E-Paper
Advertisement

చూడగానే నచ్చేసే డిజైన్.. 11,000mAh భారీ బ్యాటరీ.. మార్కెట్లోకి వస్తోన్న Honor క్రేజీ ఫోన్ ఇదే!

చూడగానే నచ్చేసే డిజైన్.. 11,000mAh భారీ బ్యాటరీ.. మార్కెట్లోకి వస్తోన్న Honor క్రేజీ ఫోన్ ఇదే!
Advertisement

Honor X80 Pro Max: హానర్ ప్రియులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. సరికొత్త ఫీచర్లు, ఊహించని బ్యాటరీ సామర్థ్యంతో మరో క్రేజీ మొబైల్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో చైనాలో 10,080mAh బ్యాటరీతో Honor Power 2 ఫోన్‌‌ను విడుదల చేసి రికార్డు సృష్టించిన ఈ సంస్థ.. ఇప్పుడు అంతకంటే పెద్ద బ్యాటరీతో Honor X80 Pro Maxను పరిచయం చేయబోతోంది. ఈ మేరకు అధికారికంగా లాంచ్ డేట్‌ను కూడా ప్రకటించింది.

జూన్ 22న గ్రాండ్ ఎంట్రీ:

ఈ సరికొత్త Honor X80 Pro Max స్మార్ట్‌ఫోన్ జూన్ 22వ తేదీన చైనాలో సాయంత్రం 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు) విడుదల కానుంది. ఈ విషయాన్ని కంపెనీ తమ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. లాంచ్ డేట్‌తో పాటు ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు, ఛార్జింగ్ వివరాలను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలోని ఆనర్ ఆన్‌లైన్ స్టోర్‌లో ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది.

11,000mAh భారీ బ్యాటరీ:

Advertisement

ఈ ఫోన్ యొక్క ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీనే అని చెప్పాలి. ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అమర్చారు. ఇది పాత మోడల్ అయిన హానర్ పవర్ 2 కంటే చాలా పెద్దది. ఇంతటి భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, వినియోగదారులకు వేగంగా ఛార్జింగ్ అయ్యేలా దీనికి 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అంతేకాదు.. అత్యవసర సమయాల్లో ఇతర డివైజ్‌లను ఛార్జ్ చేసుకోవడానికి 27W రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.

Also Read: షియోమీ నుంచి మరో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ సిరీస్.. Madrid కోడ్‌నేమ్‌తో Xiaomi 18 లీక్!

ఆకట్టుకునే డిజైన్, రంగులు:

Advertisement

లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా క్లాసీగా ఉండబోతోంది. ఫోన్ వెనుక భాగంలో ఒకే ఒక కెమెరా లెన్స్‌తో కూడిన గుండ్రటి (సర్క్యులర్) కెమెరా మాడ్యూల్ ఉంటుంది. కింద భాగంలో హానర్ బ్రాండింగ్ కనిపిస్తుంది. డిస్‌ప్లేపై భాగంలో సెల్ఫీ కెమెరా కోసం హోల్‌పంచ్ కటౌట్ ఇచ్చారు. ఈ ఫోన్ లైట్నింగ్ రెడ్, మూన్‌లైట్ వైట్, మిస్టిక్ బ్లాక్, వైబ్రెంట్ ఆరెంజ్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుంది.

ఫీచర్ల వివరాలు ఇవే:

కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 50MP మ్యాట్రిక్స్ ఏఐ విజన్ కెమెరా సిస్టమ్‌ను అందించారు. ఫోన్‌కు కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్లు ఉంటాయి. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ 6.8 అంగుళాల OLED డిస్‌ప్లేతో రానుంది. అలాగే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు స్టాండర్డ్ ఆనర్ X80 మోడల్‌ను కూడా కంపెనీ పరిచయం చేసే అవకాశం ఉంది.

Also Read: WWDC 2026 ఈవెంట్‌లో ఆ 3 క్రేజీ ఫీచర్లను దాచేసిన యాపిల్.. లీక్ చేసిన బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్!

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×