుకున్నప్పుడు అన్‌ఫోల్డ్ చేస్తే చాలు.. చేతికి పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయే గ్రిప్‌తో సౌకర్యవంతంగా మారిపోతుంది.

ఒకేసారి అనేక డివైజెస్‌కు కనెక్షన్:

Advertisement

ఈ మౌస్ బ్లూటూత్, 2.4GHz వైర్‌లెస్ కనెక్టివిటీ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. దీంతో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్‌తో పాటు ట్యాబ్, స్మార్ట్‌ఫోన్‌లకు కూడా సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ డివైజ్ ఫీచర్ ఉండటం వల్ల ఒక డివైజ్ నుంచి మరో దానికి సులువుగా స్విచ్ అవ్వొచ్చు. విండోస్, మ్యాక్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఇది చక్కగా పనిచేస్తుంది.

Also Read: రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!

సూపర్‌ స్పీడ్, రీఛార్జబుల్ బ్యాటరీ:

Advertisement

ఇందులో 3200 DPI వరకు సెన్సిటివిటీని అడ్జస్ట్ చేసుకునే సదుపాయం ఉంది. ఆఫీస్ వర్క్, డిజైనింగ్ లేదా గేమింగ్ అవసరాలకు తగినట్లు స్పీడ్‌ను మార్చుకోవచ్చు. బ్యాటరీల అవసరం లేకుండా టైప్-సి పోర్ట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీని ఆదా చేసేందుకు ఇందులో ఆటోస్లీప్ మోడ్ ఫీచర్ కూడా ఉంది.

ధర వివరాలు:

మ్యాట్ బ్లాక్ కలర్‌లో లభించే ఈ మౌస్ అసలు ధర రూ.1,999 కాగా.. ప్రత్యేక ల్యాంచ్ ఆఫర్ కింద రూ.899కే లభిస్తోంది. దీనిపై కంపెనీ 12 నెలల వారంటీని ఇస్తోంది. ఈ పోర్ట్రోనిక్స్ టోడ్ ఫోల్డ్ మౌస్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ప్రముఖ రీటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Also Read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబెర్, రాపిడోల్లో ముందే టిప్ అడగటం కుదరదు.. కేంద్రం కొత్త రూల్స్!

Tags

Related News

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

ఫోన్ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లమ్‌కి శాశ్వత పరిష్కారం.. ఈ 4 సెట్టింగ్స్ మార్చితే GBల కొద్దీ స్పేస్ ఫ్రీ!

గెలాక్సీ వాచ్‌పై ఆరెంజ్ డాట్ ఎందుకు వస్తుంది? దాని అర్థం ఏంటి?

వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

ఇంటికి సోలార్ ప్యానెల్స్ వేయిస్తున్నారా? బ్లాక్ అండ్ బ్లూ ప్యానెల్స్ మధ్య తేడా ఇదే !

Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Big Stories

Advertisement
×