E-Paper
Advertisement

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!

కెప్టెన్ సుధీర్ కి ఘోర అవమానం.. నోరుజారిన త్రిగుణ్, రోహిత్!
Advertisement

Bigg boss 10:  వైల్డ్ కార్డ్స్ కాదు వైల్డ్ ఫైర్ అంటూ హోస్ట్ నాగార్జున చేసిన కామెంట్లు ఇప్పుడు కంటెస్టెంట్స్ నిజంగానే ప్రూవ్ చేస్తున్నారనే కామెంట్ వ్యక్తం అవుతున్నాయి. ఐదవ వారం అపూర్వ (Apoorva), చరణ్ (Charan) ఎలిమినేట్ అయ్యాక.. ఐదుగురు కొత్తగా హౌస్ లోకి వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్క వైల్డ్ కార్డు కంటెస్టెంట్ రోహిత్ -శాలిని రిలేషన్ గురించి, వారి ఆట గురించి విమర్శలు చేయడం, ఆఖరికి హోస్ట్ నాగార్జున కూడా వీరి పైన ఫైర్ అవుతూ అర్ధరాత్రి వరకు వీరికి గుసగుసలు ఎక్కువ అంటూ చేసిన కామెంట్లకు వీరిద్దరూ చాలా హర్ట్ అయినట్లు చూపించారు. అయితే నేడు సోమవారానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో ఆ మంట మరింత పెరిగింది అని చెప్పాలి.

మాటలు జారుతున్న రోహిత్..

ఆరవ వారం ఆరంభం అవడంతో సోమవారానికి సంబంధించి విడుదల చేసిన ప్రోమోలో కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డుల వల్ల ఇంట్లో ఫుడ్ సరిపోలేదని అర్థమవుతుంది. ఇక మధ్యాహ్నం తన భోజనాన్ని వర్షిని శివ్ కి ఇస్తే, నరేష్ దాచిపెట్టుకున్న కప్పు రైస్ ని రాత్రిపూట వర్షినికి ఇచ్చాడు త్రిగుణ్. ఇక రోహిత్ – శాలిని దాచిపెట్టుకున్న పప్పుని వాడుకోవడం తోనే ఈ గొడవ మొదలైనట్టు అనిపిస్తోంది.. ప్రోమోను గమనిస్తే.. కెప్టెన్ సుధీర్ – శాలిని మాట్లాడుతుండగా.. త్రిగుణ్ వచ్చి పక్కన పెట్టిన రేషన్ తీసేయొచ్చా అని అడుగుతాడు. దీనికి సుధీర్ మాట్లాడుతూ.. మీ ఇష్టం అన్నా.. రేషన్ మీరు చూసుకోండి అంటూ చెబుతారు. త్రిగుణ్ అందుకే ఒక మాట చెబుతున్నాను అంటూ వెళ్తుంటే.. శాలిని పడేస్తున్నారా అంటూ అడుగుతుంది. లేదు.. అని చెబితే.. ఆ పప్పు మాదే అని చెబుతుంది. వెంటనే తినేసేయండి అంటూ చెబుతాడు త్రిగుణ్ .

త్రిగుణ్ పై ఫైర్..

Advertisement

కిచెన్ లో రోహిత్ మాట్లాడుతూ.. త్రిగుణ్ ఈ రోజు పప్పు వేసుకున్నారా? అని అడిగితే.. అవును శివ్ వస్తే తనకు వడ్డించారు.. మీకు పప్పు కావాలా అని అడిగితే.. రోహిత్ అవును మాకు పప్పు కావాలి అంటూ చెబుతారు. తర్వాత రైస్ ని ఎవరెవరికి అడ్జస్ట్ చేశారో వివరిస్తూ.. శాలిని మీకు ముందే చెప్పాను కదా.. పప్పు ఉంటే తినేసేయండి అని.. శివ్ వచ్చినప్పుడు రైస్ లేదు.. మా భోజనం మధ్యాహ్నం శివ్ కి ఇచ్చాం కదా.. ఇప్పుడు మాకు కావాలి.. ఆకలేస్తుంది అంటూ చెప్పగానే.. రోహిత్ ఫైర్ అవుతూ..” అసలు నువ్వు ఎవరు తీసుకోవడానికి?” అంటూ మండిపడతారు. నేను పోర్షన్ డిపార్ట్మెంట్ కదా అని చెబుతుంటే.. నాకు అవసరం లేదు.. నేను లెక్క చేయను అంటూ రోహిత్ ఫైర్ అయ్యాడు.

