E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4 పై భారీ ఆఫర్! కేవలం రూ.1,149 కే మైక్‌తో.. బ్లూటూత్ స్పీకర్

పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4 పై భారీ ఆఫర్! కేవలం రూ.1,149 కే మైక్‌తో.. బ్లూటూత్ స్పీకర్
Advertisement

Portronics Breeze 4:  చిన్న పార్టీలైనా, అవుట్‌డోర్ ట్రిప్స్ అయినా బ్యాక్‌గ్రౌండ్‌లో మంచి మ్యూజిక్ ఉంటే ఆ కిక్కే వేరు. అందుకే ప్రముఖ యాక్సెసరీస్ బ్రాండ్ పోర్ట్రానిక్స్ నుంచి ‘Portronics Breeze 4’ పోర్టబుల్ స్పీకర్ మార్కెట్లో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో ఏకంగా 43% భారీ తగ్గింపుతో కేవలం రూ.1,149 ధరకే ఇది లభిస్తోంది. ఇన్-బిల్ట్ మైక్, IPX6 వాటర్ రెసిస్టెన్స్, TWS ఫీచర్లతో ట్రెండ్ అవుతున్న ఈ మినీ ఆడియో పవర్‌హౌస్ పూర్తి వివరాలు.

ఇప్పుడున్న ట్రెండ్‌లో పెద్ద పెద్ద హోమ్ థియేటర్ల కంటే.. జేబులో లేదా బ్యాగులో ఇమిడిపోయే పోర్టబుల్ స్పీకర్లకే డిమాండ్ ఎక్కువ. మనం ఎక్కడికి వెళ్లినా పాటలు వినడానికి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి ఇవి ఎంతో కంఫర్టబుల్‌గా ఉంటాయి. ఈ క్రమంలోనే తక్కువ బడ్జెట్‌లో నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో.. లాంచ్ అయిందే ఈ ‘పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4’. కేవలం రూ.1,149 ధరలోనే లభిస్తున్న ఈ స్పీకర్ ఫీచర్లు చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

5W పవర్‌ఫుల్ సౌండ్ & పంచ్ బేస్:

Advertisement

పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4 చూడటానికి చాలా కాంపాక్ట్‌గా, ముద్దుగా ఉంటుంది. కానీ దీని నుంచి వచ్చే సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇందులో 5W ఆడియో అవుట్‌పుట్ డ్రైవర్లను ఉపయోగించారు. దీని వల్ల పాటల్లోని వోకల్స్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా వినిపిస్తాయి. లౌడ్‌నెస్‌తో పాటు క్లాసిక్ బేస్ కూడా ఉండటంతో మెలోడీ సాంగ్స్ నుంచి మాస్ బీట్స్ వరకు అన్నీ అదిరిపోతాయి.

బ్లూటూత్ 5.3v & లేటెస్ట్ టైప్-సి ఛార్జింగ్:

ఈ స్పీకర్‌లో అడ్వాన్స్‌డ్ బ్లూటూత్ 5.3 (v5.3) టెక్నాలజీని ఇచ్చారు. దీని వల్ల మీ స్మార్ట్‌ఫోన్ లేదా లాప్‌టాప్‌తో సెకన్లలో కనెక్ట్ అయిపోతుంది. కనెక్షన్ అస్సలు కట్ అవ్వదు.ఇక ఛార్జింగ్ విషయానికి వస్తే.. ఇందులో మోడరన్ టైప్-సి (Type-C) పోర్ట్ ఇచ్చారు. అంటే మీ ఫోన్ ఛార్జర్‌తోనే దీన్ని చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు.

8 గంటల నాన్-స్టాప్ ప్లేబ్యాక్:

Advertisement

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్పీకర్ ఏకంగా 8 గంటల పాటు నిరంతరాయంగా పాటలను ప్లే చేస్తుంది. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు లేదా ఫ్రెండ్స్‌తో కలిసి నైట్ క్యాంపింగ్ వెళ్లినప్పుడు బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అస్సలు ఉండదు.

TWS ఫీచర్ :

ఈ స్పీకర్‌లో ఉన్న మోస్ట్ క్రేజీ ఫీచర్ TWS కనెక్టివిటీ. మీ దగ్గర గనుక రెండు పోర్ట్రానిక్స్ బ్రీజ్ 4 స్పీకర్లు ఉంటే.. ఆ రెండింటినీ వైర్‌లెస్‌గా ఒకదానికొకటి కనెక్ట్ చేయవచ్చు. దీని వల్ల మీకు లెఫ్ట్, రైట్ ఛానెల్స్‌తో థియేటర్ లాంటి స్టీరియో సౌండ్ ఎఫెక్ట్ లభిస్తుంది.

Also Read: ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్‌బార్.. తక్కువ బడ్జెట్‌లో ఇల్లే సినిమా థియేటర్!

ఇన్-బిల్ట్ మైక్ :

పాటలు వింటున్నప్పుడు ఏదైనా ఫోన్ కాల్ వస్తే.. ఫోన్ చేతిలోకి తీసుకోకుండానే స్పీకర్‌లోనే మాట్లాడటానికి ఇందులో ఇన్-బిల్ట్ మైక్ ఇచ్చారు. ఆఫీస్ కాన్ఫరెన్స్ కాల్స్ కోసం కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే.. దీనికి IPX6 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ ఉంది. అంటే పూల్ సైడ్ పార్టీలలో చిన్నపాటి నీటి తుంపరలు పడినా, లేదా చెమట తగిలినా ఈ స్పీకర్ అస్సలు పాడవదు.

ధర:

మార్కెట్లో దీని అసలు ధర ఎక్కువే ఉన్నప్పటికీ, ప్రస్తుతం 43% ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.1,149 కే అందుబాటులో ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో టైప్-సి, వాటర్ ప్రూఫ్ బాడీ, బ్రాండెడ్ క్వాలిటీ , మైక్ ఉన్న స్పీకర్ దొరకడం చాలా అరుదు. బడ్జెట్ ఫ్రెండ్లీగా ఒక బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ కొనాలనుకుంటే దీనిపై ఓ కన్నేయండి.

Related News

జియో యూజర్లకు పండగే.. రూ.798కే 100 Mbps స్పీడ్.. ఫ్రీ Zee5 సబ్‌స్క్రిప్షన్!

iPhone 18 Pro లాంచ్ డేట్ వచ్చేసిందోచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, 12GB RAMతో ఊచకోత!

ట్రెండ్‌ను మార్చేలా సోనీ కొత్త బ్రావియా టీవీలు లాంచ్.. జెమిని ఏఐ సపోర్ట్‌తో వావ్ అనిపించేలా ఫీచర్లు!

మండిపోతున్న యూరప్.. కానీ ఇళ్లలో ఏసీలు లేవు.. ఎందుకో తెలుసా?

సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్.. ఒప్పో ఎన్కో ఎయిర్ 5 ప్రో ఇయర్‌బడ్స్‌పై క్రేజీ ఆఫర్స్!

కరెంట్, నీటిని ఆదా చేసే వాషింగ్ మెషీన్లు..అమెజాన్‌లో 20వేలలోపే!

ఫిలిప్స్ బ్లూటూత్ సౌండ్‌బార్.. తక్కువ బడ్జెట్‌లో ఇల్లే సినిమా థియేటర్!

Big Stories

×