E-Paper
Advertisement

ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!

ఆన్‌లైన్ షాపింగ్‌కు ప్రతి నెలా ఎంత ఖర్చు చేయాలి? తెలివైన బడ్జెట్ సీక్రెట్ ఇదే!
Advertisement

Online shopping: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. మన చేతిలో స్మార్ట్‌ ఫోన్ ఉంటే చాలు.. బట్టల నుంచి హోం అప్లయన్సెస్ వరకు అన్నీ ఒకే క్లిక్‌తో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. కొన్ని సార్లు ఆన్‌ లైన్ ఈ-కామర్స్ యాప్‌లు ఇస్తున్న క్రేజీ ఆఫర్లు, ఫ్లాష్ సేల్స్ చూసి మనకు అవసరం లేని వస్తువులను కూడా కొనేస్తుంటాం. కానీ ఇలా జీతం రాగానే ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేయడం వల్ల నెల చివరికి ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మరి ప్రతి నెలా ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఎంత ఖర్చు చేయాలి? దీనికోసం ఎలాంటి బడ్జెట్ సూత్రాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

50-30-20 బడ్జెట్ రూల్:

ఆర్థిక నిపుణులు ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ ఫార్ములాను సూచిస్తారు.. అదే 50-30-20 బడ్జెట్ రూల్. దీని ప్రకారం మీ నెల వారి ఆదాయంలో 50 శాతాన్ని ఇంటి రెంట్, కిరాణా సామాన్లు, కరెంట్ బిల్లులు వంటి అత్యవసర ఖర్చులకు కేటాయించాలి. ఇక 20 శాతాన్ని భవిష్యత్తు కోసం సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్లు చేయాలి. మిగిలిన 30 శాతాన్ని మీ వ్యక్తిగత కోరికలు, ఎంటర్‌టైన్‌మెంట్ , షాపింగ్ కోసం వాడుకోవాలి. అంటే ఈ 30 శాతం మొత్తంలోనే మీ ఆన్‌లైన్ షాపింగ్ ఖర్చులు అన్నీ సర్దుబాటు కావాలి.

షాపింగ్ కోసం ఎంత కేటాయించాలి?

Advertisement

అయితే.. ఈ 30 శాతం మొత్తం నుంచి కూడా ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎంత కేటాయించాలనేది మీ పర్సనల్ గోల్స్ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా మీ మొత్తం నెలవారీ సంపాదనలో 5 నుంచి 10 శాతం కంటే ఎక్కువ ఆన్‌లైన్ షాపింగ్ కోసం ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మీ జీతం రూ. 50,000 అనుకుంటే, షాపింగ్ కోసం కేవలం రూ. 2,500 నుంచి రూ. 5,000 వరకు మాత్రమే కేటాయించాలి. అంతకంటే మించితే మీ బడ్జెట్ తారుమారు కావడం ఖాయం.

48 గంటల రూల్ పాటించండి:

ఆన్‌లైన్ షాపింగ్‌లో డబ్బులు అనవసరంగా ఖర్చు కాకుండా ఉండాలంటే కొన్ని స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. ముందుగా మీకు నచ్చిన వస్తువును కార్ట్‌లో వేసిన వెంటనే కొనేయకండి. కనీసం 48 గంటలు ఆగండి. ఆ తర్వాత కూడా ఆ వస్తువు నిజంగా మీకు అవసరమా లేదా అని ఆలోచించండి. చాలా వరకు మనకు ఆ ప్రొడక్ట్ మీద ఉన్న తాత్కాలిక మోజు తగ్గిపోయి, డబ్బులు ఆదా అవుతాయి. అలాగే షాపింగ్ యాప్‌లలోని అనవసరమైన నోటిఫికేషన్లను ఆఫ్ చేయడం చాలా ముఖ్యం.

Advertisement

Also Read: మీ చేతులకు రెస్ట్ ఇచ్చి, గిన్నెలను కొత్తగా మెరిపించే డిష్‌వాషర్లు!

క్రెడిట్ కార్డుల వాడకంలో జాగ్రత్త:

క్రెడిట్ కార్డులు, ఈజీ ఈఎంఐల వాడకం కూడా ఆన్‌ లైన్ షాపింగ్‌లో మన జేబును గుల్ల చేస్తుంది. తర్వాత.. కట్టొచ్చులే అనే ధైర్యంతో ఇష్టాను సారంగా కొనేస్తుంటాం. కానీ.. మంత్ ఎండ్ వచ్చే సరికి ఇంట్రెస్ట్‌లతో కలిపి పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించాల్సి వస్తుంది.కాబట్టి ఎప్పుడైనా సరే మీ డెబిట్ కార్డ్ లేదా క్యాష్ లిమిట్ లోపల మాత్రమే షాపింగ్ చేయడానికి ప్రయత్నించండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేయడం తప్పు కాదు, అది మన ఆనందం కోసం చేసే పనే. నీ అది మన నెత్తిన అప్పుల భారం మోపేలా ఉండకూడదు. ఒక సరైన బడ్జెట్ ప్లాన్ వేసుకొని, లిమిట్‌లో షాపింగ్ చేస్తే..తిలో డబ్బులు నిలవడంతో పాటు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు.

Related News

అప్పుల ఉచ్చులో..చిక్కుకున్నారా? ఈ 7 తెలివైన మార్గాలతో ఈజీగా బయటపడండి

సముద్రంపైనే అద్భుత వ్యవసాయం.. ఉప్పు నీటితో కూరగాయల సాగు.. అదరగొట్టేశారు కదయ్యా!

చీకట్లోనూ కలర్ వీడియో.. పిల్లలు, పెంపుడు జంతువుల నిఘాకు షియోమీ కొత్త 4K కెమెరా!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 500 లోపే 15 ఓటీటీలు.. ఉచిత AI, క్లౌడ్ స్టోరేజ్!

8 రకాల బ్యాక్టీరియా, వైరస్‌లకు 99.9% చెక్.. షియోమీ కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ ప్రత్యేకతలివే!

ల్యాప్ టాప్ కొనే ఆలోచన ఉందా? ఇప్పుడే..కొనడం బెటర్

ట్రిపుల్ లేజర్‌తో మార్కెట్లోకి వచ్చేసిన 4K ప్రొజెక్టర్.. 6100 ISO ల్యూమెన్స్‌తో అదరగొడుతోంది!

Big Stories

Advertisement
×