E-Paper
Advertisement

గుడ్డిగా స్మార్ట్‌వాచ్ కొనేస్తున్నారా? ఆగండి..మీ లైఫ్‌స్టైల్‌కి సెట్ అయ్యే వాచ్‌ని ఇలా ఎంచుకోండి!

గుడ్డిగా స్మార్ట్‌వాచ్ కొనేస్తున్నారా? ఆగండి..మీ లైఫ్‌స్టైల్‌కి సెట్ అయ్యే వాచ్‌ని ఇలా ఎంచుకోండి!
Advertisement

How to choose a smartwatch: స్మార్ట్‌వాచ్ కొనడం అనేది ఇప్పుడు కేవలం ఒక టైమ్ చూసే గ్యాడ్జెట్ మాత్రమే కాదు. ప్రస్తుతం వందల మోడల్స్, రకరకాల బ్రాండ్లు మార్కెట్ లో అందుబాటులో ఉండటంతో.. అసలు మనకు ఏ వాచ్ కరెక్ట్‌గా సెట్ అవుతుందో తెలియక చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కేవలం లుక్స్ చూసి కొనేస్తే.. లాంగ్ రన్‌లో అది మీకు యూస్‌లెస్ కావచ్చు. అందుకే.. మీ డైలీ రొటీన్, మీ లైఫ్‌స్టైల్‌కి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అయ్యే స్మార్ట్‌వాచ్‌ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్‌వాచ్ ఎలా ఎంచుకోవాలి ?

1. ది ఫిట్‌నెస్ ఫ్రీక్ :

మీరు రోజు పొద్దున్నే లేచి రన్నింగ్ చేస్తారా? జిమ్‌లో గంటలు గంటలు వర్కౌట్ చేస్తారా? అయితే మీకు నార్మల్ స్మార్ట్‌వాచ్ సరిపోదు. మీకు కచ్చితమైన SpO2, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, ఇన్-బిల్ట్ GPS ఉన్న వాచ్ కావాలి. అంతేకాదు రఫ్ అండ్ టఫ్ యూసేజ్ కోసం 5 ATM వాటర్ రెసిస్టెన్స్ (స్విమ్మింగ్ కి పనికొచ్చేలా) ఉండాలి. గార్మిన్, ఫిట్‌బిట్ లేదా అమేజ్‌ఫిట్ లాంటి బ్రాండ్స్ మీకు బాగా సెట్ అవుతాయి.

2. ది కార్పొరేట్ ప్రొఫెషనల్ :

Advertisement

మీరు ఆఫీస్ మీటింగ్స్, ఈమెయిల్స్, ప్రొఫెషనల్ లుక్‌ను ఇష్టపడేవారైతే.. మీ వాచ్ మీ పర్సనాలిటీని ఎలివేట్ చేయాలి. స్లీక్ డిజైన్, మెటల్ లేదా లెదర్ స్ట్రాప్స్, ముఖ్యంగా AMOLED ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే ఉండాలి. మీటింగ్స్‌లో ఫోన్ తీయకుండానే క్విక్ రిప్లైస్ పంపే ఆప్షన్, క్యాలెండర్ అలర్ట్స్ ఉండేలా చూసుకోవాలి. శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ లేదా ఆపిల్ వాచ్ వీరికి బెస్ట్ ఛాయిస్ .

3. ది బైక్ రైడర్ & ట్రావెలర్ :

సగం రోజు మీ ప్రయాణాల్లోనే గడిచిపోతుందా? తరచూ బైక్ రైడింగ్ లేదా హైకింగ్ వెళ్తుంటారా? అయితే మీకు ఖచ్చితంగా Bluetooth Calling (ఫోన్ తీయకుండా మాట్లాడటానికి), Turn-by-Turn Navigation (స్క్రీన్‌పైనే మ్యాప్స్ కనిపించేలా) ఉండాలి. బైక్ నడుపుతున్నప్పుడు ప్రమాదాలు జరగకుండా రక్షించే Emergency SOS ఫీచర్‌ను అస్సలు మిస్ అవ్వద్దు. బోట్ లేదా నాయిస్ బ్రాండ్లలో ఇవి తక్కువ బడ్జెట్‌లోనే దొరుకుతున్నాయి.

Advertisement

Also Read: రూట్ చూపిస్తుంది.. QR కోడ్ స్కాన్ చేస్తుంది! boAt Storm Call 3 ఫీచర్లు నెక్స్ట్ లెవెల్!

4. ది క్యాజువల్ యూజర్ :

నాకు హెవీ ఫీచర్లు వద్దు బాస్, చేతికి స్టైలిష్ గా కనిపించాలి, అప్పుడప్పుడు నోటిఫికేషన్లు చూసుకుంటే.. చాలు అనుకునే కాలేజ్ స్టూడెంట్స్, యూత్ కోసం..

ఏం చూడాలి?: రౌండ్ లేదా స్క్వేర్ షేప్ లో మీకు నచ్చిన లుక్, రక రకాల Cloud Watch Faces మార్చుకునే వీలుంటే చాలు. ఇలాంటి వారు ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా రూ.1,500 నుంచి రూ.2,500 లోపు ఉండే బడ్జెట్ బ్లూటూత్ కాలింగ్ వాచెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌వాచ్ కొనేముందు మీ బడ్జెట్ ఎంత? మీ ఫోన్‌కు అది సపోర్ట్ చేస్తుందా?ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఎన్ని రోజులు బ్యాటరీ వస్తుంది? అనే విషయాలు చెక్ చేసుకోండి. బ్రాండ్ నేమ్ వెనక కాకుండా, మీ డైలీ నీడ్స్ తీర్చే వాచ్‌నే స్మార్ట్‌గా ఎంచుకోండి.

Related News

Google Pixel 11పై బిగ్ డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.19,000 ఆదా చేసుకునే అవకాశం!

ఇది మామూలు ఫోన్ కాదు భయ్యా.. 200 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో ఒప్పో సరికొత్త రికార్డ్!

Apple Watch Series 11పై అమెజాన్‌లో క్రేజీ డీల్.. యాపిల్ ప్రియులకు ఇంత కంటే మంచి ఛాన్స్ రాదు!

5Gకి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది..త్వరలోనే జియో 6G ఇంటర్నెట్

రూ.25 వేల బడ్జెట్‌లో ఐదు అదిరిపోయే ఫోన్ ఆఫర్లు.. ఏది కొనడం బెస్ట్ అంటే?

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

Big Stories

Advertisement
×