కెప్టెన్ సుదీర్ కి అవమానం..

రోహిత్ కి పెట్టే ఫుడ్డు పడేస్తున్నారు అని త్రిగుణ్ అంటాడు. నీకు ఫుడ్ మీద అంత కన్సర్న్ ఉంటే వేస్ట్ చేయొద్దు అని అంటాడు కెప్టెన్ సుధీర్. మధ్యలో నువ్వేంటి? నువ్వెందుకు ఇక్కడ.. దూరం జరుగు.. అసలు ఎందుకు వస్తున్నావ్ ? అని చాలా తక్కువ చేసి అవమానించినట్టు మాట్లాడారు రోహిత్. నా కం బ్యాక్ కోసం వెయిట్ చెయ్ సుధీర్ అని రోహిత్ అంటాడు . మేము కూడా అదే కదా కోరుకుంటుంది అని సుధీర్ అంటాడు.

Advertisement

also read: నేను బ్రతికున్నంత వరకు నీ ఆత్మ నరకం అనుభవించాలి – తనుశ్రీ

మళ్లీ మాటలు జారిన త్రిగుణ్..

మధ్యలో త్రిగుణ్.. నువ్వు వేస్ట్ గాడివి.. నీకేం పని రాదు అని మాటలు జారేస్తాడు.. నీకు వచ్చు కదా అని రోహిత్ అంటే.. ఆయన మాటలు ఏం మాట్లాడుతున్నాడో చూడండి అని మళ్లీ త్రిగుణ్ అంటాడు. ఇద్దరు ఒకరికొకరు మాటలు అనుకుంటూ ఉండగా.. మధ్యలో సుధీర్ గొడవను ఆపే ప్రయత్నం చేయగా.. మధ్యలో నువ్వు రాకు.. నీ పని నువ్వు చేసుకో అని అంటాడు రోహిత్. కెప్టెన్ నేను అని సుధీర్ అంటే .. అయితే ఏంటి? అన్నిట్లో మధ్యలోకి దూరుతావా? అని రోహిత్ చాలా ఓవర్ చేశాడు. మనిషిలా ప్రవర్తించు అని సుధీర్ కౌంటర్ వేశాడు. మొత్తానికి నామినేషన్ కంటే కూడా ఈ గొడవే ఈరోజు ఎపిసోడ్లో చాలా హైలెట్గా అయ్యేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా కెప్టెన్ గా సుధీర్ ను అవమానించడమే కాకుండా .. రోహిత్ మాటలు జారుతూ వరస్ట్ బిహేవియర్ అనిపించుకోవడంతో ఆడియన్స్ ఫైర్ అవుతున్నారు.

Related News

నిజమే గెలుస్తుంది.. మరో సంచలన పోస్ట్ తో యూట్యూబర్ నందన!

Telugu Tv Serials : బిగ్ షాక్.. ఆ ఛానెల్లో ఒకేసారి 4 సీరియల్స్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఇంటింటి రామాయణం అవుట్..

Podarillu Today Episode : కన్నా దూరమయ్యాడా..? మహాకు క్షమాపణ.. జమున ప్లాన్ ఇదా..?

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య ప్రభా హ్యాపీ.. చింతామణికి దిమ్మతిరిగే షాక్..హైలెట్ ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కొడుకు కోసం రామరాజు కన్నీళ్లు.. దొరికిపోయిన అమూల్య.. శ్రీవల్లికి దిమ్మతిరిగే షాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 12th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ కు కార్తీక్ వార్నింగ్ – జ్యోత్స్న ఎక్కడికి వెళ్లినట్టు..?           

Big Stories

Advertisement
×