Allu Arjun: ప్రస్తుత జనరేషన్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు పేర్లు వినిపిస్తాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో చాలామంది యాక్టర్లు మంచి హిట్ సినిమాలు చేసి వాళ్లు కూడా మంచి స్టార్ డం ను తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్,అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సాధించారు. ఇకపోతే ఈ జనరేషన్ హీరోస్ అంతా కూడా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ సినిమా రామ్ చరణ్ తేజ్ మరియు ఎన్టీఆర్ కు విపరీతమైన గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైంది. ఈ సినిమాకి మొదట మిశ్రమ స్పందన లభించిన ఆ తర్వాత మంచి కలెక్షన్స్ వసూలు చేసింది.
ఒక ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి కంప్లీట్ గా మారిపోయింది. ఇప్పటివరకు ప్రభాస్ చేసిన ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలైంది. సినిమా ఫలితాలు ప్రభాస్ ను నిరాశపరిచిన కూడా ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికీ రెండు వెయ్యి కోట్లు సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సాధించి 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మహేష్ బాబు తెలుగులో తప్ప పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయలేదు. ఇక ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని బాలకృష్ణ అన్ స్టాపబుల్ ప్రోగ్రాం లో అల్లు అర్జున్ ఒక ప్రశ్న వేశారు.
Also Read : Allu Arjun : నేషనల్ అవార్డు ను నేను తెలుగు హీరోస్ కి డేడికేట్ చేస్తా
పుష్ప సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అన్ స్టాపబుల్ షో కి హాజరయ్యాడు అల్లు అర్జున్. ఈ షోలో మహేష్ బాబు, ప్రభాస్ వీరిద్దరిలో నీకు ఎవరు గట్టి పోటీ అని అనుకుంటున్నావు అని అడగ్గానే పుష్ప సినిమా పాటలోని లిరిక్స్ ను చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. “నన్ను మించి ఎదిగేటోడు ఇంకొకడున్నాడు చూడు ఎవడంటే అది రేపటి నేనే” అంటూ పుష్ప టైటిల్ సాంగ్ లో చంద్రబోస్ రాసిన లిరిక్స్ చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ఈ కామెంట్స్ ను ఎలివేషన్ గా వాడితే. ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ బానే ఎక్స్ట్రాలు అంటూ ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఇక మహేష్ బాబుని మినహాయిస్తే ప్రభాస్ తో అల్లు అర్జున్ కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.