E-Paper
Advertisement

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!
Advertisement

Mosquitofish Invasion: దోమలను నిర్మూలించేందుకు 120 ఏళ్ల క్రితం ఒక దీవిలోకి ప్రవేశపెట్టిన ఒక చిన్న చేప.. ప్రస్తుతం తీవ్రమైన పర్యావరణ విపత్తుకు కారణమవుతోంది. 1905లో అమెరికాలోని హవాయి దీవులలో దోమల ద్వారా వ్యాపించే భయంకరమైన వ్యాధులను అరికట్టడానికి ఆగ్నేయ ప్రాంతం నుండి ‘ఈస్టర్న్ మస్కిటోఫిష్’ (గాంబుసియా అఫినిస్) అనే చిన్న రకం చేపలను తీసుకొచ్చారు. స్థానిక వ్యవసాయ కాలువలు, ఏరులు, మడుగుల్లో వీటిని విచ్చలవిడిగా వదిలేశారు. అయితే ఈ చేపలు కేవలం దోమల లార్వాలను మాత్రమే కాకుండా అక్కడ దశాబ్దాలుగా స్వేచ్ఛగా జీవిస్తున్న అరుదైన స్థానిక మంచినీటి జీవులను విపరీతంగా తినడం ప్రారంభించాయి.

అంతరించిపోతున్న డ్యామ్‌సెల్ ఫ్లైస్

అమెరికా ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ (USFWS) ఇటీవల విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఈ చేపల దాడి వల్ల హవాయికి చెందిన ‘మెగాలాగ్రియాన్’ జాతికి చెందిన డ్యామ్‌సెల్ ఫ్లైస్ (తుమ్మెదను పోలి ఉండే కీటకాలు) జనాభా దారుణంగా పడిపోయింది. హవాయిలోని ఎత్తైన సెలయేర్లలో ఉండే ఈ కీటకాలకు చేపల దాడి నుండి తప్పించుకునే నేర్పు లేదు. దీనికి తోడు ఒడ్డున పెరిగే డ్యామ్‌సెల్ ఫ్లైస్ లార్వాలను ఈ మస్కిటోఫిష్‌లు విచ్చలవిడిగా తినేస్తున్నాయి. ఫలితంగా క్రిమ్సన్, ఫ్లయింగ్-ఇయర్ లోబ్ వంటి అరుదైన జీవులు.. అక్కడి ఒవాహు, మోలోకాయ్, మౌయి దీవుల నుండి దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి.

జీవావరణ సమతుల్యతపై తీవ్ర దెబ్బ

Advertisement

ఈ చేపల ప్రభావం కేవలం కీటకాలకే పరిమితం కాలేదు. హవాయి దీవులకు మాత్రమే సొంతమైన ‘ఒవుపు’ అనే గోబీ చేపలకు, ‘ఒపై కలాఓలే’ రకం రొయ్యలకు లభించే ఆహారాన్ని కూడా ఇవి లాక్కుంటున్నాయి. అడుగుభాగంలో నాచును నియంత్రించే జీవులను కూడా ఇవి తినేస్తుండటంతో నీటి అడుగున పాచి విపరీతంగా పెరిగి అక్కడి పర్యావరణం నాశనమవుతోంది. ఇవి గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలను కనడం, విభిన్న నీటి ఉష్ణోగ్రతలను తట్టుకోవడంతో ఒక్క గర్భిణి చేప నీటిలో పడినా అతి తక్కువ సమయంలోనే ఆ ప్రాంతమంతా వీటి సంఖ్య విస్తరిస్తోంది.

Also Read: నెలకు రూ.30k, 50k, లక్ష జీతమా? మీ సేవింగ్స్ ఎంత ఉండాలో.. పక్కా లెక్కలు ఇవే!

చేపలను అడ్డుకోవడం కష్టమే!

Advertisement

హవాయిలోని నీటి కాలువలు ఒకదానికొకటి భూగర్భ జలాలతో అనుసంధానమై ఉండటం వల్ల ఈ చేపలను తొలగించడం అధికారులకు పెద్ద సవాలుగా మారింది. రసాయనాలు వాడితే స్థానిక జీవులు చనిపోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. అందుకే ప్రస్తుతం సహజ సిద్ధమైన జలపాతాలు ఉన్న ఎత్తైన పర్వత ప్రాంత ఏరుల్లోకి ఈ చేపలు ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచిన డ్యామ్‌సెల్ ఫ్లైస్‌ను సురక్షిత ప్రాంతాలలో వదులుతున్నారు. మెుత్తంగా చూస్తే ఒక సమస్య పరిష్కారానికి తీసుకొచ్చిన జీవి మరో మహమ్మారిగా మారిన తీరును చూసి పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: లష్కరే తోయిబా భారీ కుట్ర.. కాశ్మీర్‌లోకి 10,000 మంది ఉగ్రవాదులు.. పాక్ మతబోధకుడు వెల్లడి

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×