Hammer drop x1 5w bluetooth speaker: ఈ రోజుల్లో చిన్న పాటి పార్టీలు చేసుకున్నా, ప్రయాణాలు చేస్తున్నా లేదా వ్యాయామం చేస్తున్నా.. మంచి సంగీతం తోడుండాల్సిందే. అయితే.. తక్కువ ధరలోనే అదిరిపోయే సౌండ్, ఎక్కువ టైం వచ్చే బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్పీకర్ల కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి.. వారి కోసమే.. ప్రముఖ లైఫ్‌స్టైల్ టెక్ బ్రాండ్ హ్యామర్, సరి కొత్త హ్యామర్ డ్రాప్ ఎక్స్1 5W బ్లూటూత్ స్పీకర్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 599 ధరలోనే 32 గంటల ప్లేటైమ్, లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 6.0, ట్విన్ పేరింగ్ ఫీచర్లతో లభిస్తున్న ఈ ఆకుపచ్చ రంగు క్యూట్ స్పీకర్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
హ్యామర్ డ్రాప్ ఎక్స్1 స్పీకర్.. చూడటానికి చాలా చిన్నదిగా, ట్రెండీగా ఉంటుంది. ముఖ్యంగా దీని ఆకుపచ్చ రంగు (గ్రీన్) వేరియంట్ క్లాసీ అండ్ యూత్‌ఫుల్ లుక్‌ని ఇస్తుంది. ఇది జేబులో లేదా చిన్న బ్యాగ్‌లో.. చాలా ఈజీగా పట్టేంత సైజులో ఉంటుంది. బయటికి వెళ్లేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఈజీగా పట్టుకెళ్లవచ్చు.
బటన్లు: స్పీకర్ పైన పాటలు మార్చడానికి, వాల్యూమ్ పెంచడానికి/తగ్గించడానికి , ప్లే/పాజ్ చేయడానికి మెత్తటి రబ్బర్ బటన్లు ఇచ్చారు.
ఈ చిన్న స్పీకర్‌లో 52మిమీ ఆడియో డ్రైవర్లను అందించారు.
5W ఆడియో అవుట్‌పుట్: 5W పవర్ ఫుల్ అవుట్‌పుట్ వల్ల గదిలో ప్రశాంతంగా పాటలు వినడానికి లేదా బయట స్నేహితులతో.. కలిసి ఎంజాయ్ చేయడానికి సరి పోయేంత లౌడ్ సౌండ్ వస్తుంది.
బేస్ అండ్ క్లారిటీ: ఇందులోని.. బేస్ పంచ్ బాగుంటుంది. పాటలోని లిరిక్స్ చాలా స్పష్టంగా వినిపిస్తాయి.
బ్లూటూత్ v6.0: ఆడియో రంగంలో.. లేటెస్ట్ బ్లూటూత్ v6.0 కనెక్టివిటీ.. ఇందులో ఇచ్చారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌తో క్షణాల్లో కనెక్ట్ అయిపోతుంది. కనెక్షన్ కట్.. అవ్వడం లేదా సౌండ్ ఆలస్యం అవ్వడం లాంటి సమస్యలు ఉండవు.
ట్విన్ పేరింగ్ (టిడబ్ల్యూఎస్ మోడ్): ఒక వేళ మీకు ఇంకా.. ఎక్కువ లౌడ్ సౌండ్ కావాలనుకుంటే.. రెండు హ్యామర్ డ్రాప్ ఎక్స్1 స్పీకర్లను ఒకే సారి కనెక్ట్ చేసి డబుల్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.
ఈ స్పీకర్‌లో.. అతి పెద్ద హైలైట్ ఏంటంటే.. దీని 32 గంటల బ్యాటరీ ప్లేటైమ్. సాధారణంగా ఈ రేంజ్ బడ్జెట్ స్పీకర్లలో 5 నుంచి 8 గంటల బ్యాటరీ.. మాత్రమే ఇస్తారు. కానీ ఇందులో ఒక సారి ఛార్జ్ చేస్తే.. రోజుకు 3-4 గంటలు వాడినా వారం రోజులకు పైగానే వస్తుంది. ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్ ఇచ్చారు.
కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా.. ఇందులో ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి.
మెమరీ కార్డ్ సపోర్ట్: ఫోన్ కనెక్ట్ చేయకుండానే.. నేరుగా మైక్రో ఎస్డీ కార్డ్ వేసి పాటలు వినొచ్చు.
ఇన్-బిల్ట్ మైక్: ఫోన్ మాట్లాడటం కోసం.. ఇందులో మైక్రోఫోన్ కూడా ఇచ్చారు.
Also Read: బిగ్ స్క్రీన్ లవర్స్‌కు పండగే..మార్కెట్‌లోకి మరో కొత్త ప్రొజెక్టర్ వచ్చేసింది!
అఫిషియల్ ధర: ఇండియన్ మార్కెట్లో హ్యామర్ డ్రాప్ ఎక్స్1 5W బ్లూటూత్ స్పీకర్ ఆన్‌లైన్ ధర కేవలం రూ. 599. ఈ స్పీకర్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్లు, హ్యామర్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
రూ. 600 లోపు తక్కువ బడ్జెట్‌లో.. అదిరిపోయే.. 32 గంటల బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ v6.0, ట్విన్ పేరింగ్, స్టైలిష్ గ్రీన్ డిజైన్ కోరుకునే.. వారికి హ్యామర్ డ్రాప్ ఎక్స్1 5W బ్లూటూత్ స్పీకర్ ఒక వర్త్ అండ్ ట్రెండీ ఛాయిస్!