Big Stories

New Liquor Brands in Telangana: మందుబాబులకు షాక్.. కొత్త బీర్ బ్రాండ్లపై మీమ్ ల ఎఫెక్ట్.. తాత్కాలికంగా బ్రేక్..?

New Liquor Brands in Telangana: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు రాబోతున్నాయన్న వార్తతో మందుబాబులు హర్షం వ్యక్తం చేశారు. కానీ.. ఆయా బ్రాండ్లపై నిరసనగా సోషల్ మీడియాలో మీమ్ లు రావడంతో.. వాటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. మద్యం ప్రియుల నుంచే కొత్త బ్రాండ్లపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు సమాచారం. బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

- Advertisement -

కొత్తగా వచ్చే బీర్ బ్రాండ్లపై నెటిజన్ల నుంచి, మందుబాబుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీమ్ లతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరగడంతో.. కొత్తకంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఆపివేసినట్లు సమాచారం. రాష్ట్రం కొత్త బీర్లను సరఫరా చేసేందుకై బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త కంపెనీలకు అనుమతులిచ్చింది. ఈ 5 కంపెనీలు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యాయి. అయితే.. లైసెన్సులు పొందిన కంపెనీలు సరైన నేపథ్యం లేకపోవడంతో పాటు కల్తీ మద్యాన్ని అమ్ముతున్నట్లుగా కథనాలు రావడంతో వ్యతిరేకత వ్యక్తమైంది.

- Advertisement -

Also Read : టీటీడీపీ వైపు మల్లారెడ్డి చూపు? ఎందుకంటే..

ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీల ప్రతినిధులతో వాటికిచ్చిన అనుమతుల్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోకి కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదన్న ఆయన .. గత ప్రభుత్వమే అనేక శాఖల్లో బిల్లుల్ని పెండింగ్ లో ఉంచిందన్నారు. ఆ బిల్లులు పెండింగ్ లో ఉండటం వల్లే కంపెనీలు బీర్ల సరఫరా ఆపి ఉండొచ్చని.. అంతే తప్ప కృత్రిమ కొరత మాత్రం లేదన్నారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో మద్యం ధరలను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక స్పిరిట్ ధరలను పెంచడం తొలిసారి అయితే.. గడిచిన ఐదేళ్లలో ఇది మూడోసారి. బీఆర్ఎస్ హయాంలో 2022లో బీర్, ఫారిన్ లిక్కర్ ధరలను పెంచింది. అంతకుముందు మే 2020, కోవిడ్ – 19 లాక్ డౌన్ సమయంలో కేసీఆర్ సర్కార్ మద్యం రేట్లను పెంచింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News