E-Paper
Advertisement

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!
Advertisement

Smartphone battery: ఉదయం లేచే సరికి వంద శాతం ఉన్న ఫోన్ ఛార్జ్.. మధ్యాహ్నం అయ్యేసరికి పూర్తిగా ఖాళీ అయిపోతుందా? ప్రతీసారీ పవర్ బ్యాంక్ జేబులో వేసుకుని తిరగలేకపోతున్నారా? ఈ సమస్య నేడు చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లమే! అయితే.. మీ ఫోన్ బ్యాటరీ ఇంత త్వరగా డ్రైన్ అవ్వడానికి అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఫోన్‌లో ఏ యాప్ సైలెంట్‌గా ఎక్కువ ఛార్జింగ్ వాడుతోందనేది కేవలం రెండు నిమిషాల్లో కనుగొనవచ్చు. అంతేకాదు.. మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్‌ను రెట్టింపు చేసుకోవడానికి సహాయపడే కొన్ని సింపుల్ అండ్ ట్రెండీ ట్రిక్స్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం!

ఏ యాప్ ఎక్కువ బ్యాటరీ ఖర్చు చేస్తోంది ?

1.ముందుగా మీ ఫోన్‌లోని Settings (సెట్టింగ్స్) ఓపెన్ చేయండి.

Advertisement

2.అందులో Battery (బ్యాటరీ) లేదా Battery & Device Care ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

3.అక్కడ Battery Usage లేదా Battery Manager అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని.. ఓపెన్ చేస్తే.. గత కొన్ని గంటల్లో లేదా రోజుల్లో ఏ యాప్ ఎంత శాతం బ్యాటరీని వాడిందో క్లియర్ లిస్ట్ కనిపిస్తుంది.

Advertisement

4.సోషల్ మీడియా యాప్స్, గేమ్స్ లేదా మీరు రోజూ వాడని యాప్స్ ఏమైనా ఎక్కువ బ్యాటరీని తీసుకుంటుంటే.. ఇక్కడే తెలుసుకోవచ్చు.

బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌కు చెక్ :

మనం వాడకపోయినా కొన్ని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ డేటాను, బ్యాటరీని లాగేస్తుంటాయి. దీన్ని ఆపడానికి సెట్టింగ్స్‌లో ఉండే ‘Restrict Background Activity’ లేదా ‘Optimize Battery Usage’ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. దీని వల్ల ఆ యాప్స్ మీరు ఓపెన్ చేసినప్పుడే పని చేస్తాయి. మిగతా సమయంలో బ్యాటరీని వేస్ట్ చేయవు.

బ్రైట్‌నెస్,లొకేషన్ సెట్టింగ్స్:

మన ఫోన్ బ్యాటరీని ఖర్చు చేసే తినే మరో ప్రధానమైన విషయం స్క్రీన్ బ్రైట్‌నెస్. అనవసరంగా.. బ్రైట్‌నెస్‌ను ఫుల్‌లో పెట్టుకోవడం వల్ల ఛార్జ్ త్వరగా అయిపోతుంది. దీనికోసం ‘Adaptive Brightness’ (ఆటోమేటిక్ బ్రైట్‌నెస్) ఆన్ చేసుకుంటే, వాతావరణానికి తగినట్లుగా స్క్రీన్ లైట్ అదే అడ్జస్ట్ అవుతుంది. అలాగే జీపీఎస్ , బ్లూటూత్, వైఫై అవసరం లేనప్పుడు ఆఫ్‌లో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

Also Read: రూ.45 వేలలోపు బెస్ట్ ల్యాప్ టాప్స్.. కొంటే ఇలాంటి మోడల్స్ ఏ కొనాలి

డార్క్ మోడ్, అన్‌ఇన్‌స్టాల్:

మీ ఫోన్‌లో అమోలెడ్ డిస్‌ప్లే ఉంటే.. వీలైనంత వరకు డార్క్ మోడ్ వాడటం మంచిది. ఇది స్క్రీన్ లైట్ బాగా తగ్గించి బ్యాటరీని సేవ్ చేస్తుంది. అలాగే మీ ఫోన్‌లో అనవసరంగా నెలల తరబడి వాడని యాప్స్ ఏమైనా ఉంటే.. వాటిని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిది. ఎందుకంటే.. అవి సైలెంట్‌గా నోటిఫికేషన్లు పంపిస్తూ బ్యాటరీని హరిస్తుంటాయి.

రోజూ మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రైన్ అవుతుంది. పైన చెప్పిన సింపుల్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్‌ను అద్భుతంగా పెంచుకోవచ్చు. పవర్ బ్యాంక్ మోసే పని లేకుండా మీ ఫోన్ లైఫ్‌ ఇప్పుడే ఇంప్రూవ్ చేసుకోండి.

Related News

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

బెస్ట్ మోడల్ ఇయర్ బడ్స్..ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే!

నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్.. భారీ డిస్కౌంట్‌లో హైయర్ స్మార్ట్ టీవీ

పైసా ఖర్చు లేకుండా నెట్‌ఫ్లిక్స్.. Jio, Airtel, Vi లో.. చౌకైన ఓటీటీ ప్లాన్స్ ఇవే!

Big Stories

Advertisement
×