how to choose the right laptop: ఈ రోజుల్లో కాలేజీ స్టూడెంట్స్ నుంచి ఆఫీస్ ఎంప్లాయ్స్ వరకు ప్రతి ఒక్కరికీ లాప్‌టాప్ అనేది మస్ట్ అయిపోయింది. అయితే మార్కెట్లోకి వెళ్తే వందల మోడల్స్, రకరకాల బ్రాండ్లు, కన్ఫ్యూజ్ చేసే ఫీచర్లతో ఏది కొనాలో అస్సలు అర్థం కాదు. అవసరం లేని ఫీచర్ల కోసం ఎక్కువ డబ్బులు పెట్టేసి.. ఆ తర్వాత బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ మనీ వేస్ట్ అవ్వకుండాడా.. మీ అవసరాలకు సరిపోయే పర్ఫెక్ట్ లాప్‌టాప్‌ను కేవలం 4 సింపుల్ స్టెప్స్ ద్వారా ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు చూద్దాం.
లాప్‌టాప్ కొనడం అనేది ఒక ఇన్వెస్ట్‌మెంట్. అందుకే ఆత్రుతగా కాకుండా.. కొంచెం రీసెర్చ్ చేసి కొంటే ఐదేళ్ల వరకు తిరుగుండదు. మీ షాపింగ్ ఈజీ చేయడం కోసం ఇక్కడ 4 సింపుల్ టిప్స్ ఉన్నాయి.
1. మీ అసలు అవసరం ఏంటో డిసైడ్ అవ్వండి:
లాప్‌టాప్ కొనేముందు మీరు దాన్ని దేనికోసం వాడుతున్నారో క్లారిటీ తెచ్చుకోండి.
స్టూడెంట్స్ / బేసిక్ యూజర్స్: ఆన్‌లైన్ క్లాసులు,ఎంఎస్ ఆఫీస్, బ్రౌజింగ్, సినిమాలు చూడటం కోసం అయితే ఎక్కువ ఖరీదైనవి అవసరం లేదు.
ఆఫీస్ వర్క్ / కోడింగ్: కాస్త హెవీ సాఫ్ట్‌వేర్స్,మల్టీ టాస్కింగ్ చేసే వారికి మంచి ప్రాసెసర్ అవసరం.
గేమర్స్ / వీడియో ఎడిటర్స్:హెవీ గ్రాఫిక్స్, అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ వాడేవారికి హై-ఎండ్ లాప్‌టాప్‌లు కావాలి.
2. ప్రాసెసర్,ర్యామ్, స్టోరేజ్:
లాప్‌టాప్‌కు ఇవే మెయిన్. వీటిని బట్టే లాప్‌టాప్ స్పీడ్ ఆధారపడి ఉంటుంది.
ప్రాసెసర్ : బేసిక్ అవసరాలకు ఇంటెల్ i3 లేదా రైజెన్ 3 సరిపోతుంది. ఆఫీస్ వర్క్, కోడింగ్ కోసం ఇంటెల్ i5 లేదా రైజెన్ 5 బెస్ట్ ఆప్షన్. ఒకవేళ గేమింగ్, 4K ఎడిటింగ్ చేయాలంటే ఇంటెల్ i7 లేదా రైజెన్ 7 తీసుకోవాలి.
ర్యామ్ : ఈ రోజుల్లో 4GB ర్యామ్ అస్సలు వద్దు. లాప్‌టాప్ స్మూత్‌గా రన్ అవ్వాలంటే కనీసం 8GB RAM ఉండాల్సిందే. వీలైతే 16GB కి ప్రిఫరెన్స్ ఇవ్వండి.
స్టోరేజ్ : పాతకాలపు HDD స్టోరేజ్ జోలికి వెళ్లకండి. కేవలం SSD ఉన్న లాప్‌టాప్ మాత్రమే తీసుకోండి. SSD ఉంటే మీ లాప్‌టాప్ కేవలం 5 సెకన్లలో స్టార్ట్ అవుతుంది, పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. కనీసం 512GB SSD ఉండేలా చూసుకోండి.
3. డిస్‌ప్లే సైజ్ & బ్యాటరీ లైఫ్:
మీరు లాప్‌టాప్‌ను ఎక్కువగా బయటకు తీసుకెళ్లే పని ఉంటే, 14-ఇంచుల స్క్రీన్ సైజ్ ఉన్న లైట్ వెయిట్ లాప్‌టాప్ సెలెక్ట్ చేసుకోండి. పోర్టబిలిటీ ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లోనే ఉంచి వాడతాము. సినిమాలు బాగా చూస్తాము అనుకుంటే.. 15.6-ఇంచుల స్క్రీన్ బాగుంటుంది. డిస్‌ప్లే ఎప్పుడైనా Full HD ఉండేలా చూసుకోండి. అలాగే కనీసం 6 నుంచి 8 గంటల బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా ఉండాలి.
4. బడ్జెట్ , ధరల అంచనా:
లాప్‌టాప్ మార్కెట్ బడ్జెట్‌ను బట్టి మూడు రకాలుగా డివైడ్ అయి ఉంటుంది.
ఎంట్రీ లెవెల్ (బడ్జెట్ ఫ్రెండ్లీ): ర.25,000 నుంచి రూ. 38,000 వరకు
ఇందులో స్టూడెంట్స్, కోడింగ్ నేర్చుకునే వారికి సరిపోయే ఇంటెల్ i3/రైజెన్ 3, 8GB ర్యామ్, 512GB SSD లాప్‌టాప్‌లు వస్తాయి. అసుస్ వివోబుక్, హెచ్‌పి, లెనోవో బ్రాండ్స్ ఇందులో బెస్ట్.
మిడ్-రేంజ్ (ఆల్ రౌండర్స్): రూ.40,000 నుంచి రూ.65,000 వరకు
ఆఫీస్ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్ కోసం ఇది పర్ఫెక్ట్ రేంజ్. ఇంటెల్ i5 లేదా రైజెన్ 5 ప్రాసెసర్‌తో వచ్చే లాప్‌టాప్‌లు ఈ ధరలో లభిస్తాయి. మల్టీటాస్కింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
ప్రీమియం & గేమింగ్ (హై-ఎండ్): రూ.70,000 ప్లస్
హెవీ గేమింగ్, గేమ్ డెవలప్‌మెంట్, 4K వీడియో ఎడిటింగ్ చేసేవారికి గ్రాఫిక్స్ కార్డ్ (RTX సిరీస్) ఉన్న లాప్‌టాప్‌లు లేదా యాపిల్ మాక్‌బుక్ ఈ రేంజ్‌లో బెస్ట్ ఛాయిస్.
ఏదో ఒక బ్రాండ్ అని బ్లైండ్‌గా వెళ్లకుండా.. ఆన్‌లైన్ రివ్యూలు చూసి, పైన చెప్పిన 4 స్టెప్స్ మైండ్‌లో పెట్టుకుంటే మీ డబ్బులకు వాల్యూ ఇచ్చే బెస్ట్ లాప్‌టాప్‌ను మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. పండుగ సీజన్ సేల్స్ లేదా బ్యాంక్ డిస్కౌంట్లు ఉన్నప్పుడు కొంటే మరికొంత మనీ సేవ్ అవుతుంది.